తొలకరి వాన జల్లు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? నాకు కూడా తొలకరి వాన జల్లు అంటే చాలా ఇష్టం! ఎంత ఇష్టం అంటే నా ప్రతి జీవ నాడి లోనూ , చిరు జల్లు కి తడచిన మట్టి సువాసన నిండి పోయి, నా ప్రాణాన్ని మైమరపిస్తుంది. హాయి గా ఆ వానలో తడుస్తూ నా వగల గుబులంత తీర్చుకుంటుంటే ఆ అనుభవం మాటల్లో చెప్ప గలిగేది కాదు. దివి నుంచి కిందకు రాలి పడే దీవెనల లా అణువణుని తడిమే ప్రతి చినుకు తో తడిసి ముద్దవుతూ, స్వర్గం అంటే ఇదేనేమో అని ఆనందిస్తున్న నాకు , వాన ఆగిపోవటమే విషాదమేమో అనుకుంటే నా గొం తు నులిమేస్తూ నన్ను లాక్కెళ్ళారు. ఊపిరి ఆడకుండ నాలాంటి వాళ్ళు ఎంతో మంది వున్నా చోట బందించేసారు! ఎలా ఈ చేరసాల నుంచి తప్పించుకోవటం?ఎటూ దారి తోచదే ! అమ్మ నన్ను లాక్కేళ్ళుతున్న వాళ్ళని దీనం గా చూడగాలిగిందే తప్ప ఏమి అనలేదు.
అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటే, నాకు తను చెప్పిన మాటలే గుర్తొచ్చాయి,
" ఏదో ఒక సమయం లో నిన్ను నా నుంచి వేరు చేస్తారు బంగారు, అప్పుడు నువ్వు చాలా ధైర్యం గా ఉండాలి , భయపడ కూడదు , ఏడవ కూడదు సరేనా?"
"అమ్మ.. నేను నిన్ను వదిలి వెళ్ళాను అమ్మ! నన్ను పంపించకమ్మ!"
"నాకు నిన్ను పంపటం ఇష్టం లేదు తల్లి కనీ నువ్వు వెళ్ళే రోజు నేను ఎంత బాధ పడతానో నీకు తెలియదు, నా బిడ్డలని ఇలా దూరం చేసుకుంటూ ఉంటే నాకు ఆనందమా? చెప్పు?!"
అమ్మని తలచుకుంటూ ఉన్న నాకు పెద్దగా అరవాలనిపించింది," నన్ను వదిలిపెట్టండి..!!" అని... నేను మీకేం అన్యాయం చేశాను అని ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు? పగలే చీకటిని తలపించే ఈ ప్రదేశం లో నేను ఉండలేను ... నన్ను నన్నుగా కాక ఒక విలస వస్తువుగా చూస్తున్న మీ దగ్గర నేను ఉండలేను అంత కన్నా చావు మేలు ! అని వీళ్ళందరికీ చెప్పాలి అని ఉంది. నా బాష వీళ్ళకి తెలుసో లేదో! నా బాధ వీరికి అర్ధం అవ్వుతుందో లేదో! నా ఘోష ఆ చెవులను తాకుతుందో లేదో!
వర్షం చినుకులు చెట్ల ఆకుల నుంచి ఒక్కోటే కింద పడుతుంటే,అమ్మ ఏడుస్తున్నట్టు అనిపించింది తనని ఒక సారి నేను అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చింది .
"జీవితం అంటే ఏంటి అమ్మ?"
"ఆనందం గా ఉండటం !"
"అంటే ఆనందం గా లేనప్పుడు జీవిస్తున్నట్టు కాదా?"
"ఏమో నే నాకే తెలియని ప్రశ్నలు వేస్తావు నువ్వు !"
అని అమ్మ మాట దాట వేసింది ...
ఎందుకో తెలియదు కాని ఇక్కడ ఇలా బందించి ఉన్న ఈ సమయం లో అమ్మ చెప్పిందే నిజం అనిపిస్తోంది ఇది నా జీవితం లా అనిపించటం లేదు. నన్ను బందించి కళ్యాణ రాముని కౌగిట్లో చేర్చెందుకో లేదా భార్గవ రాముని పాదాల చెంత కో కాదు ఎవరో అనామకుడి పొందుకు. సీతమ్మ సిగ లోనికో, రుక్మిణి పూజ కో కాదు ఊరు పేరు
తెలియని అనమకురాలి అలంకారానికి! ఐన దేవుడి చెంతకు అయితే మాత్రం నేను ఎందుకు సంతోషించాలి,
నా జీవితం పూర్తి కాకుండా నన్ను లక్కోచి పడేస్తే నేను ఆనందించాలా? మా భగవంతుడు మాకూ ఉన్నాడు, మీ దేవుడికి నన్ను మీ స్వార్ధం కోసం అర్పించి నా జన్మ ధన్యం అయ్యింది అని మీరే సెలవు ఇచ్చేస్తారా? ఎంత అహంకారం? పోనీ నేను అందంగా ఉన్నాను అని మీరు ఇలా చేస్తున్నా,ఎంత దురాశ?నాలుగు రోజుల పాటు అందంగా చెట్టుకే ఉండనివ్వచు గా.. లేదు అందం గా కనిపించింది సొంతం
చేసుకోవాలనే ఆశ ఆ ఆశ లో మా జీవితాల్ని గంటల వ్యవధి లో నాశనం చేసేస్తారు. నా జీవితం నా
నుంచి లాగేస్తే నీ కడుపు నిండుతుందా ? నీ ఆకలి తీరుతుందా? దాహం తీరుతుందా? నీ అత్యాశ కూడా నిండదు
మరి నా జీవితాన్ని ఎందుకు ముక్కలు చేస్తున్నావు? చెట్టుకే ఉంచి ఆరదిన్చాలేవా? అందుకొనే ఆరాటం లో మా జీవితాలని అర్ధంతరం గా ముగించేస్తావ?
P.S. : పువ్వులు బాధ పడతాయేమో అని అనిపించి రాసిన ఒక చిన్న వ్యాసమే తప్ప, NO OFFENSE INTENDED. PURELY MY OPINION.