చిన్నప్పటి నుంచి నాకో పెద్ద సందేహం... అది ఆలోచిస్తూ కూర్చున్నాను.. పెద్ద శబ్దం! ధడేల్ మని ... నా చేతిలో ని కాఫీ కప్పు నేనే విసిరికొట్టాను ... నాకు చాలా ఇష్టమైన కప్పు .. నాకు మా ఆఫీసు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన కప్పు! కానీ పగలగోట్టేసా! అలా సైకో ని చూసినట్టు చూడకండి నన్ను .. నా విసుగు .. చిరకు.. నాకు సంబందించినవే.. అరె నా పేరు చెప్పటం మర్చిపోయా నా పేరు అనన్య!
కప్పు పగిలిపోటం తో నాలోని కోపం కూడా చల్లారిపోయింది ... ఆలోచించటం మొదలు పెట్టాను .. ఫోన్ చేశా తిరిగి ... నేను మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పెట్టేసినా సరే నేనే చేస్తా ... చెయ్యాలి! లేదంటే నాకు పొగరు స్వార్ధపరురాలిని ... ఫోన్ మోగుతోంది .. ఎత్తారు ..
"ఏంటే ? ఎన్ని సార్లు చేస్తావ్ ? చెప్పా కదా .. నాకు చిరాగ్గా ఉంది అని ?"
"అదేమీ లేదమ్మా .. నీ ఇష్టం అని చెప్పుదాం అని ఫోన్ చేశా!"
అవతల వైపు నుంచి నీరసంగా చిరాగ్గా ఉన్న గొంతు కాస్తా , ఉత్సాహం గా మారిపోయింది...
"నిజంగా నా .. నా తల్లే ! నీకు పూర్తిగా ఇష్టం అయ్యే ఒప్పుకున్నావ్ గా?"
"హా " అని ఊరుకున్నాను.. ఇప్పటి వరకు మాట్లాడను, హాస్పిటల్ కి వెళ్ళను , నా జీవితం లోని ఆనందం అంతా నువ్వే హరించావు అంటేనే కదా నేను ఒప్పుకున్నది .. black mail చేసి ఒప్పుకునే లా చేసింది కాక .. ఇష్ట పడి ఒప్పుకున్నావ్ కదా అంటే ఏం చెప్పాలి ?
"నీ ఇష్టం లేకుండా అయితే వద్దు !"
"అమ్మ .. ఇందాకే మాట్లాడుకున్నాం.. మళ్ళి మళ్ళి .. నాకు discuss చేసే ఓపిక లేదు .. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి .."
"అదిగో ... నీ ఆనందం కోసమే కదా "
"ఏం కావాలి నీకు ? నేను ఆనందం గా ఉండటమా ? ఒపపుకోటమా?"
"రెండూ..."
"ఒప్పుకోటం .. బలవంతం ఒప్పించవచ్చు కానీ .. ఆనందంగా ఉండమని బలవంత పెట్టలేరు .. అలా పెట్టినప్పుడు ఆనందంగా ఎవరూ ఉండరు"
"చూడు అన్నీ అవే సర్దుకుంటాయి"
"సరే!"
ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాను నేను... ఎందుకు ఇంత complicate అయ్యిపోయింది నా జీవితం అని ..
ఈ లోపల మళ్ళి ఫోన్ రింగ్ అయ్యింది.. క్యాబ్ wait చేస్తోంది అని ...
*****
క్యాబ్ లో కూర్చున్నా నా ఆలోచనలు వెంటాడుతునే ఉన్నాయ్! రెండేళ్ళ క్రితం వరకు నాకు ఏ బెంగా ఉండేది కాదు! ఎంతో హాయిగా .. ఆనందంగా ఉండేది ... చదువుకుంటూ .. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి అనే కసి తో ఉద్యోగం కాకపోతే .. కనీసం అమెరికా వెళ్ళాలి అనే ఆశ తో చదివే దానిని .. అప్పుడు నాకు అది భారం అనిపించలా .. చాలా హాయిగా ఉండేది ... అప్పుడప్పుడూ కొంతమంది .. ఓర్వ లేక బాధ పెట్టినా అదొక వేరే పర్వం.. కానీ శ్రీను ...మా చిన్మయి వాళ్ళ చుట్టాలబ్బాయి మా కాలేజీ నే కానీ .. వేరే సెక్షన్ .. చిన్మయి కోసం వచ్చినప్పుడల్లా .. మాటలు కలిసి స్నేహితులం అయ్యాము ... కాలేజి అయ్యిన నలుగు నెలలకే చిన్మయి కి పెళ్లి అయ్యింది ... నేను శ్రీను ఉద్యోగాల వేట లో హైదరాబాదు మీద పడ్డాం ... నేను అమ్మాయిల హాస్టల్ లో .. తను వాళ్ళ బంధువుల ఇంట్లో ... కానీ కలిసే కోర్సులు నేర్చుకున్నాం ... కలిసే ఉద్యోగ ప్రయత్నాలు చేశాం ... ఎప్పడు ఇష్టం ఎలా ఇష్టమో నాకు తెలియదు ... అతను కాలేజీ రెండో సంవత్సరం నుంచే ఇష్టమని చెప్తున్నా .. పట్టించుకోలేదు ... కానీ .. హైదరాబాదు వచ్చిన తోలి రోజుల్లో .. ఉద్యోగం రాలేదనే నిరాశని ... ఇంటి నుంచి ఎన్ని రోజులు ఇలా డబ్బులు తప్పించుకుంటాము అనే బెంగని పంచుకోటానికి తానొక్కడే ఉన్నాడు కాబోలు అతనంటే ఎంతో అభిమానం తో పాటు .. ప్రేమ కూడా మొదలైంది .. అతను ఉంటే ఎలాంటి కష్టాలైన .. పెద్ద లెక్క కాదు అనే ధైర్యం వచ్చింది .దానితొ పాటే ఉద్యోగమూ వచ్చింది ...మా ఇంట్లో పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టారు .. అతను వాళ్ళింట్లో నా గురించి చెప్పాడు ... ఎంతో గొడవ చేశారు ... స్నేహితులనుకున్నాం .. ఇదా మీ నిర్వాకం అన్నారు ... శ్రీను బాగా బలవంత పెట్టటం తో వాళ్ళ నాన్న నా వివరాలు తెలుసుకున్నారు ... నేను అతనికన్నా నలుగు నెలలు పెద్ద దానిని అని తెలిసి ... ససేమీరా అన్నారు ... నాకు ఫోన్ చేసి వాళ్ళబ్బాయి ని వలలో వేసుకున్నాను అన్నారు ... ఆ రోజులు తలచుకుంటేనే ఇంకా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ... శ్రీను కి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది..
"అను.. నన్ను మర్చిపో రా మీ ఇంట్లో చెప్పిన వాళ్ళని చేసుకో "
"నాలుగేళ్ళు వెంట పడ్డావ్ ? ఇప్పుడు మర్చిపో అంటున్నావ్ ...అంతా నీ ఇష్టమేనా ?"
"అది కాదు రా ... ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఎం చెయ్యగలం చెప్పు నువ్వే ?"
"పెళ్లి చేసుకోలేమా?"
"లేచిపోయా ? నీకు ఈ లోకం గురించి తెలియదు కాకుల్లా పొడుచుకు తింటారు మన కుటుంబాలని "
"పెద్ద పెద్ద ఘోరాలు చేసిన వాళ్ళనే మర్చిపోతున్నారు ... ఐన ఇదేం పాపం కాదు ... మనం చిన్నపిల్లలం కాదు .. ఇద్దరికీ 24 ఏళ్ళు వచ్చాయి .. ఉద్యోగాలు ఉన్నాయ్ ... ఇంట్లో మన ఉద్దేశాలు చెప్పాము .. ఇంకా వాళ్ళు అంగీకరించక పొతే ఏం చేస్తాం ఇంతకన్నా ?"
"నేను అంత బరితెగించాలేను ?"
నా గుండె జారిపోయింది ... నా ప్రేమ ఏ పాటిదో అర్ధం అయ్యిపోయింది .. కళ్ళలో నీళ్ళు తిరిగాయి ..
"బరి తెగింపా ? సరే శ్రీను నేను వెళ్తున్నా ... "
అని వచ్చేస్తుంటే ...
"నేను ఎప్పటికీ పెళ్ళి చేసుకోను అను ... మా వాళ్ళు నిన్ను నన్ను ఇంత బాధ పెట్టారు కదా వాళ్ళకి నా బాధ నీ బాధ తెలియజెప్పేలా చేస్తా ఒట్టు!"
నాకు పిచ్చి కోపం వచ్చేసింది .. ఏం నిరూపించాలి అనుకుంటున్నాడు ఇతను? అసలు నేను ప్రేమించింది ఇతనినేనా అనిపించింది ...
"మీ వాళ్ళని సాధించలనో ... ఇబ్బంది పెట్టాలనో నేను అనుకోటం లేదు ... మనిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం కాబట్టి కలిసి ఉండే మార్గం చెప్పాను ... అది లేనప్పుడు ... మిగతాది అంతా నాకు అనవసరం! ఐనా నువ్వు తీసుకున్న నిర్ణయం మీద నిలబడలేని వాడివి ... నువ్వు .. ఈ రోజు ఏదో ఒట్టు వేస్తే అదే చేస్తావంటే ఎవరైనా ఎలా నమ్ముతారు ?"
అతని కళ్ళలో నీళ్ళు ... బాధ వేసింది .. కానీ ఎదిగిన మూర్ఖుడిలా కనిపించాడు ... మంచి వాడే కానీ పిరికివాడు ..
"నిజం రా నేను అమెరికా వెళ్ళి ఇంకా అస్సలు మా ఇంట్లో వాళ్ళతో మాటలడను నువ్వు మీ వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకొని హాయిగా ఉండు " అన్నాడు
"శ్రీను వెళ్ళే ముందు ఒక్క మాట చెప్పనా ? నువ్వు చూస్తూ ఉండు నాకంటే ముందు నువ్వే పెళ్ళి చేసుకుంటావు!"
అతను ఏదో చెప్పబోయి ఆగిపోయాడు ... నేను వెనక్కు తిరిగి నడిచి వచ్చేసా!..
Madam ... Office ఆ గయా అని క్యాబ్ డ్రైవర్ అనటం తో ప్రస్తుతం లోకి వచ్చి .. క్యాబ్ దిగి ఆఫీసు లోకి నడిచాను.
******
"అను ... "
"హా "
"ఇధర్ ఆవో నా ఏక్ స్వీట్ తో లేకే జావో !"
మా colleague పిలిస్తే వెళ్ళి ...
" క్యా బాత్ హై భాయ్ .. being such a miser .. you are distributing sweets ? "
"అను తుం భీ నా "
"వాడికి పెళ్ళి కుదిరిందంటే ... " అనుకుంటూ వచ్చింది మాలిని ..
"అచ్చా congratulations !!!"
"వీడికి పిల్లనిచ్చేది ఎవరో అడగవా ?"
"మాలిని .. బస్ కర్ యా .. క్యా కమీ హై ముజ్ మే ?"
మాలిని ఆలోచిస్తున్నట్టు గా నటించిని
"అంతా ఓకే కానీ ... వాగుడే కాస్త ఎక్కువ !"
అని నవ్వుతూ ... అది చెప్పింది నిజమే అని నవ్వొచింది నాకు ... పొద్దున్న నుంచీ ఇదే నేను నవ్వటం ... అని గుర్తొచింది ...
"when you only got someone to bear you ... I easily get a girl .."
నేను ఫక్కున నవ్వాను ... "బాబు నీ ఇంగ్లీష్ ఆపు ఇంకా " అని మాలిని దణ్ణం పెట్టింది ... "సందు దొరికితే మా ఆయన మీద జాలి పడతావ్ .. అక్కడికి ఆయనేదో నన్ను పెళ్ళాడి త్యాగం చేసినట్టు ... " అని నా వైపు చూసి ...
"పదవే ... పని చూసుకుందాం ...పొద్దున్నె వీడి గోల"
********
system ముందు కూర్చున్నానే కానీ పని కదలటం లేదు ... చాలా విసుగ్గా ఉంది ... మళ్లీ ఏవో గుర్తుకొస్తున్నాయి ... నేను ఆ రోజు తనని వదిలి వచ్చేశాక అతను అమెరికా వెళ్ళిపోయాడు ... నాకు కానీ ... నా స్నేహితులకు కానీ ఒక కబురు లేదు ... అతని నెంబర్ కోసం చాలా ప్రయత్నించాను ... ఎవరు అడిగినా .. తన కాంటాక్ట్ ఇవ్వద్దని .. ఆఫీసు లో చెప్పాడు అంట ... ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడటం లేదని తెలిసింది .. అప్పటికి నాకు బంగళూరు లో ప్రాజెక్ట్ దొరికింది ... వెళ్ళిపోయాను .. అతనంటే కోపం .. నా ఆత్మాభిమానం చంపుకుని ఇంకెప్పుడూ అతన్ని కలవాలి అని ప్రయత్నించలేదు ... చూస్తుండగానే సంవత్సరం గడిచింది... అతనికి పెళ్ళి కుదిరింది అని ఎవరో చెప్పారు ... చాల బాధ అనిపించింది ... ఆ విషయం తెలిసిన రోజు చాలా చాలా ఏడ్చాను ... మోసపోయానే అనిపించింది ... అతను జీవితాంతం పెళ్ళి చేసుకోకూడదు అని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ .. మరీ సంవత్సరానికే చేసుకుంటాడు అని కూడా అనుకోలేదు .. మళ్ళి మాములు గా ఆఫీసు ... ఇళ్ళు ... మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు ... పిల్ల లావుగా ఉంది అని కొందరు ... కట్నం సరిపోదు అని కొందరు వంకలు పెడుతుంటే చిరాకు వచ్చేది ... అసలా చిన్నప్పటి నుంచి ఈ.. resume forwarding పెళ్ళిళ్ళు అంటే పెద్దగా గిట్టేది కాదు ... శ్రీను విషయం తో ... ఇలా ప్రేమ పెళ్లి అన్న చిరాకేసింది ...మొత్తానికి పెళ్లి చేసుకోకూడదు అని అనిపిస్తోంది ... అందరూ సలహా ఇస్తున్నారు ... "ఆడ జన్మ పరిపూర్ణం అంటే పెళ్ళి తోనే అవ్వుతుంది ... నీకొక తోడూ కావలి "
ఇలా mother theresa పెళ్ళి చేసుకోకుండా ఉండలేదా ? నేను ఉండలేనా ? ఇలాంటి ప్రశ్నలతో ... ఎద విసుగు మోస్తోంది .. రోజూ ... ఎవరిని ప్రశ్నించను ? ఏమని ప్రశ్నించాలి ?....
"ఎవ్వరినీ ప్రశ్నించకు ..." అని ఒక గొంతు వినపడింది ..
తిరిగి చూస్తే మాలిని నవ్వుతోంది ...
"పైకి ఎమన్నా అన్నానా ?"
"లేదే ... నీ మొహం చూస్తే అర్ధం అవ్వుతోంది ... పదా కాఫీ తాగుదాం .."
********
ఇద్దరం కాఫీ తెచ్చుకొని బయట కూర్చొని తాగుతున్నాం ... నా బాధ అంత ఎవరికన్నా చెప్తే బాగుండు అనిపించింది ... తనకు చెప్పాను .. తను మొత్తం విని ... చిన్న నవ్వు నవ్వి ..
"పిచ్చి అను ... నీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నావో అది నీ ఇష్టం ... కానీ నీ ఇష్టం తో అందరూ ఏకీభవించాలి అనుకోటం అమాయకత్వం"
నాకు అర్ధం కాక చూస్తున్న తనని ...
"ఇలా చూడు .. ఒక్కోళ్ళకి జీవితం పై ఒక్కో రకమైన అవగాహన ఉంటుంది! అవునా ? దానితో పక్క వాళ్ళకి వాళ్లకి తోచిన సలహాలు ఇస్తూ ఉంటారు ... ఇంక మీ అమ్మ అంటావా .. ప్రపంచం ఏమంటుంది ... కూతురు ఒక్కతే సంతోషంగా ఉండగలదా ... లోకం ఉండనిస్తుంది అంటావా అని ఆవిడ భయాలు ఆవిడవి ... పైగా మనం దగ్గరగా ఎవరిని చూసి ఉండము కదా పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళని .. కాబట్టి జీర్ణించుకోవటం కష్టం... చూడు ముందు నువ్వు క్లియర్ గా ఉండు నీ బాధని ఇంట్లో వాళ్ళతో పంచుకో .. అర్ధం అయ్యేలా చెప్పు ... వినరు చెప్తూనే ఉండు కోపగించుకోకు ... చెప్తూనే ఉండు .. ఎందుకంటే నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్ కాబట్టి ... నీకు ఇంపార్టెంట్ కాని వాళ్లకు నువ్వు explain చెయ్యక్కర్లేదు .. అలంటి వాళ్ళ మాటలకు irritate అవ్వక్కర్లేదు. ఎవరూ ఎవరినీ బలవంత పెట్టలేరు. నీకు ఒక quote చెప్పనా ... "If you are clear enough .. you will have nothing to choose .. you just know what to do "
తన మాటలో .. మరి కాఫీనో తెలియదు ..... కానీ చాలా ఉత్సాహం వచ్చింది .... ఇంతలో ఫోన్ మోగింది ...
"హలో "
"ఆ సంబంధం వద్దు అనుకున్నాం రా .."
"ఏమైంది "
"వాళ్ళు మరీ సంత లో బేరం ఆడినట్టు 25 సవరలు 22 సవరలు బంగారం ఇలా మాట్లాడారు ... చూడబోతే నువ్వు చెప్పిందే కరెక్ట్ లా ఉంది ... ఏదైతే అది అయ్యింది ... నీకు మనస్కరించి ... మనకు తగిన సంబంధం అనిపిస్తేనే ముందుకు వెళ్దాం అని అన్నారు నాన్న ... నువ్వు మాత్రం దిగులు పెట్టుకోకు!"
అని ఫోన్ పెట్టేసింది అమ్మ.. ఎంతో తేలిక పడింది గుండె .. లేకపోతే లక్షా .. రెండు లక్షలు అని బేరం ఆడే వాడు ఇంద్రుడైన ... నేను చేసుకోలేను ....
మాలిని వైపు చూసి నవ్వి ... "పదవే చాల పని ఉంది ... చాలా చాల థాంక్స్ వే !"
"నీ మొహం లే పద!"
అది హాయిగా చిరునవ్వు విసిరి.
P. S : All Characters, incidents and conversations are purely fictional .. Any resemblance to a person alive or dead is purely coincidental .