నేను కల కన్నది ఇదేనా ? పొద్దున్న ఉలిక్కి పడి, నిద్ర లేవక ముందు నాకొచ్చిన కల ఇదేనా? ఇది కలేనా? కల అయితే ఎంత బాగుండు, ఇప్పుడు నేను ఉలిక్కి పడి లేచి, ఇంట్లో హాయిగా నా మంచం మీద వెచ్చని దుప్పట్లో ఉంటే ఎంత బాగుణ్ణు! కానీ నాకు నా కళ్ళ ఎదురుగా ఉన్న ఈ చీకటి, చీకట్లో పౌర్ణమి వెన్నెల కాంతి లో, ఇలా బిక్కు బిక్కు మంటూ , అదే ఈ పరిస్థితి లో కాకుండా ఉండి ఉంటే, మల్లె పూలు విరజిమ్ముతున్నట్టు ఉన్న వెన్నెలని ఆస్వాదించే దానిని. చిన్న చినుకు చుక్క నీళ్ళలో పడిన శబ్దం, ఆ శబ్దానికి ఉలిక్కి పడ్డాను, తీరా చూస్తే నా నుదుట చెమట ధారలా కారి, కిందనున్న మడుగులో పడిన శబ్దం అది....
ఇక్కడ కూర్చుని ఈ సమయం లో ఇలా ఆలోచిస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక రెండు రోజుల క్రితం నా జీవితం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది! ఎక్కడి నుంచో, ఏదో ఒక మూలుగు వినిపించింది.. వెళ్ళనా? ఏమో ఇది నా కోసం పన్నిన వల అయితే? అమ్మో అది తలచుకోవటానికి , చాలా భయంగా ఉంది. ఒక వేళ అది నిజంగానే సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రాణి అయితే? ఇది ఇంకా భయం కలిగించింది. ఎప్పుడూ పెద్దగా, దేనికీ ఏడ్చిన వ్యక్తిని కాను నేను, నిస్సహాయత ఇంత దారుణం గా ఉంటుంది అని మొదటి సారి అనిపించిన తరువాత, ఏడుపు వచ్చింది, ఈ చీకట్లో.. వెన్నెల్లో.. అడవిలో, ఈ చెట్టు మీద కూర్చోని నిస్సహాయంగా రాలుతున్న కనీళ్ళు తుడుచుకుంటూ, ఈ పరిస్థితికి కారణాలు అన్వేషించ సాగాను..
***
"యశు, మనకు ఈ వారం రోజులు హాలిడేస్ కదా, నేను మా ఇంటికి వెళ్తున్నాను. నువ్వు కూడా మా ఇంటికి రావే ప్లీజ్"
" మీ ఇంటికా? అమ్మో మా ఇంట్లో ఏమంటారో?" వెళ్ళాలి అనే ఉంది, ఎంత స్నేహితురాలు ఐనా, తను అడగ్గానే ఎగిరి గంతేసి ఒప్పుకుంటే ఏం బాగుంటుంది అందుకే ఈ బెట్టు.
" అబ్బా ! మీ ఇంట్లో నేను అడుగుతాను. ఐన నేను ప్రతి హాలిడే కి మీ ఇంటికి రావటం లేదా? ఈ సారి నువ్వు వచ్చి తీరాల్సిందే!" తన పద్ధతి లో హడావుడి చేస్తోంది రేణు.
తను, నేను కలిసి నాన్నగారిని ఒప్పించాము. రేణు వాళ్ళ ఊరు చూడాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా,
యానం దగ్గర చిన్న పల్లెటూరు కనకాలపేట తనది. చాలా పాత ఊరు, ఇండో ఫ్రెంచ్ కల్చర్, చుట్టూ చిన్న చిన్న అడవులు, ఇవన్ని వినటానికే ఎంతో ఉత్సాహం గా అనిపించింది. అందులోనూ , చిన్నప్పటి నుంచి యానం చూడాలనే కోరిక ఉంది. వీలు కానంత దూరం కాకపోయినా ,ఎందుకో ఎప్పుడూ వీలు చేసుకోలేదు. ఇప్పుడు రేణు వల్ల ఆ అవకాశం వచ్చింది. ఎంతో ఆనందంగా అన్నీ ప్యాక్ చేసుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరాము. యానాం లో దిగిన వెంటనే, మమ్మల్ని వాళ్ళ ఊరు తీసుకెళ్ళటానికి రేణు వాళ్ళ నాన్న గారు, వాళ్ళ మావయ్య పాత ambassedor కారు లో వచ్చారు. హైదరాబాద్ నుంచి యానాం వచ్చిన నాకు 2013 నుంచి అమాంతం 1987 కి వచ్చినట్టు అనిపించింది. అక్కడ ఇళ్ళు, వీధులు మనకు లానే ఉన్నాయి, కానీ చిన్న చిన్న తేడాలు కూడా ఉన్నాయి, అవి ఏంటో స్పష్టంగా తెలియటం లేదు, అయితే అందంగా మాత్రం అనిపించాయి.ఆ అందం ప్రదేశం వల్ల కాదేమో, బహుశా ఇక్కడికి వచ్చాను అనే నా ఆనందం వల్లనేనేమో! యానాం తరువాత, కొద్ది దూరం లోనే కనకాలపేట అంట!
"ఎంత దూరం uncle ఇక్కడి నుంచి మన ఊరు?"
"ఇక్కడి నుంచి 10 Km అమ్మ!"
"మధ్యలో అన్నీ పోలలేనా?"
" కాదు రా, ఊళ్లకు చుట్టు పక్కల పొలాలు ఉన్నాయి. ఊరు నుంచి దూరం వెళ్ళే కొద్దీ అంటే యానాం కి మన ఊరుకి మధ్యలో అడవి ఉంది."
"హయ్య ! అడివా? exciting !!"
"లేదమ్మా , ఇక్కడ అడివి చాలా ప్రమాదం, జంతువులు బానే ఉంటాయి! ఎలుగు బంటులు, నక్కలు, చిరుతలు, ఒకటో రెండో పులులు కూడా ఉన్నాయి అంటుంటారు"
"అవునే బాబు, ఇంక పాముల సంగతి సరే సరి! మా ఊర్లోకే చాలా వస్తాయి"
అని పూర్తి చేసింది.
దూరంగా ఏదో ఆలయ గోపురం లా అనిపించింది... వెంటనే "అది ఏంటి?" అని అడిగాను.
"అదా? శివాలయం. చాలా పాతది. ఒక 1000 సంవత్సరాల క్రితం గుడి. చాలా బాగుంటుంది. అసల ప్రతి కార్తిక పౌర్ణమికి ఆలయ గోపురం మీద నుంచి చందమామని చూస్తే, చాలా మంచిదంట! అక్కడే బయట, కోనేరు దగ్గర ఇంకో పెద్ద శివలింగం ఉంటుంది, చీకట్లో కూడా చాలా తేజస్సు తో ఉంటుంది తెలుసా? కటిక అమావాస్య రోజున చూసినా, నల్ల రాతి తో చేసిన శివలింగమే అయినా ఏ దీపం లేకుండా శివలింగం బాగా కనిపిస్తుంది."
"అవునా? ఎందుకలా? ఏదన్న ప్రత్యేకమైన రాయి తో చేసిందా?"
"ప్రత్యేకత రాయి లో కాదమ్మా, ఆ రాయిని దేవుని కింద మలచిన ఆయనలో ఉంది. ఆయనతో పాటు ఈ రోజు వరకు అదే గుడిలో సేవలు చేస్తున్న వాళ్ళ వంశం లో ఉంది. మా ఊరి లో ఉంది."
"మీరన్నది నిజమే అంకుల్ మనలో ప్రత్యేకత లేకుంటే దేవుని లోని ప్రత్యేకతను ఎలా గుర్తించగలం?"
అనుకుంటూ ఉండగానే ఇల్లు వచ్చేసింది.
"ఈ మధ్యనే నేను 10th క్లాసు లో ఉన్నప్పుడు, మా పాత ఇల్లు పడగొట్టి కట్టారు ఇది. ఎంతైనా ఆ పాత ఇల్లే ఇష్టం నాకు. మా తాతగారు పోయాక కట్టారు నాన్న లేదంటే ఆయన అసల ఒప్పుకునే వారు కాదు". అంటూ కారు లోంచి దింగింది రేణు.
లోపల నుంచి రేణు వాళ్ళ అమ్మ పళ్ళెం లో యెర్ర నీళ్ళు పట్టుకొని వచ్చి, గుమ్మం లోనే నన్నూ, రేణుని నుంచో పెట్టి దిష్టి తీసేశారు. రేణుకి చాలా చాలా చిన్న తమ్ముడు ఉన్నాడు. వాడు 5th క్లాసు చదువుతున్నాడు అంట, అస్సలు మాట్లాడాడు చాలా చాలా సిగ్గు పడిపోయాడు, నన్ను చూసి, కొత్త మనిషిని కదా!
ఆ రోజంతా, ఎంతో సందడి గా మా కాలేజీ కబుర్లు రేణు వాళ్ళ అమ్మకి, నాన్నకి చెప్తూ గడిపాము. ఆంటీ చేతి వంట, నాకు ఎప్పుడు తెలియని పల్లెటూరి వాతావరణం నాకు చాలా నచ్చేశాయి. రేణు తమ్ముడు సిగ్గుపడటం మాని చక్కగా చిరునవ్వు నవ్వే వరకు వచ్చాడు సాయంత్రానికి. ఆరు బయట పడుకోవాలి అని అనిపించింది నాకు కానీ, పాములు ఎక్కువ తిరుగుతుంటాయి, కార్తిక మాసం చలి లో అది అంత మంచిది కాదు అని అంకుల్ అనటం తో మారు మాట్లాడకుండా ఇంట్లోనే పడుకున్నాం. ప్రయాణం వల్ల అలిసి పోయాం ఏమో, ఇద్దరం పడుకున్న వెంటనే నిద్రపోయాము.
****
ఎవరో నన్ను తరుముతున్నారు, చీకటి ... వెన్నెల వల్ల ఉండే కాంతి పరిగెడుతున్నాను... ఎక్కడికో దూరం గా పరిగెడుతున్నాను... ఇంత లోపల ఏదో తగిలి కింద పడిపోతున్నాను..... ఎక్కడ పడుతున్నాను? చీకటి ఏమి కనిపించటం లేదు.. అనుకుంటూనే కింద పడిపోయాను... ఉలిక్కి పడి లేచాను ... ఒళ్ళంతా చెమటలు పట్టాయి.. నా పక్కన రేణు నోరు తెరుచుకొని మరీ నిద్ర పోతోంది. నవ్వు వచ్చింది. ఇంతకూ నాకు ఇంత భయం కలిగించిన కల ఎంటబ్బా అని ఆలోచించాను, నాకు ఏమి గుర్తు రాలేదు. నాకు అంతక ముందు ఎన్నడూ కల వచ్చిన గుర్తు కూడా లేదు, ఇదే మొదటి సారి నేను ఉలిక్కి పడి లేవటం అప్పుడే తెల్ల వారు ఝామున 5:30 అవ్వటం తో ఇంక పడుకున్నా నిద్ర పట్టదని లేచాను. పొద్దున్నే ఇంటి పెరటి లో ఆంటీ పూజ చేస్తున్నారు, రేణు వాళ్ళ మావయ్య పొలానికి అనుకుంట బయలుదేరుతున్నారు. ఆయన పాపం వినలేరు, మాట్లాడలేరు అందుకే ఆయనకు కనిపించే ల సెల్యూట్ చేశాను "గుడ్ మార్నింగ్" అన్నట్టు, ఆయనా అందంగా, హుందాగా ఒక చిన్న నవ్వు నవ్వారు. ఆరు అడుగుల ఎత్తు, విశాలమైన భుజాలు, అందమైన నవ్వు ఇన్ని ఉన్నా ఆయనకు ఉన్న వినికిడి లోపం వల్ల ఆయనకు పెళ్లి కాలేదు, రేణు వాళ్ళతోనే ఉంటారు.
****
"ఆంటీ మీ దగ్గర ఉన్న ఈ నాలుగు రోజుల్లోనే నేను బాగా ఒళ్ళు చేసేలా ఉన్నాను!"
"నువ్వు మరీను, ఈ మాత్రానికే ! ఇప్పుడు భోజనాల తరువాత ఊరు చూసి రండి"
"సరే. అమ్మా , ఈ రోజు కార్తిక పౌర్ణమి కదా, శివాలయం కి వెళ్లి వద్దామే సాయంత్రం, యశు కూడా చూసినట్టు ఉంటుంది "
"అయ్యో! సాయంత్రం నేను నాన్న గారు యానం లో పెళ్ళికి వెళ్తున్నాం, పొద్దున్నకి అంతా వచ్చేస్తాం, మీరు మావయ్యని తీసుకొని వెళ్లి రండి.కాకపోతే త్వరగా వచ్చేయండి. వచ్చే దారి అంతా అడవి కదా, ఎక్కువ రాత్రి వేళ తిరిగి రావటం అంత మంచిది కాదు!"
"అబ్బా ! నాకు తెలియదా అమ్మా?అయినా మావయ్య ఉంటాడు గా మాతోటి"
"సరే లేవే కనీసం జాగర్త కూడా చెప్ప కూడదా?"
****
మాములు అప్పుడు గుర్తు రాదు కానీ, గుడి అనగానే లంగా వోణి వేసుకోవాలి అనిపిస్తుంది, నేను రేణు తయారు అయ్యాం! చక్కగా ముచ్చటగా. ఆరింటికి బయలుదేరాం, ఏడింటికి కి అంతా తిరిగి వచ్చేద్దాం అని మాతో పాటు ఆంటీ వాళ్ళు బయలుదేరి యానం వెళ్లారు. వెళ్ళే ముందు రేణు తమ్ముడు మాత్రం వెనక్కి వచ్చి నన్ను,రేణు ని ముద్దు పెట్టుకొని "జాగర్త అక్క" అని చెప్పి వెళ్ళాడు, వాడు అల చెప్పటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, కానీ వాడి చిట్టి చిట్టి చేతుల్ని ముద్దు పెట్టుకోకుండా ఉండలేక పోయాను.
****
నేను కూర్చున్న చెట్టు కింద ఏదో అలికిడి అయ్యినట్టుగా ఉంది. గుండె దడ దడ లాడింది. కింద నుండి ఎవరైనా పైకి చూస్తే కనిపించకుండా గుబురుగా ఉన్న కొమ్మ పై కూర్చున్నా, నాకే తెలియకుండా చలికో , భయానికో నా శరీరం వణక సాగింది. కంట్లోంచి నాతో సంబంధం లేకుండా నీళ్ళు రా సాగాయి. బుజ్జి గాడి చేతిని ముద్దు పెట్టుకుంది ఈ రోజు సాయంత్రమేనా? ఎన్నో సంవత్సరాలు , ఎన్నో యుగాలు గడచినట్టుగా ఉంది.
నేను, రేణు , మావయ్య కలిసి గుడికి వచ్చాం. ఎంతో అందమైన గుడి, కట్టి వెయ్యి సంవత్సరాలు అయినా, ఏ మాత్రం చెక్కు చెదరలేదు. పాత గుడి అని తెలుస్తోంది, అందరూ నడచి, నడచి ఉండటం చేత బండలు నునుపు తేలాయి. దీపాల కాంతి తప్ప లైట్స్ ఏమి లేని ఆలయం సహజమైన శోభతో వెలిగిపోతోంది, ఆలయం ముందు ఉన్న కోనేరు అందులోని కలువ పువ్వులు , కోనేరు వద్దనున్న శివలింగం అబ్బా! ఎవ్వరన్న ఇలాంటి ఒక అందమైన దృశ్యం చూడకుండా చనిపోతే ఆ జీవితం వ్యర్ధం అన్నట్టే .. నాకైతే ఆ గుడి ప్రాంగణం లోనే కూర్చొని రోజంతా పెన్సిల్ స్కెచ్ వేసుకోవాలి అనిపించింది. మావయ్య కోనేరు దగ్గర ఉన్నారు .. నేను, రేణు కలువ పూలు కోసాము. గుడిలోకి వెళ్ళే అప్పుడు ఆలయ శిఖరం నుంచి చంద్రుణ్ణి చూసిన ఆ దృశ్యం ఆహా! ఇది ఎలాగైనా స్కెచ్ గీయాలి గుర్తు పెట్టుకొని అని అనుకున్నాను ..
****
గుడి లోపల ఒక చిన్న నంది విగ్రహం ఉంది. గర్బః గుడి లో ఒక శివలింగం ఉంది. అంతా దీపపు కాంతి లోనే కనిపిస్తోంది.. ఎంతో అందంగా ఉంది, పూలు పూజారికి ఇస్తాము ఏమో అనుకున్నా, కానీ గుడి లోంచి ఒక అందమైన అమ్మాయి , సుమారు నా వయసు అంత ఉండే అమ్మాయి వచ్చి , పూలు తీసుకొనింది.
"ఎలా ఉన్నావ్ రేణు ?" అని అడిగింది
"ఆరుద్ర! నేను బాగున్నాను .. నువ్వు ఎలా ఉన్నావ్ ?"
"బాగున్నాను . ఈమె నీ స్నేహితురాలా ?"
"అవును ! నా స్నేహితురాలు యశస్విని .. యశు తిను ఆరుద్ర , ఈ గుడి అర్చకుల కూతురు , రోజు మాములుగా తనే ఉంటుంది ఇక్కడ , తనకు కుదరనప్పుడు, వాళ్ళ నాన్న వుంటారు " . నేను ఆరుద్ర వైపు చూసి చిన్నగా నవ్వాను, తను కూడా తిరిగి ఒక చిరునవ్వు విసిరి మా నక్షత్రాలు అడిగింది.. నేను కొంచెం ఆశ్చర్యపోయాను... మాములుగా అయితే, గోత్రాలు కదా అడగాలి అని .. నేను ఆరుద్ర నక్షత్రం అని చెప్పను, రేణు దీ అదే నక్షత్రం, ఇద్దరి జన్మ ఘడియలు అడిగింది చెప్పాము ..
అప్పుడు అంత వరకూ ప్రశాంతంగా అందంగా ఉన్నతన కళ్ళలో ఏదో తెలియని ఒక ఆనందం... అది మాములు మనుషులు పడే ఆనందం లా అనిపించలేదు. ఎన్నో జన్మల నుంచి వేచి ఉన్నది దొరికితే కలిగే ఆనందం లా అనిపించింది.. ఏమిటో అర్ధం కాక తననే చూస్తున్న నేను కొంచెం ఆశ్చర్య పోయాను. అప్పటి వరకు, ఆ గది పైకప్పు లా ఉన్న దగ్గర ఇప్పుడో చిన్న సొరుగు లా కనిపించింది అందులోంచి ఒక పెద్ద గంట బయటకు వచ్చింది.. ఈ అమ్మాయి ఆ గంటను మూడు సార్లు కొట్టింది, అదే గంట నుంచి ఒక పెద్ద కత్తి ని తీసి రేణు మీదకు విసిరింది, అంతా రెప్ప పాటు లో జరిగింది.. రేణు చేతి కి కత్తి తగిలి రక్తం రా సాగింది, ఆరుద్ర కళ్ళలో అదే క్రూరం తో రేణు వైపుకి రా సాగింది నేను ఆమెను నెట్టేసి, రేణు రెండో చెయ్యి పట్టుకొని,బయటకు లాగి గుడి తలుపులు ముయ్యబోయాను... పెద్దవి కావటం తో అవి మూసుకోటానికి చాలా సమయం పట్టింది.

Interesting....next part plz....btw,,what is Kati? U mean kathi ???
ReplyDeleteNiru: Thanks andi! Yeah.. there are few spell checks.. please don't mind them :)
ReplyDeleteVerry interesting.....Where is the second part???
ReplyDeleteAnvitha: Thank You Very Much!Next part post chesanu andi.
DeleteThank you :)
Deletewow interesting
ReplyDelete