ఇది నిజం అండి. నిజం ఎప్పుడూ అందం గానే ఉంటుంది.
ఆకాశ వీధి లో అందాల జాబిలి అని మధురవాణి తన కథ కు పేరు పెట్టుకుంది. జాబిలి కి పౌర్ణమి ఉంది , అమావాశ్య ఉంది . రెండిటికీ మధ్యన కృష్ణ , శుక్ల పక్షాలు ఉన్నాయ్ . ఒక వ్యక్తి జీవితాన్ని కథగా తీసే అప్పుడు అన్ని నిజాలు చూపిస్తారా? తన ఎదుగుదల చూపినంత గొప్పగా పతనం చూపిస్తారా? అన్న అనుమానం తోనే వెళ్ళి చూసిన నాకు , తను కొడిగట్టే ముందు కూడా ఆ దీపం మినుకు మినుకు మనలేదు , దేదీప్యంగా వెలుగుతూనే ఉంది , వెలుతురు ఇస్తూనే ఉంది అని తెలిసింది. తాను తారా లోకం చేరే వరకు తార లానే జీవించింది అని తెలిసింది.
మొన్నీమధ్యనే ఒక స్నేహితుడు అన్నారు , మనకు కళను ఆదరించటం రాదు అని. నిజమేనేమో అనిపించింది , నిజం అవ్వుతుందేమో అని భయమేసింది. సావిత్రి గారిని ఆదరించిన మనకు కళ గురించి తెలియదు అంటే నమ్మేదెలా ? సావిత్రి గారి కథని ఆదరించిన మనకు కళ తెలియదు అంటే ఎలా!
సినిమా బాగుంది, ఇక్కడ బాగుంది , ఇలా బాగుంది, ఇంత బాగా చేశారు , ఇంత బాగా చూపించారు అని చెప్పలేనేమో కానీ .. ఇది నిజం కాబట్టే బాగుంది.. నిజాయతి ఉంది కాబట్టే హృద్యంగా ఉంది అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే జీవితం కంటే గొప్ప కథ ఎక్కడ ఉంటుంది ?
సినిమా లో ఒక dailogue ఉంది "ప్రతిభ ఇంటి పట్టునుంటే, ప్రపంచానికి పుట్టగతులు ఉండవు " అని . మధురవాణి ఏమి నేర్చుకున్నారో , తెలుసుకున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం భయపడకుండా రాద్దాం అని నిర్ణయించుకున్నాను . భయం దేనికి అని అనచ్చు మీరు, రాయటం అంటే మన మనసుకు బట్టలు లేకుండా అందరి ముందు నిలబెట్టటం. ఆ ధైర్యం ఉందా నాకు? ఏమో , ఈ రోజు మాత్రం మాహానటి చూసాక ఉందనే అనిపించి రాస్తున్నాను. ఎందుకంటే ఇది నిజం, నిజం ఎప్పుడు అందంగానే ఉంటుంది.
- ఆ జాబిలి పంచిన వెలుగులో, వెలుగుతున్న ఒక చిన్న దివిటీ