నా కలల్ని ప్రేమించే కళ్ళ కోసం ఎదురు చూస్తున్న
నా ఆశల్ని ఇష్టపడే శ్వాస కోసం చూస్తున్న
ఎదురు పడిన ప్రతి వారి లోనూ నువ్వున్నవేమో అని చూస్తున్న
నువ్వు ఐతే నా మనసు నాకు చెప్పదా?? అని నవ్వుకుంటున్న
కళ్ళు మూసి ఈ దాగుడు మూతలు ఇంకేన్నాలు హృదయమా !!
నా కన్నుల ప్రమిద లో ఆనందపు జ్యోతి ని వెలిగించే .... వెలుగు వై రావా నేస్తమా ....!
Thursday, December 24, 2009
Naa kalala teeranni vethukuthu....
ఆటు పోటు ల జడిలో నీ కోసం వేచి ఉన్నా
కన్నీటి అలల పై నీ కోసం నిరీక్షిస్తున్నా ...
నీ కోసం నేను రాల్చిన కన్నీరంతా ఒక సముద్రం అవుతుందేమో ... !!
నీ కోసం నేను చూసిన సమయమంతా కలిపి ఒక జీవితం అవుతుందేమో ..!!
రోజుకి రెప్ప వాలినన్ని సార్లు నువ్వు కనిపిస్తుంటే నువ్వు నిజం గానే వచ్చావేమో అని భ్రమ పడుతున్నాను !
నిముషానికి దెబ్బై రెండు సార్లు నీ పేరు నే తలచుకునే గుండె చప్పుడు ఇతరులకి వినిపిస్తుందేమో అని కంగారు పడుతున్నా !
కన్నీటిని కంటి కింద అణచిపెట్టి చిరునవ్వుని పెదవి పైకి తెప్పించటానికి కష్టపడుతున్నా ... !
ఎంత కాలం ఈ మౌనం ?! ఎంత కాలం ఈ నిరీక్షణ ?!
నీ చిరునవ్వు ఎండ మావేనా ?!
నాకు అందనే అందదా??

Subscribe to:
Posts (Atom)