Texas లోని తెలుగు వారికి అంకితం.
ఫ్లూట్ ఆవు ముందు ఊదాలి కాని ఆంబోతు ముందు కాదు అని తప్పుకునే వారు "ముత్యాల రాజు" గారిని చూసిన జనం. ముత్యాల రాజు గారిది ఒక రకమైన క్యారెక్టర్. పూర్వం జమిందారి కుటుంబం కావటం అందునా రాజు గారు పొడుగరి కావటం , కండలు తిరిగిన దేహం కావడం తో చిన్నప్పటి నుంచి అతనిని చూస్తే అందరికీ హడల్. స్కూల్ రోజుల్లో అతను ఎదురొస్తే మాస్టర్లు భయం తో , వినయంగా పక్కకు తప్పుకునే వారు. రాజు గారికి ఇలాంటివి ఎంతో నచ్చినా excite అయ్యే వాడు కాదు, అయితే విలువ తగ్గిపోతుంది అని చిన్నప్పటి నుంచే మనసు రాయి చేసుకున్నాడు. అప్పుడెప్పుడో బాలయ్య బాబు తోడ కొడితే train వెనక్కు వెళ్ళిన సీన్ కి, పులి సినిమా లో కళ్యాణ్ బాబు మొదటి ఫైట్ కి excite అయ్యాడని చిన్న రూమర్ ఉంది. మగధీర సినిమా ని ట్రాష్ అంటాడు, సింహ లో బాలయ్యవి పెట్టుడు మీసాలు అని తేల్చేసాడు. అత్యంత కరడు కట్టిన అభిమానులు కూడా అతని ముందు కుయ్యి మనే వారు కాదు.
ముత్యాల రాజు గారు ఇంజనీరింగ్ 3rd ఇయర్ కి వచ్చిన తరువాత , అతని పాపులారిటీ తగ్గిపోతున్నట్టు అనిపించింది.. జనం అతనికి భయపడటం కాదు కదా, ఫోన్ నుంచి తల పైకి కూడా ఎత్తి చూడటం లేదు! ఏమిటా అని వాకబు చేసిన రాజు గారికి facebook అనే మాట వినపడింది. అందులో కూడా మనమే ముందు ఉండాలి అనే ఆశయంతో, తను కూడా ఒక facebook ఎకౌంటు create చేసి, కొంత మందికి తన ఫ్రెండ్స్ గా add అయ్యే మహత్తర అవకాశం కల్పించాడు కానీ అందులోని మర్మం రాజు గారికి బోధ పడలేదు. ఎవడెవడి ఫోటోలో తన గోడ మీద పడటం ప్రారంభించాయి. .. ఒక్కోడి ఫోటోకి 50 కి పైబడి "like" లు దాని కింద ఒకడు "మామ నువ్వు కేక " అంటే, ఇంకొకడు "బావ హీరో గా try చెయ్యి" , పైన ఫోటోలో ఉన్న ఆకారానికి , కింద comment లకి సంబంధం లేకపోవటం .. రాజు గారిని confuse చేసింది.. ఇక అమ్మాయిల ఫోటోలకు 100 కి తగ్గకుండా like లు 500 తగ్గకుండా comment లు .. ప్రతి దాని సారంశం ఒక్కటే .."నువ్వు చాల అందం గా ఉన్నావ్ " దానికి ఆ యువతీ " నేను నిజంగా ఎం అంత అందం గా లేను " అని సిగ్గు పడటం చూసి తట్టుకోలేకపోయాడు .. తను కూడా ఒక ఫోటో పెట్టాలని decide అయ్యాడు.
తన కండల శరీరాన్ని చూపిస్తూ ... ఒక ఫోటో పెట్టాడు ఎట్టకేలకు .. దానిని పట్టించుకున్న పాపాన ఎవరు పోలేదు! (ఎందుకు పట్టించుకుంటారు ? ఎప్పుడన్నా రాజు గారు ఎవరినన్నా పట్టించుకున్న పాపాన పోతేగా?).. దానితో ఇంకో ఫోటో పెట్టాడు ... దాని పరిస్థితి అంతంత మాత్రమే! ఇలా కాదు అని తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్లకి .. requests పంపించాడు ... అయినా లాభం లేకపోయింది పాపం. దానితో రాజు గారికి తన మీద తనకే అనుమానం వచ్చింది .. తరువాత ఆక్రోశించాడు ... చివరికి తన మీద తనకే అసహ్యం వేసింది!
ఇంజనీరింగ్ చివరి రోజుల్లో.. ఎందుకు పనికి రాని తన సీనియర్ .. USA వెళ్ళి .. అక్కడ మంచులో దిగి.. పెట్టిన ఫొటోలకి వందలాది like లు రావటం చూసి... USA వెళ్ళాక తప్పదు అని fix అయ్యాడు! GRE , TOEFL రాసాడు. TOEFL లో రావాల్సిన score GRE లో రావటం , వేరే వాడి చేత రాయించిన TOEFL లో ఆకాశం బద్దలయ్యేలా 110 రావటం తో .. VISA officer అనుమానించినా .. TEXAS లోని KINGSVILLE UNIVERITY కి (అనుభవిస్తాడు కుంక అనుకొని) visa గుద్దేసాడు!! Flight దిగగానే మంచు expect చేశాడు రాజు గారు! దిగిన తరువాత కానీ తెలియలేదు పాపం TEXAS లో మంచు కాదు కదా వాన చినుకు కూడా పడదని! ఎలా ఉండే వాడిని ఎలా అయ్యిపోయాను అనుకుంటూ .. నిప్పులు కక్కే ఎండలో గ్యాస్ స్టేషన్ లో కూర్చొని నిట్టూర్చాడు ముత్యాల రాజు గారు Facebook లోని మూతి వంకర selfie లను చూస్తూ!
మొహం మీద ఈగ వాలితే చేత్తో కొట్టుకోవాలి కానీ , రోకలి బండ తో బాదుకోకూడదు అని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు రాజు గారు!
P .S : ఇది రాసినది కార్తీక్ నిమ్మగడ్డ, ఎడిట్ చేసింది నేను.