నేను... తలుపు మూస్తుండగా రేణు .. ఆ గుమ్మం ముందు ఉన్న మెట్టు మీద కూర్చొని, కత్తి నెమ్మది గా తీసి తన వోణి తో కట్టు కట్టుకుంది. పాపం చాలా లోతుకు దిగినట్టు ఉంది, ఎంతో రక్తం కారుతోంది.. కళ్ళలోనుంచి నీళ్ళు వస్తున్నాయి తనకు .. బహుశా నొప్పికి ఏమో...
"ఏమయ్యిందే తనకు? ఎందుకు అలా చేసింది?"
"ఏమో నాకు మాత్రం ఎం తెలుసు, చాలా విచిత్రం గా ఉంది... అస్సల అర్ధం కాలేదు నాకు ..." తను మాట్లడుతుందే కానీ, శరీరం వణుకుతోంది... నాకు తన పక్కన కూర్చోవాలి అని ఉన్నా... మావయ్యని వెతికి .. ఇంటికి వెళ్ళాలి కాబట్టి మెట్లు దిగుదాం అని.. చూసే సరికి మావయ్య లేరు .. గేటు దగ్గర పడిపోయి ఉన్నారు... రక్తం కారుతోంది .. ఆయన తలకి గాయం అయ్యినట్టు ఉంది, నేను వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళాను. నాకు ఒక్క నిముషం ఎం జరుగుతోందో అర్ధం కాలేదు, మమ్మల్ని అంటే ఆరుద్ర అలా చేసింది.. మరి మావయ్యని?... ఆరుద్ర కొట్టిన గంట విని ఎవరో వచ్చారు ఐతే... వెన్నులో వణుకు పుట్టింది. ఇంతలో రేణు కూడా అక్కడికి వచ్చింది. అప్పటి వరకు లేని భయం, ఎవరో ఉన్నారు.. ఇక్కడే ఉన్నారు .. ఎటు ఉన్నారో తెలియదు..
***
"రేణు.. ఎవరో ఉన్నారే .."
నా గొంతు నాకే వినపడలేదు .. భయం తో పూడుకు పోయింది, కానీ ఆశ్చర్యంగా రేణుకి వినపడినట్టు ఉంది, తను తల ఊపింది... ఆ కత్తి గాయం అయ్యాక ఇదే తన ముఖం చూడటం.. చాలా నిస్సారం గా ఉంది, కానీ తన కళ్ళు మాత్రం చాలా చురుకు గా పని చేస్తున్నాయి.. ఆ ప్రదేశం అంతా.. పరికించి చూస్తూ, చుట్టూ చీకటి గుడి ద్వారం దగ్గర వెలిగించిన దీపాలు,కోనేరు దగ్గర ఉన్న శివలింగం దగ్గర ఉన్న దీపాలు, చంద్రుని కాంతి తప్ప వేరే వెలుగు లేదు.. ఒక్క పది నిముషాల క్రితం( పది నిముషాలేనా ? అప్పుడే ఎన్నో రోజుల క్రితం అన్నట్టు అనిపిస్తోంది ) చూసినంత అందం గా ఈ ప్రదేశం ఇప్పుడు కూడా ఉన్నా, ఇప్పుడు ఆనందం కంటే భయం వేస్తోంది.. అంత చలి లొనూ చెమటలు పట్టాయి. "రేణు , నువ్వు చూస్తూ ఉండు నేను మావయ్యకి కట్టు కడతాను అని దిక్కులలో పొంచి ఉందేమో అని నేను అనుమానిస్తున్న ప్రమాదం కోసం వెతుకుతూ, కిందకి వంగి, మావయ్య కండువా లా కప్పుకున్న, తుండును తీసుకొని చింపి ఆయనకు కట్టు కట్టాను. ఆయన్ని కదిపినా లెవ లేదు... రేణు కిందకు వంగి, "నీళ్ళు తీసుకురానా?" అని అడిగింది.... బాడ్ ఐడియా, ఎవరో ఇక్కడే ఉన్నారు .. గుడి లోపల ఆరుద్ర ఇంకా తలుపులు బాదుతోంది .. ఇప్పుడు మాలో ఒకళ్ళు నీళ్ళ కోసం వెళ్ళటమా?... నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు...
"ఇద్దరం వెళ్దాం"
అని అన్నా, తను అదే అనుకున్నట్టు ఉంది.. మావయ్యను అక్కడే విడిచి పెట్టి ఇద్దరం కోనేరు వైపు అడుగులు వేశాము. ఇంతక ముందు చూడలేదో, లేదంటే ఇప్పుడే వచ్చిందో ఒక వ్యక్తి కోనేట్లోని శివలింగం దగ్గర.. ఒళ్ళంతా వీబుధి పూసుకొని ఏదో ధ్యానం లో ఉన్న వాడిలా(నిజంగానే ఉన్నాడేమో) కూర్చున్నాడు. ఇద్దరం ఇంక ఒక్క అడుగు కూడా వెయ్యలేదు, కోయ్యబారిపోయాం. ఆరుద్ర దగ్గర ఉన్న కత్తి లాంటిదే శివలింగం దగ్గర పెట్టి ఉంది.
***
భయం కమ్మేసింది ఇద్దరం మావయ్య దగ్గరకు పరిగేత్తి ఆయన్ను లేపే అందుకు ప్రయత్నించాము, అయన లేవ లేదు.. ఎం చెయ్యాలో తెలియటం లేదు... గుండె చప్పుడు, నా గుండె చప్పుడే అనుకుంటా చెవ్వుల్లొ మరణ మృదంగం లా వినబడుతోంది. రేణు దీనంగా బ్రతిమాలుతోంది
"ప్లీజ్ మావయ్య, లేగవ్వా ? నాకు భయమేస్తోంది మావయ్య అని", గర్భ గుడి తలుపులు శబ్దం ఆరుద్ర, తలుపులు బాదుతోంది... ఈ లోపల ఆ శివలింగం దగ్గర ఉన్న వ్యక్తి కత్తి పట్టుకొని నెమ్మది గా లేవ సాగాడు. ఆరుద్ర కళ్ళలో కనిపించిన అదే ఆనందం అంత దూరం నుంచి కూడా నాకు ఆయన కళ్ళలో కనిపించింది.
నాకు భయమేసింది రేణు ని పట్టుకున్నా.. తను ఏడుస్తోంది .. తనకు దారి తెలుసు కానీ ...
"రేణు .. ఇంటికి ఎలా వెళ్లలే... చెప్పు రేణు!" తనని కుదుపుతూ అడిగాను
ఏమి చెప్పలేదు .. ఇప్పుడు గుర్తు తెచ్చుకునే సమయమూ లేదు... గుడి బయట నుంచి చెట్లలోకి పరిగెట్టాము.... చివరి గా వెనక్కి తెరిగి చూసే సరికి ఆ కత్తి మా వైపు విసిరి, అతను గర్భ గుడి వైపు వెళ్తున్నాడు ఇప్పుడు ఇద్దరు వెతుకుతారు, ఒక్కోళ్ళకి ఒక్కో వేటగాడు గాడు అన్న మాట. మావయ్యని ఎం చేస్తారో, ఆయన్ని వదిలేసి రావటం ఏంటి? నా మనసులో తిట్టుకున్నాను. సొంత ప్రాణం అంటే అంత తీపా మాకు? నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ ఏ మూలనో, ఆయనని ఏమీ చెయ్యరు వాళ్ళకి కావాల్సింది నేనూ, రేణు మాత్రమే అనిపించింది ... ఇంకా పరిగెడుతూనే ఉన్నాం.. ఇంత భయం లొనూ నా బుర్రకి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయో అర్ధం కాదు.. ఎవరన్నా మేము పరిగెట్టింది రికార్డు చేసి ఉంటే, నేను రేణు ఏదో ఒక వరల్డ్ రికార్డు బ్రేక్ చేసి ఉండే వాళ్ళమేమో అనిపించింది. నా బుర్రకు బుర్ర లేదు అని తిట్టుకొని, ఏదో పంపు షెడ్డులా ఉంది, అందులోకి వెళ్ళాం నేను రేణు. ఇద్దరం ఆయాసం తో కింద కూర్చున్నాం, పరిగేట్టినంత సేపూ తెలియలేదు కానీ... కాళ్ళు లాగేస్తున్నాయి... కడుపులోని పేగులు మొత్తం ఎవరో పట్టుకొని పిండేసినట్టు అనిపిస్తోంది. మొదట కాళ్ళు మాత్రమే అనుకున్నా కానీ, క్షణాలు గడిచే కొద్దీ, ఒళ్లంతా తూట్లు పడిపోయినట్టు ఒకటే నొప్పి... ఇద్దరం ఒకరి మొఖం లోకి ఒక్కళ్ళు చూస్తున్నాం కానీ ఆయాసం వల్ల మాట్లాడుకోలేకపోయాం.. చివరకి రేణు నే మొదలు పెట్టింది....
"అతని పేరు శివ! ఆరుద్ర వాళ్ళ నాన్న"
"అది సరేనే, వాళ్ళు ఎందుకు ఇలా కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు?"
""ఏమో నే"
" దొరికితే చంపేసే లా ఉన్నారు!"
"నాకూ అదే అర్ధం కావటం లేదు... ఎప్పుడు ఇలా ఉండటం చూడలేదు నేను!... చాలా మంచి వాళ్ళు .."
" కత్తులు పట్టుకొని మీదకి వస్తుంటే మంచి వాళ్ళు అంటావేంటే?" కోపం లో నా గొంతు కాస్త పెద్ద శబ్దం తోనీ మాట్లాడింది.
బయట ఏదో అలికిడి అయ్యినట్టు అనిపించి , ఇద్దరం బిక్క చచ్చిపోయాం.. ఏవో అడుగులు ఈ
పంపు షెడ్డు వైపే వస్తున్నట్టు ఆకుల అలికిడి వినిపించింది...
ఇద్దరం రెండు చేతులు నోటికి అడ్డంగా పెట్టుకొని వింటున్నాం ఎవరో వస్తున్నారు... చప్పుడు ... ముందర తలుపులు కొడుతున్నారు.. లోపల నుంచి గడి పెట్టి ఉండటం తో ..షెడ్డు లో ఉన్నది మేమే అని అర్ధం అయ్యిపోయింది అవతల వాళ్ళకి...ఆ తలుపు ఏ నిముషం లో అన్నా వచ్చేసేలా ఉంది... ఇంక దొరికిపోతాం , కాదు చచ్చిపోతాం ! అనుకుంటూ ఉండగానే , పంపుసెట్టు కోసం గోడలో చేసిన రంద్రం లోంచి నన్ను ఎవరో బయటకు లాగారు..
అరవటానికి ,ప్రతిఘటించటానికి వీలు లేకుండానే అంతా.. ఒక్క క్షణం లో జరిగింది.. తలుపు బద్దలు అయ్యిపోయిన నిముషం, ఆ షెడ్డు లోంచి పండు వెన్నెల్లో తడుస్తున్న అడివిలోకి నేను వచ్చిన నిముషం ఒక్కటే..
P .S: To Be Continued ..

Very interesting...next part plz....plz dont say its a dream finally....I hope that's not the ending....
ReplyDeleteNiru: Posted next part! Actualy intha response expect cheyyaledu.. hope I wont disappoint you :)
DeleteGripping story! Second part raised my expectations even more :D
ReplyDeleteNaga Santosh : Thank You Very Much Andi!
Delete