"ఒరేయ్ అభి, నీ కాబోయే పెళ్ళాం పేరు ఇప్పటి దాకా చెప్పలేదు అంటే నీకు సిగ్గు ఏమో అనుకున్నా, ఇదా విషయం!.... బా... బా బాగుంది రా!" అంటూ పొట్ట చెక్కలయ్యే లా నవ్వారు అభి స్నేహితులు. అతనికేమో ఎం సమాధానం చెప్పాలో తెలియక, వాళ్ళని తిట్టలేక , నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులలో బుంగ మూతి పెట్టుకొని కూర్చున్నాడు. బాగా సాంతం కింద పడి పొర్లి పొర్లి నవ్విన తరువాత, అభి వద్దకు మళ్లీ వచ్చి "ఎన్ని కబుర్లు చెప్పావ్ రా నా భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి , పేరు దగ్గర నుంచి ఆమె జుట్టు కోసల వరకు నాకు నచ్చనిదే చేసుకోను అని హ హ హ హ ..... భ భలే అయ్యిందా రా నీకు! నీ తిక్క తీరింది వెధవ!" ఇంకా అభి కి
ఏమనాలో అర్ధం కాలేదు కాని ఉక్రోషం పొడుచుకొచ్చింది!"అరె సుబ్బు పేరు ఒక్కటే అలా ఉంది రా, తన మాత్రం దేవ కన్య ల ఉంటుంది! అందుకే పెళ్ళికి ఒప్పుకున్నా!" అన్నాడు. అంతక ముందే Flexi పై ఆమె ఫోటో చూసి ఉండటం మూలాన ఎవరు ఇంకా ఎగతాళి చెయ్యలేదు కొంత , ఇంకా ఏడిపిస్తే పెళ్ళికొడుకు ఉడుకు మోతు తనం ఆపుకోలేక కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు ఏమో అనే అనుమానం తో కొంత ఎవరు ఏమి మాట్లాడలేదు. "పెళ్ళి కొడుకుని తీసుకురండి అమ్మ!" అని పంతులు గారి మాట వినపడటం తో అంత ఆ పని లో పడ్డారు.
పెళ్ళి హడావుడి,వ్రతాలు ,పూజలు,నోములు,వాయనాలు ,చేటలు తీర్చటాలు అన్నీ అయ్యాక, తొలి రాత్రి మాత్రమే సుబ్బి తో మాట్లాడటానికి కుదిరింది అభికి." సుబ్బు" అని పిలిచాడు తనని తనేమో "అభి! మీరు నన్ను సుబ్బి అని పిలవండి ప్లీజ్!" అంది. ఎన్నెన్నో కలలు కని, ఏరి కోరి పల్లెటూరిలో పుట్టి పెరిగిన
చదువుకున్న పిల్లను, పెళ్ళికి ముందు ఒక్క సారి కూడా మాట్లాడకుండా చాలా సాంప్రదాయ బద్దంగా పెళ్ళి
చేసుకుంటే, తనతో ఆమె మాట్లాడిన మొదటి మాటే అభి గుండెలలో ధడేల్ అనే శబ్దం తో రాయి వేసింది ... ఐన సరే
కొంచెం తమాయించుకొని ఈ రోజు ఎలా ఐన మంచి రాపో Build చేసుకోవాలి అని నిర్ణయించుకొని "అదేమి ?" అని అడిగాడు. "అంటే సుబ్బు అంటే మగాళ్ళ పేరులా ఉంది కదండీ! ఐనా నన్ను అందరూ సుబ్బి అనే పిలుస్తారు నాకు అదే అలవాటు!" అబ్బో అనుకొని, ట్రాక్ ని ఎలా ఐన రొమాన్స్ వైపు మళ్ళించాలి అని మళ్లి గట్టిగా నిర్ణయించుకొని, ఆమె చెయ్యి పట్టుకొని "అందరికి నాకు తేడా లేదా?" అని అడిగాడు. ఆమె కొంచెం చిన్నగా నవ్వి "ఆ తేడా ఉండదా అని మీరు అడగ కూడదు,సంపాదించుకోవాలి!" అని కొంటెగా నవ్వింది. ఆ నవ్వు కి అర్ధం ఏమిటో అర్ధం కాక అభి అయోమయం లో పడ్డాడు!
పెళ్ళైన పది రోజులకి ఆఫీసుకి వచ్చిన అభిని అందరూ అభినందించారు!అభికి అంతా అయోమయం గా ఉంది, ప్రేమించి తగలడే అంత ధైర్యం ఎప్పుడూ లేదు .. పోనీ పెళ్ళాడిన పిల్లని ప్రేమించేస్తే ఎలాగు పెళ్లైంది కాబట్టి చచ్చినట్టు తిరిగి ప్రేమిస్తుంది అనుకుంటే అదేమో ఆశ! దోశ! అప్పడం! వడ! ఆ ప్రత్యేకత సంపాదించుకోవాలి అంటుందా? రేపు ఉదయం తను వాళ్ళ ఊరు నుండి రాగానే చెప్పేస్తా... ఇదిగో అమ్మాయి ఇలా సంపాదించుకోవటం గట్రాలు ఏమీ లేవు, నువ్వు పెళ్ళి చేసుకున్నావు అంటేనే నేను అందరికన్నా స్పెషల్ నీకు అని ! ఐన ఎంత గడుసుది కాకపోతే నాతో మాట్లాడిన మొదటి మాటే నా పేరు పెట్టి పిలుస్తుందా! అనే ఆలోచన రాగానే ఉలిక్కి పడి పక్కన చూసుకున్నాడు, ఎవరన్న తన ఆలోచనని చదివితే ఇంకేమన్నా ... ఉందా ! పులుసులో కర్వేపాకు లా తనని విలువ లేకుండా తీసిపారేస్తారు ఇక మీదట... ఐనా నోటి కండూతి కాకపోతే ఒరే అభి గా ఎన్ని మాటలన్నావు రా వాళ్ళని! అనుకుంటూ అభి తన గతం లోకి చూసుకున్నాడు ఒక సారి ....
రవి లవ్ మ్యారేజ్ చేసుకొని ఏడాది అయ్యిన సందర్భం లో అతను ఇచ్చిన బీర్ పార్టీ లో పీకల దాకా తాగి... ఒళ్ళు తెలియని స్థితిలో పార్టీ ఇచ్చిన రవిని ఎన్నో రోజులుగా అడగాలనుకున్నవి సారీ కడగాలనుకున్నవి కడిగేసాడు
"ఒరే రవీ ... తాగి మాటడుతున్నాను అనుకోవు కదా.. "
"లేదు లే చెప్పరా ... బాబాయి "
"మీ ఆవిడకేంటి రా అంత పొగరు?"
"ఏరా ... నిన్నేమన్న అందా ఎప్పుడన్నా ?"
"కాదు మామా ... నన్ను అంటే దులుపేసుకునే వాడిని రా.. ఒదిన పాద దర్శనం అయ్యింది తల్లిలా దండించింది అని.. "
"మరి?"
"నిన్ను అన్నది అన్నయ్యా!... రాముడు లాంటి నిన్ను మా అందరి ముందు పేరు పెట్టి పిలిచింది రా .."
"ఓస్స్ అంతేనా? ఇంకా ఏంటో అనుకున్నా కదా రా మామా ...తను మన classmate కదా రా ... తనకు అదే అలవాటు .."
"నువ్విలా వెనకేసుకొస్తే ఎలా మామా ... రేపొద్దున్న... పిల్లల చేత కూడా పేరు పెట్టి పిలిపిస్తుంది... "
"ఏంటి రా .. నీ గోల ... "
"గోల లానే ఉంటుంది రా .. ఎందుకంటే .. మీ అందరికీ కళ్ళు మూసుకు పోయాయి ... ప్రేమ అని చెప్పి ... ఏదో షుమారు గా ఉన్న అమ్మాయి ని చూసి చేసుకొని తనకే దాసోహం అయిపోయారు రా... "
"ఛ! నువ్వేం చేస్తావో మేము చూస్తాం గా.. "
"చూడండి రా.. నా పెళ్ళాం పేరు దగ్గర నుంచి జుట్టు కోసల వరకు అన్ని నచ్చితేనే పెళ్ళి చేసుకుంటాను .. మీలా జీతాలకు కకుర్తి పడి .. ఉద్యోగం చేసే అమ్మాయి ని కాకుండా .. చక్కగా పల్లెటూరి లోనే పుట్టి పెరిగి... బాగా చదువుకున్నా సరే ... భర్త పేరు పెట్టి పిలవాలంటేనే ముడుచుకు పోయే మల్లె మొగ్గ లాంటి పిల్లని పెళ్ళి చేసుకుంటాను . వీడికి లా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తున్నాను అని చెప్పా గానే ఉరిమి చూడటం కాదు కదా ..
ఏదో వంకతో నా చెవి దగ్గరకు వచ్చి .. ఎక్కువ తాగకండి .. అని చెప్పి నేను కసురుకుంటాను ఏమో అనే సందేహం తనకు కలిగి.. మళ్ళి వెంటనే మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నాను ... అని.. గోము గా మొఖం పెట్టి .. సాగనంపుతుంది. పొద్దునే లేచి తను తల స్నానం చేసి .. సాంబ్రాణి పొగ వేసుకొని .. ఇల్లంతా శుభ్రం చేసి వాకిట్లో చక్కగా ముగ్గులు పెట్టుకొని ... పూజా కార్యక్రమం ముగించుకొని ,పెద్ద బొట్టు తో , కళ్ళకు కాటుక తో .. ఒక చేతిలో కాఫీ కప్పు తో ఇంకో చేతిలో పేపర్ తో వచ్చి నన్ను నిద్ర లేపి ... స్నానానికి అన్ని ఏర్పాట్లు చేసి .. నేను స్నానం ముగించి వచ్చే సరికి టిఫిన్ గట్రా వేడి వేడి గా వడ్డించి ... అది రా పెళ్ళైన జీవితం అంటే .. నాకు పెళ్లి అయితే అలా ఉంటుంది .. మీకు లా కాదు .."
"అబ్బో! అబ్బాయి గారికి చాల కోరికలు ఉన్నాయి ... ఐన వీడికి కావాల్సింది అమ్మాయి కాదు రా .. రోబో ..
వీడి దెబ్బకి తాగింది మొత్తం దిగిపోయింది రా బాబు..! చూస్తాం రా .. రేపు నీకు పెళ్ళి అయినప్పుడు .. చూస్తాం "
అని ఊరుకున్నారు ..
బాబోయి ఇప్పుడు సుబ్బి నన్ను అభి అని పిలిచింది అని చెప్తే ఇంకేమన్నా వుందా అని అనుకోని ఆఫీసు పని లో పడ్డాడు!
"అమ్మాయి ! నీ బస్సు.. 8 ఇంటికి కదా.. అప్పుడే వచేసారు?.. రండి అన్నయ్య గారు!" అని వాళ్ళమ్మ వచ్చిన వాళ్ళని పలకరించటం తో మెలకువ వచ్చి హాల్లో కి వచ్చి చూసాడు.. అభి. "ఎం అల్లుడు గారు ఎలా ఉన్నారు ?"
మావ గారి పలకరింపు .. ఆయన కాసేపు మాట్లాడి వాళ్ళ ఊరు తిరుగు ప్రయాణం కట్టారు ! ఆయనను బస్సు స్టాండ్ లో దించి అభి ఆఫీసు కి వెళ్ళిపోయాడు.. సుబ్బి తో మాటాడే అవకాశమే .. దొరకలేదు!
ఇంటికి తిరిగి వచ్చేసరికి సుబ్బి తల నిండా మల్లె పూలు పెట్టుకొని, గుమ్మం ముందు కూర్చొని ఎదురు చూస్తోంది!. సుబ్బీ ! అంటూ అభి స్లో మోషన్ లో పరిగేతుకుంటూ వెళ్ళే సరికి అతని కాలికి గుమ్మం తగిలిన్ది.. అబ్బా!అనుకుంటూ లేచి చూస్తే ఆఫీసు లో ఉన్నాడు ... హార్ని కలా ? అనుకొని. వెంటనే ఇంటికి బయలుదేరాడు ..
ఎక్కడా .. సుబ్బి జాడ లేదు .. ఎంత సేపు వాళ్ళమ్మ కి అనుమానం రాకుండా వెతికాడో తన గురించి .. ఇంకా ఉండ బట్టలేక అడిగేసాడు .." అమ్మా! తను ఏది ?" అని "సుబ్బి కి బ్యాంకు PO టెస్ట్ అయ్యింది కదా! ఈ రోజు ఇంటర్వ్యూ ఉంటేను వెళ్ళింది ! " సుబ్బి ఇంటర్వ్యూ కి వెళ్ళిందా ? అంటే తను ఉద్యోగం చేస్తుందా ? చేస్తే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ముందు ఎలా అనుకో సాగాడు అభి .. ఈ లోపలే తెలివి తెచ్చుకొని "అదేంటమ్మా .. ఒక్క దానినే పంపించావా?పొద్దునే చెప్పుంటే నేనే దింపే వాడిని కదా!" అని పైకి అని ఏదో ఒక నాటకం ఆడి .. అది ఇంటర్వ్యూ కి వెళ్ళ కుండా చేసే వాడిని అని మనసులో అనుకున్నాడు! " లేదు రా చెల్లి తీసుకెళ్ళింది స్కూటీ మీద!"
"దాని మొహం దానికే సరిగ్గా రాదు ఇంకా నువ్వు సుబ్బి ని దానికిచ్చి పంపించావా?".. "ఏంటి రా పెళ్ళాం మీద ప్రేమ పొంగిపోతున్నట్టు ఉంది ?.. ఐన సుబ్బే డ్రైవింగ్ .. చెల్లి దారి చెప్తుంది అంతే!" అంటే అంటే అంటే సుబ్బికి బండి నడపటం కూడా వచ్చా! ఖర్మ కాకపోతే ఇంకా బండి మీద నేను తీసుకెళ్ళే అప్పుడు ఏమండీ .. కాస్త నెమ్మది గా వెళ్లండి ప్లీజ్ అని ఎందుకు బ్రతిమాలుతుంది .. ఈ సరదా కూడా గంగ పాలె..
సాయంత్రం ఏడింటికి వచ్చారు సుబ్బి, చెల్లి .. ఇద్దరూ .. మంచి స్నేహితులు అయ్యిపోయినట్టు వున్నారు ఒకటే నవ్వులలో మునిగి పోయి వచ్చారు! అభిని చూడ గానే సుబ్బి ఒక్క గెంతు గెంతి "అభి! మీకో సంగతి తెలుసా నాకు జాబు confirm అయ్యింది ... వచ్చే నెలలో joining అని స్వీట్ బాక్స్ లో స్వీట్ నోట్లు కుక్కి అభి రియాక్షన్ కోసం చూడకుండా ... వంటింట్లోకి పరిగెత్తి ... అత్త గారికి ఒక స్వీట్ తినిపించి, భోజనాలు అయ్యే వరకు అత్త, కోడలు ,
మరదలు ఏవో కబుర్లు చెప్పుకున్నారు!మామగారు, భర్త గారు మాత్రం మాములుగా తిని లేచారు. ఈ
ఆడ వాళ్ళు ఇంతే కాబోలు .. అనుకున్నాడు అభి ఐన చెల్లి, అమ్మ తనతో ఎందుకు అంత చనువుగా వుంటున్నారు ఏదో తు తు మాటలాడితే కదా తను నాకు దగ్గరయ్యేది ..ఛ ఛ .. వీళ్ళకి అది కూడా తెలియదు అనుకున్నాడు. సుబ్బి గదిలోకి వచ్చినప్పుడు కనీ గమనించలేదు .. తన వాలు జడ .... ఎదీ లేదే .. "సుబ్బి ! నీ జడ ఏమయ్యింది రా ? " " నా జడ ఎప్పుడూ ఇంతే అండి .. పెళ్ళి కదా అందరూ గొడవ చేస్తే, సవరం వేసుకున్నా! నాకు పెద్ద జడ ఇష్టం ఉండదు!" అని అంది... చాలు బాబోయీ ఇన్ని మరీ ఇన్ని ఎదురు దెబ్బలా .. పై వాడికి నా మీద అస్సల కనికరం లేదు!
అభి పొద్దున్నే లేచి, కళ్ళు తెరిచే సరికి.. ఇళ్లంతా ఒకటే పొగ ... తన కలల రాకుమారి సుబ్బి .. గారి మహత్యం అని ఆనందం గా .. ఆ పొగ తో కూడిన గాలి పీల్చి ఏదో తేడా గా ఉందే అని, విషయం అర్ధం అయ్యి వంటింట్లోకి వెళ్ళి చూస్తే,
పొయ్యి మీద నుంచి ఒకటే పొగ.. పక్కనే సుబ్బి దగ్గుతూ .. ఏదో యుద్దానికి వెళ్ళే యోధురాలి లా గ్లోవ్స్ వెసుకొని.. రెండు చేతులతో .. రెండు గరిటలు పట్టుకుంది .. అభి ని చూసి "అభి.. మీ అమ్మ గారు లేరు మీ కోసం టిఫిన్ చేద్దాం అంటే ఇదిగో .. చూడండి ... " అంటూ బిక్క మొహం వేసింది ... అభి కి గుండె ఆగిపోయినంత పని అయ్యింది అంటే నా రాకుమారికి వంట చెయ్యటం రాదా ఇంకా వంటే రాదు అంటే ముగ్గులు ,పూజలు గోవిందా గోవిందా!? అని తన బిక్క మొహం చూసి ఆగ లేక తనే టిఫిన్ .. చేశాడు .. కరెక్ట్ గా తను వంట పూర్తి అయ్యే సరికి రవి వచ్చాడు .. ఇంక అభి కి ఇల్లు వాకిలి వదిలి వెను తిరగకుండా పరిగెత్తి పారిపోవాలి అనిపించింది.
పాపం అంత కన్నా షాకింగ్ విషయం ఏంటి అంటే ... "అన్నయ్యా ! ఎప్పుడు వచ్చావు అమెరికా నుంచి .. నాలుగు, నెలల దాకా రావు అంది ఒదిన మొన్న పెళ్ళికి రాలేదేమని అడిగితే! అభి .. ఈయన మా అన్నయ్య.. కొంచెం దూరం చుట్టల్లె ... ఆ మధ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని .. మా పెద్దమ్మ ఇప్పటి వరకు ఇంటికే రానియ్యలేదు .. పాపం ! మర్చిపోయా అన్నట్టు మీ సంబంధం నాన్నకు చెప్పిందే అన్నయ్య . చెప్పి అమెరికా వెళ్ళిపోయాడు !"
భగవంతుడు నా మీద కక్ష కట్టాడు అనుకున్న, కక్ష కట్టింది భగవంతుడు.. కాదు రవి గా ఎంత పని చేసావు రా .. తాగి వాగినందుకు ... అన్ని విధాలా నేను కుమిలి పోయేలా చెయ్యాలి అని ఇలా చేసావా అని.. అనుకుంటూ వుండగా .. రవి , అభి వైపు చూసి కన్ను కొట్టి "ఈ పరిచయాలు అనవసరం సుబ్బి .... మీ అయన నా బెస్ట్ ఫ్రెండ్!"
అని చెప్పాడు! రవి, అభి నెక్స్ట్ సిట్టింగ్ లో ఒక్కళ్ళని ఒక్కళ్ళు చితక బాదేసుకోవాలి అని రగిలిపోతూ ..
P.S : "సుబ్బి .. నువ్వు పేరు మార్చుకోవచ్చు కదా!.."
"ఎం .. ఈ పెరుకేం ?"
"కొంచెం పాత పేరు కదా ...? అందరూ ఎక్కిరిస్తారు కదా!"
"మనిషి విలువ పేరు లో ఉండదండి ... మనకు ఏ పేరు ఉన్న .. అది అందరూ ... గుర్తు పెట్టుకునే అంత మంచి పనులు చెయ్యాలి , పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని పడుకోండి !"
ఇంకేం మాట్లాడతాడు , ఎం మాట్లాడ గలడు ? ఇంత తెలివి తేటలు ఉంటే భార్యకు .. ఆఫీసు లో బాస్ మాట ఇంట్లో భార్య మాట .. వినక తప్పదు ... నా జీవితం ఇంతే అని నిట్టూర్చాడు

చదువుతున్నంత సేపూ చిరునవ్వు అలానే ఉండిపోయింది పిల్లా. నువ్వు సూపరహే..
ReplyDeleteThanks Darling! :)
DeleteSuper ga vundi ra...:)
ReplyDeleteNjoyed well...
nenu morning morning full ga navukunanu...
Nalini
Thanks Nalini :)
DeleteBagundi Saroja :)
ReplyDelete