శ్రీరామ నవమి:
శ్రీ రాముడు మన దేశం లో పుట్టాడు,నడచాడు, రామయణ గాధ అంతా నిజమే అని నిరూపించటానికి సాక్ష్యాలు ఉన్నాయో లేదో తెలియదు. అసల నమ్మకానికి రుజువులు అక్కరలేదు.రుజువులు ఉన్నప్పుడు నమ్మితే ఇంక నమ్మకానికి విలువేముంది? రుజువు చూసి నమ్మితే అది నమ్మకం కాదు సత్యం. సత్యానికి నమ్మకాలతో పని లేదు. కాషాయం ధరించిన ప్రతి వాడు మహానుభావుడే అని నమ్మే మనకు రాముడి ఉనికిని ప్రశ్నించే దమ్ము ఉందా?
" అమ్మో ! ఏంటి పిల్లా ఇంత ధైర్యంగా దేవుడి మీద వ్యాసం రాద్దామనే పునుకున్నావా? దేవుడు లేదనుకో ఫర్వాలేదు, కనీ ఉన్నాడు అనుకో ఇది రాసినందుకు నీకు చదువుతున్నందుకు మాకు శాపాలు తగిలి నాశనం అయ్యిపోము? ఎం మనుషులో ఏమో ఆరా తీయటానికి ప్రశ్న వేయటానికి హద్దు అంటూ ఉండక్కర్ల? మూడు వేల సంవత్శరాల నాటి నుంచి వస్తున్న నమ్మకానికి అర్ధం లేదని కొట్టి పారేస్తావా?" అని చాల మంది అనవచ్చు, అనోకోవచ్చు , కనీ దేవుడు ఉన్నది లేనిది పక్కన పెడితే మనం మొక్కే దేవుడికి, మన అహంకారం అంతా పక్కన పెట్టి సాష్టాంగ నమస్కారం పెట్టే దేవుడికి ఉన్న లక్షణాలు ఏంటి మనకు లేనివి ఏంటి అని ఒక్క సారి కూడా ఆత్మ పరిశీలనా చేసుకోమా? దేవుడు ఒక గొప్ప శక్తి, మనకు అందని శక్తి, మనం ఎన్ని విధాల ప్రయత్నించినా మనకు దొరకనివి అందనివి ఆ శక్తి సాయం తో పొందవచ్చు అందుకని ఆ శక్తి ని ప్రసన్నం చేసుకోవాలి, కాకా పట్టాలి ,ఉపవాసాలు ఉండాలి, మన కోరికలు తీర్చుకోవాలి , మనం సుఖ సంతోషాలతో తుల తూగాలి అనే పరిధిని దాటి మన ఆలోచనలు ఎన్నటికి ఎదగవా?
పండుగ రోజు పొద్దున్నే లేచి పండు లాగా ముస్తాబు అయ్యి గుడికి వెళ్ళి అక్కడ ఉన్న రాముల వారికి ఒక దణ్ణం పెట్టి , గుడి బయట వచ్చే పోయే ఆడ వాళ్ళ దగ్గర వెకిలి వేషాలు వేసే మనకి రాముడు అంటే భక్తి ఉన్నట్టా? రావణాసురుడు అంటే అభిమానం ఉన్నట్టా ? సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు " శ్రీ రామ చందురున్నికోవెల్లో ఖైదు చేసి , రాకాసి రావణున్ని గుండెల్లో కొలువు ఉంచి తల తిక్కల భక్తి తో తై తక్కలా మనిషి". రాముడు ఉన్నాడా లేదా అన్నది పక్కన పెడితే ఆ కధలు మనం రాసుకున్నవేగా ? వాల్మీకి మహర్షి దేవుడు కాదు కదా, ఒక మామూలు పురుషుడికి ఈ లక్షణాలు ఉంటే పురుషోత్తముడు అవ్వుతడు అనే గా అయన చెప్పినది , అలాంటి
పురుషోత్తముడు ఉంటే మన కోరికలు తీర్చమని దణ్ణం పెడతాము, లేదు అలాంటి వాడే లేడు అని కనుక మనం నమ్మితే నన్ను ఆపే వాడే లేడు అని పెట్రేగిపోతాం అంతే కనీ దేనినీ తర్కించం , ఒక వేళ తర్కించాల్సి వచ్చినా ధర్మంగా కాదు మనకు అనుకూలంగా తర్కిస్తున్నం కాదంటారా? నరకసురులు , రావనాసురులు ఎక్కడో లేరు
అన్న విషయం ఎన్నాళ్ళైన మనం గుర్తించామ? శ్రీ రామ నవమి , విజయదసమి జరిపే ముందు మన లోని చెడు ని ఎన్నటికి విడిచిపెట్టలేమ? మన అలోచనా పరిధిని పెంచమా?
ఎహ్ పిల్లా నువ్వు ఎంత మారవు ? ఎంత మందిని మార్చావు? అని అడుగుతారా? మార్చగలను అనే కళలు కనే దాన్ని , నేను ఇలా మాట్లాడితే వాస్తవానికి దూరం గా అలోచిస్తావెందుకు? నువ్వు కొంచెం practical గా ఆలోచించాలి! నేను ఒక్కడినే మారితే ప్రపంచం మరదుగా? నేను హ్యాపీ గా ఉన్నానా లేదా అన్నది నాకు ముఖ్యం ! దీనితో పాటు ఆ పిల్లకు కాస్త పిచ్చి అనుకున్న వాళ్ళు వున్నారు . వాళ్ళన్నది నిజమే కాబోలు నా పిచి పరాకాష్ట కు చేరి ఇంత అమానుషంగా బ్లాగ్ రాస్తున్న.
ఐన తోలు మందపు జనాభా కి వాళ్ళు నమ్ముకున్న irrationalites లో rationality ని వెతుక్కొని చంకలు గుద్డుకోవటం తప్ప నిజాన్ని నిజం గా ఎదుర్కునే
తెగింపు ఉండదు. అందుకే మనకు ముసుగులు కావాలి! మనం చేసే ప్రతి పనికి మనం judgement ఇచ్చుకుంటాం,
ఆ judgement మన విలువల్ని బట్టి ఉంటాయి, కాకపోతే మనకు ధైర్యం లేదు కాబట్టి మన విలువలు మన అవసరానికి తగ్గట్టు మార్పు చెందుతాయి అంతే ( values twist and turn according to our need )
Of all the virtues courage is the only virtue that is going to guard your other virtues, without that one virtue, all your virtues are worth a dustbin.
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు!