Sunday, October 20, 2019

గుర్తుకొస్తున్నాయి...


దిం దిగి దిగిడి దిగిడి... దిం దిగి ...ఇదే 90s  kids ఫీలింగు. థమన్డిస్కో రాజాపాటబాలుగారితో పాడించారు. సాహిత్యంసిరివెన్నెల సీతారామశాస్త్రిగారిచే వ్రాయించారు అని...
‘Jungle Book’ మళ్ళీ తీస్తున్నారంటే ఆఫీసుల్లోనే గంతులేసి చప్పట్లు కొట్టిన వాళ్ళం మనం. ‘Lion King’ మళ్ళీ తీస్తున్నారంటే "Yess" అని రోడ్ మధ్యలో అరిచిన బాపతు మనం, చూసే వాళ్ళంతా పిచ్చి పట్టిందేమో అని అనుకున్నా సరే! మహా అయితే నిమిషం కొంచెం embarass అయినా మళ్ళీ మామూలే. ఎందుకంటే, nostalgia is such a strong feeling. గతమైపోయిన బాల్యం అంటే మమకారం ఎవరికి ఉండదు? We are not an exception. అలాంటి మనకు బాలు, శాస్త్రి గార్ల పాట ఒకటి retro స్టయిల్ లో, ఇళయరాజా శివ తాండవం చేసిన 80s , 90s ని గుర్తు చేస్తూ, ఆయనతో పాటు  అక్కడక్కడా చక్రవర్తి గారిని, బప్పీ దా (బప్పీ లహరి)ని గుర్తు చేస్తూ ఉండే పాట అంటే... ఫీలింగ్ ఎలా ఉంటుంది??? ఈ పాటలోనే అన్నారుగా  “భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా... స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా ?!!!" అని. అలాగే ఉంటుంది.
పాట గురించి చెప్పుకునే ముందు పాటగాడి గురించి చెప్పుకుందాం...
అతడుసినిమాలో బ్రహ్మానందం గారి డైలాగులావేరే సింగర్స్ season లాంటి వారు. వస్తుంటారు, పోతుంటారు. కానీ బాలు గారు చెట్టు. శ్రోతల హృదయాల్లో పాతుకుపోయారు’. సాహిత్యాన్ని స్వచ్ఛంగా ఉచ్చరించడమే కాదు, దానిలో ఉన్న భావం కూడా ధ్వనిలోనే అర్ధమయ్యేలా పాడగల ఉద్దండుడు ఆయన. ఎమన్నా doubts ఉంటే ఇదే పాటలో "చిరునామా లేని లేఖంటి నా గానం... చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి... నచ్చిందో లేదో చిన్న సందేహం తీర్చేశావేమో ఈనాటికి..." అనే లైను వినండిఅక్కడ ఆయన ‘నేను నచ్చానో లేదో అని సందేహిస్తున్నా, దాన్ని తీర్చేశావు ఈనాటికి’ అని గోముగా అంటారు చూడండీ... ఆయన డైలాగులోనే ‘అద్భుతః’

ఇక పాట వ్రాసిన వారి దగ్గరకి వద్దాం...

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారంటే చాలా మందికిఆయన inspirtaional songs బాగా వ్రాస్తారుకదా అనే ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. వాటితో పాటు రొమాంటిక్ పాటలు కూడా చాలా అద్భుతంగా వ్రాస్తారు. అందుకు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న పాటే ఉదాహారణ. అలాగే, youthful పాటలు కూడా బాగా వ్రాస్తారు. మీకేమైనా అనుమానం ఉంటే ‘son of సత్యమూర్తిలోని ‘Come to the party subbalakshmi’ పాట వినండి, తీరిపోతుంది. ఇక పాటలో "రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం... రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని పెంచుదాం" ‘ఎంత భావుకత! ఎంత రొమాంటిక్!’ అనిపించక మానవు అలానే Atlas shrugged పుస్తకం చదివిన వారికి  పై లిరిక్స్ విన్న తరువాత Ayn Rand's Herioine Dagny Taggart " It's amazing right the pleasure we can get with our bodies" అన్న మాటలు గుర్తురాక మానదు. 

థమన్ గారిని మాత్రం  పాటలో ‘ఘంటసాల వేంకటేశ్వరరావు’ గారు పూనేసినట్టు ఉన్నారు. retro స్టైల్ ని ఎంత అద్భుతంగా చేశారో శాస్త్రి గారి చేత సాహిత్యం వ్రాయించిబాలు గారి చేత పాడించి, ‘ పాత మధురం’ అనిపించేలా 90's kids  పాటని మళ్ళీ మళ్ళీ వినేలామళ్ళీ మళ్ళీ బాల్యాన్ని గుర్తు చేసుకునేలా చేసినందుకు ఎన్నిసార్లు ‘thanks’ చెప్పినా సరిపోదేమో. ఇదే తరహా retro style లో 'బలుపు' సినిమాలో బాలు గారు పాడిన, శాస్త్రి గారు వ్రాసిన " ఏమైందో " పాట కూడా థమన్ గారు స్వరపరిచినదే.

It's amazing right the pleasure music can give us, the pleasure nostalgia can give us, the pleasure Balu garu can give us by absolutely loving the song he is singing, the pleasure Sastry garu gives us by writing his every song as if it were his first love letter, the pleasure they give us by working together on these songs... May be they even sing  the following while working and absolutely loving their work   దిం దిగి   దిగిడి దిగిడి... దిం దిగి  ...”