Wednesday, April 03, 2013

10 AM, Hitech City Station

 అసలు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలా? అని ఆలోచిస్తున్నాను అండి! నేక్లేస్స్ రోడ్ స్టేషన్నుంచి నేను బయలుదేరిన దగ్గర నుంచా? లేదంటే Hitech  సిటీ స్టేషన్లో దిగిన దగ్గర నుంచా?అసలు ఈ introductions అంటేనే మహా చెడ్డ చిరాకు అండీ బాబు!మనం రాయవలసిన దానిని క్లుప్తంగా చెప్పాలంట! కాస్త ఎక్కువ చెప్దాం అంటే మొత్తం ఇక్కడే చెప్పేసావ్ ఇంకా లోపల ఏమి చెప్పుంటావు అంట?అని  ఎక్కడ  మిగతాది  చదవకుండా   వెళ్ళి పోతారో అని భయం. పోనీ, తక్కువ చెప్దాం అంటే ముందు ఏముందో చెదవాలన్న ఆసక్తి రాదాయే! అంత
రానప్పుడు  రాయటం ఎందుకు?ఇలా మాకు దేని గురించి చెప్తున్నవో దాని గురించి చెప్పకుండా ఈ సోది ఎందుకు?
అని మీరు కసురుకునే లోపలే చెప్పేస్తున్నా...


పొద్దునే లేచి... MMTS ( లోకల్ ట్రైన్ ) ఎక్కితే ఎలాంటి అనుభవం ఎదురువ్వుతుంది  అనేది మన ప్రస్తుత విషయం



 ట్రైన్ వచ్చి platform మీద ఆగింది చూసి పరుగేతుకుంటూ స్టేషన్ లోపలి వెళ్ళి ఒక టికెట్ కొన్నాను. ఎక్కడ  రైలు కదిలిపోతుందో,అని చిల్లర కూడా పూర్తిగా తీసుకోకుండా... రైలు ఎక్కేసాను!(అప్పుడే  కదలటం  మొదలు
 పెట్టిన  రైలు) చాలా గొప్పగా నాకు చేతనైనంత లో సామాజిక భాద్యతను తీసుకుంటాను అని పైకి అనక  పోయినా ,మనసులో అనుకునే నేను,పొద్దునే చేసిన భాద్యతా రాహిత్యమైన పని, కదులుతున్న రైలుని ఎక్కటం!పోనీలే బ్రతికే ఉన్నావు కదా,ఎందుకు ఈ సొప అని అంటారా?కానీయండి  ఇలా ఎన్ని తప్పులకు రాజీపడి, సమర్ధించుకుని  బ్రతికేయటం లేదు! ఎక్కిన తరువాత సీట్ లో కూర్చున్నా, అందరూ అంటే అందరూ, head set పెట్టుకొని పాటలు వింటున్నారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్ప! వాళ్ళు, వాళ్ళలో వాళ్ళే ఏదో మాట్లాడుకుంటున్నారు. చిన్నప్పుడు పరాయి వాళ్ళ తో మాట్లడద్దు అని అమ్మ చెప్పిన విషయాలు అందరూ ఎంతో చక్కగా పాటిస్తున్నారు!అనిపించింది. నాకు ఇంకో అనుమానం కూడా వచ్చింది. నాకు  ఏమీ  తోచక  ఎవరినన్నా  పలకరించినా  నా  వైపు  అనుమానం గా చూసి జవాబు చెప్పరు అని.ఇంక  చేసేది ఏమి లేక నేనూ నా హెడ్ సెట్ తీసా కనీసం ఇళయరాజా గారి వాద్యాలలో బాలు గారు పలకరిస్తుంటే పులకరిద్దాం అని.ఈ లోగ భారత్ నగర్ స్టేషన్ లో ఇద్దరు ఎక్కారు. బహుశా  HITECH CITY స్టేషన్ కే అనుకుంట!నా  హెడ్ ఫోన్స్ లోంచి కూడా నాకు వాళ్ళ సంభాషణ వినిపించింది .. అబ్బా అలా అనుమానంగా చూడకండి! నిజంగానే వినిపించింది అండి .. నేను కావలి అని వినలేదు!
"మా చిన్ను గాడికి నేను రోజు ప్యాక్ చేసే పంపుతా అక్కడ వాళ్ళు food provide చేసినా కానీ, నాకెందుకో నేను
పంపిందే  తింటాడు అనిపిస్తుంది. అందుకే .."
"అవును  సరిత, ఏదో మనకు కుదరక కాని మన లా వాళ్ళు చూసుకోగలరా? చెప్పు"
"వాడిని వదిలి పెట్టి రావాలంటే రొజు.. నా గుండె భారం గా ఉంటుంది ...At the same time
 I don't want to take a break in career"
"That  is okay yaar ... you will out grow this .. baby is not missing you right !"

సరిగ్గా ఇక్కడే నాకు ఆసక్తికరం గా అనిపించి నా సాంగ్ pause చేశా! అబ్బా... దయ చేసి అలా ఉరిమి చూడకండి..
ఎంతో మందికి ఉండే సమస్య వీళ్ళు ఏం సారంశంకి వస్తారో అని చిన్నకుతూహలం అంతే!(దీనినే సమర్దినచుకోవటం
అంటారు లే అంటారా ? సరే కానివ్వండి )

"వాడు ఈ మధ్యన నడవటం మొదలు పెట్టాడు తెలుసా,చిన్ని చిన్ని అడుగులు వేస్తున్నాడు, గోడ పట్టుకొని ఎంత
happy గా  ఉంటుందో వాడిని అలా చూస్తుంటే, అదే నేను ఇంట్లో వుంటే వాడి ఫస్ట్ స్టెప్ చూసే దానిని
కదా అనిపిస్తుంది "
"సరితా .. You are inflicting this on yourself ! ఏమో నువ్వు ఇంట్లో
ఉన్నా చూడలేక పోయే  దానివి  ఏమో  కదా ! ఇట్ feels  good  ఈఫ్ యు ఆర్ there  బట్ its alright !"
"లేదు  ప్రియా ! బాబు  పుట్టక  ముందు  వరకు కెరీర్ చాలా ఇంపార్టెంట్ అనిపించేది , కానీ ఇప్పుడు వాడి నవ్వు
ముందు అన్నీ చిన్నవి గానే కనిపిస్తున్నాయి చివరికి రజత్ కూడా "
"You are contradicting yourself .. డెసిషన్ ఇస్ సో సింపుల్ .. ఈఫ్ యు లవ్ యువర్ సన్ సో much థెన్ లీవ్
ది జాబ్ న !"
"అదే కదా నా ప్రాబ్లెమ్ , ఐ వాంట్ మై కెరీర్  టూ .. లెట్ మీ  సీ  ఫర్ a  while... అండ్ ఈఫ్ కెరీర్ comes ఇన్
between మీ  అండ్ మై సన్ , ఐ విల్ చూసే మై సన్  అండ్ మై సన్ ఇస్ everything for me!

ఆ తరువాత చాల సేపు వాళ్ళు మాట్లాడేది విని తల్లి మనసు ఎంత గొప్పది అని.. ఒక నలుగు, ఐదు మదర్
సెంటిమెంట్ పాటలు గుర్తు తెచ్చుకొని యమ సంబరపడ్డాను.

              నా సంతోషం సంగతి మీకు తెలిసిందగా  ఎక్కువ కాలం నిలవదు ! HITECH CITY స్టేషన్ వచ్చింది ..
ఎక్కువ సేపు ఆగదు బండి  అందరికి దిగాలనే తొందరే! ఒక ముసలాయన .. నడవలేకున్నారు .. కర్ర సాయం
తో నెమ్మది గా దిగుతున్నారు .. ఆయనని నెట్టుకుంటూ వెళ్ళిపోయారు మన మోడరన్ మహా లక్ష్మి లు ... పైగా
లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎందుకు ఎక్కుతారో అని గొణుక్కుంటూ ...

        నేను ఆ స్టేషన్ ప్లాట్ఫారం మీద నుంచొని చూస్తూనే ఉండి పోయా ... పరుగులు పెడుతున్న జనాలని ...
కొడుకంటే ఎంత ప్రేమ ... మరి సాటి మనిషంటే కనీస కనికరం కూడా లేదా ? మరి అలాంటప్పుడు ఆ తల్లిది ప్రేమ
కాదేమో అనిపించింది .... స్వార్ధం! ... కాక మరేమిటి ? ప్రేమ అంటే పరిపూర్ణత ఉంటుంది .. కరుణ ఉంటుంది .... ఆ
ముసలాయన ప్రాణం కంటే మనకు ఆఫీసు కి చేరటమే ముఖ్యం ...మూల్యం గా .. అయన ప్రాణాలని చెల్లించి ఐన..
మన గమ్య స్థానం  చేరిపోవాలి !ఒక్క నిముషం ఆగి చూస్తే అందరు పరుగెడుతూనే  ఉన్నారు. అంత యాంత్రికంగా
బ్రతకటం ... అదే  బ్రతుకు  అనుకోటం ... ఈ పరుగు లో జీవిస్తున్నామో .. జీవితాన్ని నేట్టేస్తున్నమో తెలియకుండా ..
తాయారు అయ్యాం ఏమో అనిపించింది .

  చిన్నప్పటి నుంచి అమ్మ మీద పాటలు విన్నప్పుడల్లా ... మన అమ్మలు అందరూ మంచి వాళ్ళే మరి మనం
ఎందుకు ఇలా ఉన్నాం అనిపించేది ... ఈ సంఘటన తరువాత నాకు ఒక విషయం బోధ పడింది ... అమ్మ  మనకు
మాత్రమె మంచిగా వుంటే అమ్మ అనిపించుకొదు.. అమ్మ తనం  అంటే  పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే అబ్బే తత్త్వం
కాదు ... సాటి మనుషులని కూడా కరుణ  తో  చూడ గలిగినప్పుడే అమ్మ పరిపూర్ణం అవ్వుతుంది అని.. అలాంటి
అమ్మలు కాని  అమ్మలు ఒట్టి బొమ్మలే అని

P.S : NO  OFFENSE  INTENDED ...   THIS  IS  PURELY MY ANGUISH 

5 comments:

  1. Baga rasav ....
    I agreee with u.

    ReplyDelete
  2. Last emi punch ichav ammayi ... its true

    ReplyDelete
  3. Great..Ammathanam and Love ni chala baga chusavu and Thank You for showing us too with your words..

    Nenu asalu books chadavanu naaku alavatu ledu yevarina chadivi chepthe vintanu...nee blog chadhuvuthunte chala bagundi so short..simple..pedda pedda words emi things kaadu just chinna chinna things yentha nerchukovachu life lo anipisthundi...:)

    Too good darling..:)

    Nalini

    ReplyDelete