Thursday, November 28, 2013

సంఘర్షణ

  చిన్నప్పటి  నుంచి నాకో పెద్ద సందేహం... అది ఆలోచిస్తూ కూర్చున్నాను..  పెద్ద శబ్దం! ధడేల్ మని ... నా  చేతిలో ని కాఫీ కప్పు నేనే విసిరికొట్టాను ... నాకు చాలా  ఇష్టమైన కప్పు .. నాకు మా ఆఫీసు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన కప్పు! కానీ పగలగోట్టేసా! అలా  సైకో ని చూసినట్టు చూడకండి నన్ను .. నా విసుగు .. చిరకు.. నాకు సంబందించినవే.. అరె నా పేరు చెప్పటం మర్చిపోయా నా పేరు అనన్య!

                    కప్పు పగిలిపోటం తో నాలోని  కోపం కూడా చల్లారిపోయింది ... ఆలోచించటం మొదలు పెట్టాను .. ఫోన్ చేశా తిరిగి ... నేను మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పెట్టేసినా సరే నేనే చేస్తా ... చెయ్యాలి! లేదంటే నాకు పొగరు స్వార్ధపరురాలిని ... ఫోన్ మోగుతోంది .. ఎత్తారు ..
 "ఏంటే ? ఎన్ని సార్లు  చేస్తావ్ ? చెప్పా కదా .. నాకు  చిరాగ్గా ఉంది  అని ?"
"అదేమీ లేదమ్మా ..  నీ ఇష్టం అని చెప్పుదాం అని ఫోన్ చేశా!"
అవతల వైపు నుంచి నీరసంగా చిరాగ్గా  ఉన్న గొంతు కాస్తా , ఉత్సాహం గా మారిపోయింది...
"నిజంగా నా .. నా తల్లే ! నీకు పూర్తిగా  ఇష్టం అయ్యే ఒప్పుకున్నావ్ గా?"
"హా " అని ఊరుకున్నాను..  ఇప్పటి వరకు మాట్లాడను, హాస్పిటల్ కి వెళ్ళను , నా జీవితం లోని ఆనందం అంతా  నువ్వే హరించావు  అంటేనే కదా నేను ఒప్పుకున్నది .. black  mail  చేసి ఒప్పుకునే లా  చేసింది కాక .. ఇష్ట పడి  ఒప్పుకున్నావ్ కదా అంటే ఏం  చెప్పాలి ?
"నీ ఇష్టం  లేకుండా అయితే వద్దు !"
"అమ్మ .. ఇందాకే మాట్లాడుకున్నాం.. మళ్ళి మళ్ళి .. నాకు discuss చేసే ఓపిక లేదు .. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి .."
"అదిగో ... నీ ఆనందం కోసమే  కదా  "
"ఏం  కావాలి నీకు ? నేను ఆనందం గా ఉండటమా ? ఒపపుకోటమా?"
"రెండూ..."
"ఒప్పుకోటం .. బలవంతం  ఒప్పించవచ్చు  కానీ .. ఆనందంగా ఉండమని  బలవంత  పెట్టలేరు .. అలా పెట్టినప్పుడు ఆనందంగా ఎవరూ  ఉండరు"
"చూడు అన్నీ అవే సర్దుకుంటాయి"
"సరే!"
ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాను  నేను...  ఎందుకు ఇంత complicate  అయ్యిపోయింది నా జీవితం  అని ..
ఈ లోపల మళ్ళి  ఫోన్ రింగ్ అయ్యింది..  క్యాబ్ wait చేస్తోంది అని ...

                                                                   *****

క్యాబ్ లో కూర్చున్నా  నా ఆలోచనలు వెంటాడుతునే ఉన్నాయ్! రెండేళ్ళ క్రితం వరకు నాకు ఏ బెంగా ఉండేది కాదు! ఎంతో హాయిగా .. ఆనందంగా  ఉండేది ... చదువుకుంటూ .. ఎలాగైనా  ఉద్యోగం సంపాదించాలి అనే కసి తో ఉద్యోగం కాకపోతే .. కనీసం అమెరికా వెళ్ళాలి అనే ఆశ తో చదివే దానిని .. అప్పుడు నాకు అది భారం అనిపించలా .. చాలా హాయిగా ఉండేది ... అప్పుడప్పుడూ కొంతమంది .. ఓర్వ లేక బాధ పెట్టినా అదొక వేరే పర్వం..  కానీ  శ్రీను ...మా  చిన్మయి  వాళ్ళ చుట్టాలబ్బాయి  మా కాలేజీ నే కానీ .. వేరే సెక్షన్ .. చిన్మయి కోసం వచ్చినప్పుడల్లా .. మాటలు కలిసి స్నేహితులం అయ్యాము ... కాలేజి  అయ్యిన నలుగు నెలలకే చిన్మయి కి పెళ్లి అయ్యింది ... నేను శ్రీను ఉద్యోగాల వేట లో హైదరాబాదు మీద పడ్డాం ... నేను అమ్మాయిల  హాస్టల్ లో  .. తను వాళ్ళ బంధువుల ఇంట్లో ... కానీ  కలిసే కోర్సులు నేర్చుకున్నాం ... కలిసే ఉద్యోగ ప్రయత్నాలు చేశాం ... ఎప్పడు ఇష్టం ఎలా ఇష్టమో నాకు తెలియదు ... అతను కాలేజీ రెండో సంవత్సరం నుంచే ఇష్టమని  చెప్తున్నా .. పట్టించుకోలేదు ... కానీ .. హైదరాబాదు  వచ్చిన తోలి రోజుల్లో .. ఉద్యోగం రాలేదనే నిరాశని ... ఇంటి నుంచి ఎన్ని రోజులు ఇలా డబ్బులు తప్పించుకుంటాము అనే బెంగని పంచుకోటానికి తానొక్కడే ఉన్నాడు కాబోలు అతనంటే ఎంతో అభిమానం తో పాటు .. ప్రేమ కూడా మొదలైంది .. అతను ఉంటే  ఎలాంటి కష్టాలైన .. పెద్ద లెక్క కాదు అనే ధైర్యం వచ్చింది .దానితొ పాటే ఉద్యోగమూ వచ్చింది ...మా ఇంట్లో పెళ్ళి  ప్రయత్నాలు మొదలు పెట్టారు ..  అతను వాళ్ళింట్లో నా గురించి చెప్పాడు ... ఎంతో గొడవ చేశారు ... స్నేహితులనుకున్నాం .. ఇదా మీ నిర్వాకం  అన్నారు ... శ్రీను బాగా బలవంత పెట్టటం తో వాళ్ళ నాన్న నా వివరాలు తెలుసుకున్నారు ... నేను అతనికన్నా నలుగు నెలలు పెద్ద దానిని అని తెలిసి ... ససేమీరా అన్నారు ... నాకు ఫోన్ చేసి వాళ్ళబ్బాయి ని వలలో వేసుకున్నాను అన్నారు ... ఆ రోజులు తలచుకుంటేనే ఇంకా  కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ...  శ్రీను కి అమెరికా వెళ్ళే అవకాశం  వచ్చింది..

"అను.. నన్ను మర్చిపో రా మీ ఇంట్లో చెప్పిన వాళ్ళని చేసుకో "
"నాలుగేళ్ళు వెంట పడ్డావ్ ? ఇప్పుడు మర్చిపో అంటున్నావ్ ...అంతా  నీ ఇష్టమేనా ?"
"అది కాదు రా ... ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఎం చెయ్యగలం చెప్పు నువ్వే ?"
"పెళ్లి చేసుకోలేమా?"
"లేచిపోయా ? నీకు ఈ లోకం గురించి తెలియదు కాకుల్లా  పొడుచుకు తింటారు మన కుటుంబాలని "
"పెద్ద పెద్ద ఘోరాలు చేసిన వాళ్ళనే మర్చిపోతున్నారు ... ఐన ఇదేం  పాపం కాదు ... మనం చిన్నపిల్లలం కాదు .. ఇద్దరికీ 24 ఏళ్ళు వచ్చాయి .. ఉద్యోగాలు ఉన్నాయ్ ... ఇంట్లో మన ఉద్దేశాలు చెప్పాము .. ఇంకా వాళ్ళు అంగీకరించక పొతే ఏం చేస్తాం ఇంతకన్నా ?"
"నేను అంత బరితెగించాలేను ?"
నా గుండె జారిపోయింది ... నా ప్రేమ ఏ  పాటిదో అర్ధం అయ్యిపోయింది .. కళ్ళలో నీళ్ళు తిరిగాయి ..
"బరి తెగింపా ? సరే  శ్రీను నేను వెళ్తున్నా ... "
అని వచ్చేస్తుంటే ...
 "నేను ఎప్పటికీ  పెళ్ళి  చేసుకోను అను ... మా వాళ్ళు నిన్ను నన్ను ఇంత బాధ పెట్టారు కదా వాళ్ళకి నా బాధ నీ బాధ తెలియజెప్పేలా  చేస్తా ఒట్టు!"
నాకు పిచ్చి కోపం వచ్చేసింది  .. ఏం నిరూపించాలి అనుకుంటున్నాడు ఇతను? అసలు నేను ప్రేమించింది ఇతనినేనా అనిపించింది ...
"మీ వాళ్ళని సాధించలనో ... ఇబ్బంది పెట్టాలనో  నేను అనుకోటం లేదు ... మనిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం కాబట్టి కలిసి ఉండే మార్గం చెప్పాను ... అది లేనప్పుడు ... మిగతాది అంతా  నాకు అనవసరం! ఐనా  నువ్వు తీసుకున్న నిర్ణయం మీద నిలబడలేని వాడివి ... నువ్వు .. ఈ రోజు ఏదో ఒట్టు వేస్తే అదే చేస్తావంటే ఎవరైనా ఎలా నమ్ముతారు ?"
అతని కళ్ళలో నీళ్ళు ... బాధ వేసింది .. కానీ  ఎదిగిన మూర్ఖుడిలా  కనిపించాడు ... మంచి వాడే కానీ  పిరికివాడు ..
"నిజం రా నేను అమెరికా వెళ్ళి  ఇంకా అస్సలు మా ఇంట్లో వాళ్ళతో మాటలడను నువ్వు మీ వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకొని హాయిగా ఉండు " అన్నాడు
"శ్రీను వెళ్ళే ముందు ఒక్క మాట చెప్పనా ? నువ్వు చూస్తూ ఉండు నాకంటే ముందు నువ్వే పెళ్ళి చేసుకుంటావు!"
అతను ఏదో చెప్పబోయి ఆగిపోయాడు ... నేను వెనక్కు తిరిగి నడిచి వచ్చేసా!..

Madam ... Office ఆ  గయా  అని క్యాబ్  డ్రైవర్ అనటం తో ప్రస్తుతం లోకి  వచ్చి .. క్యాబ్  దిగి ఆఫీసు లోకి నడిచాను.

                                                                      ******
"అను ... "
"హా "
"ఇధర్ ఆవో నా ఏక్  స్వీట్ తో లేకే జావో !"
మా colleague పిలిస్తే వెళ్ళి ...
" క్యా బాత్  హై  భాయ్ .. being  such  a  miser .. you  are  distributing  sweets ? "
"అను  తుం భీ  నా "
"వాడికి పెళ్ళి  కుదిరిందంటే ... " అనుకుంటూ వచ్చింది  మాలిని ..
"అచ్చా  congratulations !!!"
"వీడికి పిల్లనిచ్చేది ఎవరో అడగవా ?"
"మాలిని .. బస్ కర్ యా .. క్యా కమీ హై  ముజ్ మే ?"
మాలిని ఆలోచిస్తున్నట్టు గా  నటించిని
"అంతా ఓకే  కానీ ... వాగుడే  కాస్త  ఎక్కువ !"
అని నవ్వుతూ ... అది చెప్పింది నిజమే అని నవ్వొచింది నాకు ... పొద్దున్న నుంచీ  ఇదే నేను నవ్వటం ... అని గుర్తొచింది ...
"when  you only  got  someone  to  bear  you ...  I  easily  get  a  girl .."
నేను ఫక్కున నవ్వాను ... "బాబు నీ ఇంగ్లీష్ ఆపు ఇంకా " అని మాలిని దణ్ణం పెట్టింది ... "సందు దొరికితే మా ఆయన  మీద జాలి పడతావ్ .. అక్కడికి ఆయనేదో నన్ను పెళ్ళాడి త్యాగం చేసినట్టు ... " అని నా వైపు చూసి ...
"పదవే ... పని చూసుకుందాం ...పొద్దున్నె వీడి గోల"

                                                                      ********
system  ముందు కూర్చున్నానే కానీ  పని కదలటం లేదు ... చాలా  విసుగ్గా ఉంది ...  మళ్లీ   ఏవో గుర్తుకొస్తున్నాయి ...  నేను ఆ రోజు తనని వదిలి వచ్చేశాక  అతను అమెరికా  వెళ్ళిపోయాడు ... నాకు కానీ ... నా  స్నేహితులకు కానీ  ఒక కబురు లేదు ... అతని నెంబర్ కోసం చాలా  ప్రయత్నించాను ... ఎవరు అడిగినా .. తన కాంటాక్ట్ ఇవ్వద్దని .. ఆఫీసు లో చెప్పాడు అంట ... ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడటం లేదని తెలిసింది .. అప్పటికి నాకు బంగళూరు  లో ప్రాజెక్ట్ దొరికింది ... వెళ్ళిపోయాను ..  అతనంటే కోపం .. నా ఆత్మాభిమానం చంపుకుని ఇంకెప్పుడూ అతన్ని కలవాలి అని ప్రయత్నించలేదు ... చూస్తుండగానే సంవత్సరం గడిచింది...  అతనికి పెళ్ళి  కుదిరింది  అని ఎవరో చెప్పారు ... చాల బాధ అనిపించింది ... ఆ విషయం తెలిసిన రోజు చాలా చాలా ఏడ్చాను ... మోసపోయానే అనిపించింది ... అతను జీవితాంతం పెళ్ళి  చేసుకోకూడదు అని నేను ఎప్పుడూ  అనుకోలేదు  కానీ .. మరీ సంవత్సరానికే చేసుకుంటాడు అని కూడా అనుకోలేదు .. మళ్ళి  మాములు గా ఆఫీసు ... ఇళ్ళు ... మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు ... పిల్ల లావుగా ఉంది అని కొందరు ... కట్నం సరిపోదు అని కొందరు వంకలు పెడుతుంటే చిరాకు వచ్చేది ... అసలా చిన్నప్పటి నుంచి ఈ.. resume  forwarding  పెళ్ళిళ్ళు  అంటే  పెద్దగా  గిట్టేది  కాదు ... శ్రీను  విషయం తో ... ఇలా ప్రేమ పెళ్లి అన్న చిరాకేసింది ...మొత్తానికి పెళ్లి చేసుకోకూడదు అని అనిపిస్తోంది ... అందరూ  సలహా ఇస్తున్నారు ...  "ఆడ జన్మ  పరిపూర్ణం అంటే పెళ్ళి తోనే  అవ్వుతుంది ... నీకొక తోడూ కావలి "
ఇలా mother theresa  పెళ్ళి  చేసుకోకుండా ఉండలేదా ? నేను ఉండలేనా ? ఇలాంటి ప్రశ్నలతో ... ఎద విసుగు మోస్తోంది .. రోజూ ... ఎవరిని ప్రశ్నించను ? ఏమని ప్రశ్నించాలి ?....

"ఎవ్వరినీ  ప్రశ్నించకు ..." అని ఒక గొంతు వినపడింది ..
తిరిగి చూస్తే మాలిని నవ్వుతోంది ...
"పైకి ఎమన్నా అన్నానా ?"
"లేదే ... నీ మొహం చూస్తే అర్ధం అవ్వుతోంది ... పదా  కాఫీ తాగుదాం .."
                                                                   ********

ఇద్దరం కాఫీ తెచ్చుకొని బయట కూర్చొని తాగుతున్నాం ... నా బాధ అంత ఎవరికన్నా చెప్తే బాగుండు అనిపించింది ... తనకు చెప్పాను .. తను మొత్తం విని ... చిన్న నవ్వు నవ్వి ..
"పిచ్చి అను ... నీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నావో అది నీ ఇష్టం ...  కానీ నీ ఇష్టం తో అందరూ ఏకీభవించాలి అనుకోటం అమాయకత్వం"
నాకు అర్ధం కాక  చూస్తున్న తనని ...
"ఇలా చూడు .. ఒక్కోళ్ళకి జీవితం పై ఒక్కో రకమైన అవగాహన ఉంటుంది! అవునా ? దానితో పక్క వాళ్ళకి వాళ్లకి తోచిన సలహాలు ఇస్తూ ఉంటారు ... ఇంక మీ అమ్మ అంటావా .. ప్రపంచం ఏమంటుంది ... కూతురు ఒక్కతే సంతోషంగా ఉండగలదా ... లోకం ఉండనిస్తుంది అంటావా అని ఆవిడ భయాలు ఆవిడవి ... పైగా మనం దగ్గరగా ఎవరిని చూసి ఉండము కదా పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయిన  వాళ్ళని .. కాబట్టి జీర్ణించుకోవటం కష్టం... చూడు ముందు నువ్వు క్లియర్ గా ఉండు నీ బాధని ఇంట్లో వాళ్ళతో పంచుకో .. అర్ధం అయ్యేలా చెప్పు ... వినరు చెప్తూనే ఉండు కోపగించుకోకు ... చెప్తూనే ఉండు .. ఎందుకంటే నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్ కాబట్టి ... నీకు ఇంపార్టెంట్ కాని వాళ్లకు నువ్వు explain చెయ్యక్కర్లేదు .. అలంటి వాళ్ళ మాటలకు irritate అవ్వక్కర్లేదు. ఎవరూ ఎవరినీ బలవంత పెట్టలేరు. నీకు ఒక quote చెప్పనా ... "If  you  are clear  enough .. you will have nothing to choose ..  you just know what  to do "
తన మాటలో .. మరి  కాఫీనో తెలియదు ..... కానీ చాలా ఉత్సాహం వచ్చింది ....  ఇంతలో ఫోన్ మోగింది ...
"హలో "
"ఆ సంబంధం వద్దు అనుకున్నాం రా .."
"ఏమైంది "
"వాళ్ళు మరీ సంత లో బేరం ఆడినట్టు 25 సవరలు 22 సవరలు బంగారం ఇలా మాట్లాడారు ... చూడబోతే నువ్వు చెప్పిందే కరెక్ట్ లా ఉంది ... ఏదైతే అది అయ్యింది ... నీకు మనస్కరించి ... మనకు తగిన సంబంధం అనిపిస్తేనే ముందుకు వెళ్దాం అని  అన్నారు నాన్న ... నువ్వు మాత్రం దిగులు పెట్టుకోకు!"
అని ఫోన్ పెట్టేసింది అమ్మ..  ఎంతో తేలిక పడింది గుండె .. లేకపోతే  లక్షా .. రెండు లక్షలు అని బేరం ఆడే వాడు ఇంద్రుడైన ... నేను చేసుకోలేను ....
మాలిని వైపు చూసి నవ్వి ... "పదవే  చాల పని ఉంది ... చాలా చాల  థాంక్స్ వే !"
"నీ మొహం లే పద!"
అది హాయిగా చిరునవ్వు విసిరి.

P. S : All  Characters, incidents  and  conversations  are  purely  fictional .. Any  resemblance to  a  person  alive  or  dead  is  purely  coincidental .




Friday, November 22, 2013

మా దుర్గా గారి పెళ్లి కార్డు

దుర్గా రావు గారు అని మా ఫ్రెండ్ వాళ్ళ టీం లీడ్ అండి ... మనిషి మంచి వారే కానీ బాగా మొహమాటస్తులు...  అయన పెళ్లి కార్డు ప్రింట్  చేయించే  అప్పుడు  అందులో మేటర్ ప్రింట్ చేయించటానికి  నన్ను సలహా అడిగారు... అయన మొహమాటం పటాపంచలు అయ్యేలా లా రాయాలని ...  ఇదిగో ఈ కింది విధం గా రాసాను

The day I saw her, she looked like a White pearl to me
The minute I spoke to her, she blushed as pink as a rose..
The moment our eyes met, I dived deep into her blue eyes..
And from that day on.. she became my Rainbow in my rather colourless life...
I would want to invite you all to the grand occasion
Where I will take a holy oath of holding my VIBGYOR... Deepu's Hand forever!!

ఆయన మన అంత అల్లరి వారు కాకపోవటం చేత  ఆ 'Dived Deep into her blue eyes' తీసేద్దామా  అని  చాలా సార్లు తటపటాయించారు ... నేను , మా మైత్రి ... ప్రవళిక ఎవ్వరం ససే మీరా  అన్నాం ... ఇంకా అయన మా కోతి మూకని ఒప్పించ లేక  సరే కానివ్వండి అన్నారు ! :)

Saturday, November 16, 2013

Horror Story!!

I was peering through the glass window... with a coffee mug in my hands... little droplets of rain were still lingering on the window panel.. Its dark outside..or is it dark inside me too.?? What ever.. I don't want to think about that now! Not at this moment.. hot mug of coffee... and a bit of relaxation.... this bliss is enough for the moment... this is heaven! this is happiness! what else do I need? my eye lids batted to remind.. me what else do I need.. oh yes! I know.. its been three days.. but.. you have to get over it and accept life as is...well, you really can't change it! or can I ? I hate to think that I can change it because .. it mirrors my helplessness in not changing.. Is this all I am living for? Is this all I have worked so hard all my childhood for?
"Jashu" .. why do I hear voices all the time in my head? no I am not going to give in... leave me alone..

 "Jashu" this time a little louder.. NO.. I am not going to give in.. not at this moment!Lord! Have Mercy on me!! "Jashu" now it became a shout... My head is aching terribly.. looks like it will fall off... No.. leave me alone!!! "Jaswanth" someone shook me and.. I opened my eyes.. still rain drops lingered over the window panel along with the coffee droplets.. that spilled from my mug! I turned around..only to see the same person.. why?? But.. that poor fellow has been..my companion.. for these three days.. I can't actually curse him looking into his.. lifeless eyes..

 "Chalo Mishra Bhai..debug kar lethe!! Chalo.. mera coffee break tho ho gaya" and we walked into the cubicles!!

P.S: That is my fourth day in office, without bath , without sleep. All our team has survived this! Just face washes, teas,coffees and..samosas and biscuts. I regret being a software engineer now, I could have become a rocket scientist, by the amount of hard work I put in, in debugging the code

This Post is dedicated to Jaswanth Reddy for the extra ordinary bravery he has shown in working with same company even after this mishap!! Keep it up champ!

Random Poetry

Hey!!! good news or may be its little bad news for you guys, because you will have to go through my poetry now. oh!! Please don't give me that scared expression, its okay! you can survive this. I am sure of it, when you can survive the assault that our Telugu films make on your senses, this is nothing, its just a cake walk!

I have found an old book, three or four years old one, where I had written poetry randomly I guess, because I don't recollect the situations that led me to write this, neither personal ones nor inspired ones, so they were a bit charming and fresh for me when I read them last night. Touch wood! I was the one who wrote them.
Now fasten your seat belts and get ready.

****************************************************************************


నా మనసు మాటని పెదవి తలుపు తెరచి బయట పెట్టనంటుంది..
కళ్ళు మేము సాయపడతాము  అని నీకు చెప్పాటానికి ప్రయత్నిస్తున్నవి ....
నా ప్రేమ జడి వాన లో తడిసి ముద్దవుతూ కూడా అది స్నేహమే అనుకుంటావా?
సంద్రం అంత ప్రేమ నా పై కురిపించాలని ఆశించను!
మల్లె పువ్వు లాంటి నీ నవ్వు దోసిలి నిండుగా ఇస్తే , ఈ జన్మకి ఇది చాలనుకోనా?!!


*****************************************************************************
How was that? Bit childish right? But I was mesmerized by the last line, that is truly good (Ahem! Ahem! Self appraisal mode alert!!! **** Ok! Alret Checked! Taking Action ****)

Now lets get into another one! This looks like a very heart broken one!
*****************************************************************************

కను రెప్పలు తెరచి పెట్టి ఏళ్ళ తరబడి ఎదురు చూశాను ...
బీడు బారిన భూమి మీద తొలకరి ఝల్లు కురిసినట్టు ...
నీ ఊసుల చిరు ఝల్లు లో నా గుండెని తడిపి ముద్ద చేసి
చిరు ఆశలు చిగురులు తోడిగేలా చేశావు !

 నా ఎదురు చూపుల పర్వం ముగిసింది అనుకున్నా,
నే కన్న ప్రతి కలకి  నీ చేతితో రూపం ఇచ్చి మన ఇద్దరి శ్వాసని ప్రాణంగా పోస్తావనుకున్నా,
కానీ  కలల్లో నీవొక అందమైన కలలా మిగిలిపోతావనుకోలేదు.
నీ కను సైగకు  సైతం నాకు అర్ధం తెలుసు!
నీ ప్రతి పలుకుకీ  నాకు భావం తెలుసు,
కానీ ....
కులిరిసే నా కన్నుల ప్రశ్నకు , నీ సమాధానం సమంజసమైనదేనా ?
******************************************************************************
Hope you like them!


P.S: I am really super excited to find them! :)


Thursday, September 26, 2013

My Place, My Name,My Journery and My Stand!!

I am back!Well,with a title that may confuse few,but will simply tell what I am going to write or scribble below. As  I have mentioned in previous posts, introductions baffels me. When Mahesh jumps to make a blockbuster entry admist vegitables( Highly edible ones, mind you!) or Ram Charan jumps and turns around in  air to reveal his face or when a tiger jumps into a burning hoop and comes out as NTR Jr.  one would get some adreline rush and that sets the pace of a story. But, Its me, A small time aspiring writer. How am I supposed to sky rocket your expecations on my small write up ?

Hmm... Well, Never Mind!Let me be honest and write whatever I feel is right.  I don't want to steal all those glorious introductions of  our T-Town heros.
   
    Now lets get started with what I am supposed to write here. aa... umm .. by the way shall we?


"Eh... Come here.. You Girls! Seniors are calling? Can't you hear?"

( ఏ? seniors  పిలిస్తే.. ఇనపడట్లేదా?ఇటు రండి!"
we went to them slowly.. I am not sure.. if the other girls are afraid or not.. but I was never afraid.. you know.. in our campus.. ragging never goes over board.. its fun.. to know seniors.. to have some reputation.. but...finally it feels good.. when someone pays attention to you.. and you have no obligation to return that attention to them.. all you have to do is pretend that you are afraid.. so.. the

senior who called me asked me.. "Which place do you belong?" (ఏ ఊరు మనది?).. I really don't know how to answer this question...which place should I say is mine.. I was born in Gudiwada... raised in Tirupati.. completed my primary in Anantapur and completed my secondary school in Nellore. I thought of saying so for a moment.. but I know I would make a fool of myself if I say so.. why would anyone want to hear your life story.. just because he made a  mistake of asking you a question...? and by the time I decided a place among four towns.. he overlooked me...because I was.. well to tell the truth.. there are so many good looking girls in college and that day.. they are behind me.. so my

senior said before I can answer "You May Go" (hmm class కి పో ఇంక.. బా చదువుకో). Well to be very frank... I was rather disappointed that day...why on earth is he not interested in asking my name at the very least..? I held my head down.. clutched my books tight.. ( they might have thought that I am afraid of them) and walked into my classroom.. took a bench and stared into an empty book.. I am afraid.. to start a conversation... I would rather die ... I really don't know.. how to strike a conversation with a person whom I don't know .. I mean isn't it awkward? the girl beside me gave me a look and went back to her animated conversation with another girl on her other side... I was surprised.. how come a class of all new comers can be this boisterous.. I was in last bench... I noticed this when a teacher entered our class... the girl next to me called me and said.. "hey, I am keerthi!

what is your name?" ( నా పేరు కీర్తి! నీ పెరేంటి?)  I looked at her.. now am I supposed to tell her my name? I want to call my mom right now and yell at her... why should there be a name at all? Look at this girl's name..Keerthi.. How beautiful it is! and my name.. I mean.. it disgusts me!! Why can't anyone just talk to you without asking your name? why is this world obssessed with names?
I was thinking all these stuff.. then she asked me again " Are you new to this place? Do you live in a

 hostel? Don't worry.. talk to me" (ఊరుకి కొత్తా?Hostel లొ ఉంటున్నావా? భయపడకు.. చెప్పు నీ పేరు?) wait a minute... I am not afraid you silly little girl.. I was just lost in thoughts... oh ok now.. tell her your name.. its inevitable.. " My name is Ba.. hmm  Saroja"  ( నా పేరు బె ..  సరొజ )... and then teacher started lesson.. I didn't get a chance to extend the conversation with the girl.. well to be specific, with keerthi.

Next Day: last Bench ( Apparently Hostel girls come down early to the class and occupy all the first benches and we who come by college bus has to sit last)

Next Day: Last Bench

Next Day: Last Bench

Next Day: I stood up! Radhika maam said "Yes!"  and I asked her a doubt.. I seriously don't  remember  what I have asked.. but I was sure enough that my entire class and maam took a good notice of the girl.. who sat in last bench, and who listened to the lesson, and who had a doubt in it, and that doubt is way beyond  normal doubts and above all.. she stood up and asked it out... infront of the class... ( I never know its a Iginominy to ask question in a class from last bench!)

Next Day: I stood up! Maam said "Yes!" ..
"I don't want to sit here maam! Its not audile"
"There is no place in first bench right.. what do you want me to do dear?"
"Well, if that is okay with you I would like to sit in the empty first bench of the middle row "
"You mean in the boys row?"
"Yes mam.. I would prefer that rather than sitting in a last bench"
There was hushed silence all over the class...
My professor smiled and said...
"Come over dear... anyone else want to join her?"
Then keerthi and other girl also joined me.
I can feel every one's eyes on the girl who asked the permission of a lecturer to sit in a boys row first bench...  I didn't feel bad, sad  and was not afraid at that moment. But what I didn't know at that time is.. that's a seed.. for something else...

 Soon everyone forgot me.. what I did the other day... I was every teacher's pet, well almost every teacher's.. give the class a problem.. 1235 will do it.. She was one of the best students.. She never talks much, she never does any misdeeds, she is good... and life was going on peacefully.. then suddenly.. my english sir.. asked something..that hit me like a jolt... I was writing something in english.. then suddenly he called me.. "Who is Baby Saroja Nimmagadda" Its like awakening me from a deep sleep, by splashing ice cold water on me.. my heart skipped a beat.. every one looked at me.. I stood up.. now all of them have a menacing smile on their faces.. now we know your secret you little **RD
oh.. I want to cry.. run... hide my face.. duck some where.. everyone knows my name.. yes I am Baby Saroja.. now what? but to my surprise everyone forgot it soon enough... I felt releived.. and by now every one was used to this name Saroja.. so no one ever called me Baby Saroja..

 All through my First year I waited for some one to rag me.. but noone did.. Every girl used to say all her stories... like how almost all good looking seniors are going gaga over her.. and how she ignored him.. how irritated she is with all this happening around her.. I mean is it that irritating? I never knew.. they used to call my friend who sits next to me in bus.. but never me! I waited there in a half filled college bus seat a whole year for some one to come and rag me.. know about me.. talk to me.. give attention to me.. but no one did... No one did.. I wanted to tell this to one of my friends.. but I was afraid..what  if she thinks I am a crazy girl..  So, on the last day of my first year I have decided.. I will rag my juniors.. like anything...

Next Year:
" Yeah! Come Here!" I asked a girl... she came to me.. she is not pretending.. she came to me...
"Yes Maam".. she said..
 " Whats your name?"
"Sowmya"
"Baby Saroja!" someone called me out.. from behind.. I wanted to smash that person on face.. but unfortunately I cannot.. she is my hostel warden..
"Yes Maam"
"oh! good  Sowmya ! you are here too.. are you guys making friends...? cool then!"
hain? I am raggin this first year student and you say I am making friends ...? you stupid lady... and you just suspended 5 of my classmates just because they looked at junior girls? Maan I can't beleive this... why does every thing that I touch is such a disaster... why is there no fun in my life.. why is there no.. rule breaking or rebelling in my life???? I stood there watching stupidly into.. void even after warden and sowmya left ( this sowmya.. later became my best buddy).. but what about my wilder side...  I didn't know what was wrong with me...


A week later:

Suresh: "Keerthi, can you please ask saroja to lend her book?"

Keerthi:"సురేష్ కి నీ బూక్ కావలంటే"

I looked around... faced suresh and asked him

" Why don't you ask me directly?"

" I am afraid to talk to you.."

"What? But why?"

" I am afraid to talk to you because you wont spare anyone who soils your books right!"

"Yes, that's right then you can ask me, take my book and return it to me as it is.."

" Well, still I am afraid of you"

I really didn't know what to do... so my classmates.. are afraid of me!!!

Three Years Later:

 "Who are you?"
" I am Saroja"
"Who?"
" I am Baby Saroja"
"oh... is that you.. I was laughing all along these semisters looking your name on notice boards.. who is that lady who has Baby as her first name... ha ha ha ..  Well I am Abhishek"

Now that day.. I was enlightened suddenly,instinctively...and I understood something about myself...

I ran through college corridors and into my hostel.. ran all the way upto terrace.. and I yelled at myself...

"YOU ARE A NERD you jerk and you wonder why people don't make friends with you?"

So that was me  a few years ago...

After  6 years, I like thinking back.. about how  I used to think, how I used to feel bad about myself.. how I waited for attention...  I never regret being a Nerd  though.Today when someone asks me.. where do you belong.. I know... I just know... I belong to a place where I stay currently and all the other places belong to my memories...
and my name.. good or bad.. fancy or not... I want to make it big... larger than me... hopefully one day I will and  my stand... Life... is all about growing :)

P.S: Please ignore the spell checks, I haven't proof read it.. will correct in a while..


 

Wednesday, September 25, 2013

కార్తిక పౌర్ణమి- IV

ఇంకా ఎంత సేపు ఈ చెట్టు మీద కూర్చోవాలి? సమయం ఎంత అయ్యిందో? రేణు సంగతి ఏంటి? దానిని వెతకాలి… దానిని ఏమన్నా చెస్తూ ఉంటే? నేను ఇక్కడ పిరికి దాని లా కూర్చోవాలా?అవును ఎందుకు కూర్చున్నాను ఇలా? యషూ.. నువ్వు ఇంత పిరికి దానివా?.. ఇది పిరికితనం కాదు…ప్రాణం కాపాడుకొవటం కూడా పిరికితనమేనా? జాగర్త.. ఐనా ఇదంత రేణు వల్లనే కదా… అది వాళ్ళ ఊరు పిలవకుంటె ఇదేం జరిగేది కాదు కదా! ఛీ ఛీ.. ఏంటి నేను ఇలా అలోచిస్తున్నాను? నా మీద నాకే అసహ్యం వేసింది ఆ క్షణం.. ధైర్య వంతురాలిని అనుకునే నేను.. నా వరకు వస్తే ఇంత దారుణం గా అలోచిస్తానా?యషూ..అది నీ అలొచనే అయ్యి ఉండచ్చు… కానె  నేకు కాపాడాలి  అనే అలోచన కూడా వచ్చింది కదా..ఏ అలోచన ఆధారం గా నువ్వు పని చెస్తావో అదే నువ్వు..చెట్టు దిగు.. రేణు ని వెతుకు.. దానికి సాయం చెసే ప్రయత్నం లో చనిపోయినా ఫర్లెదు..అనుకొని నెమ్మదిగా ఊపిరి పీల్చి… “రేణూ…”
అని పిలిచాను.. ఎక్కడా అలికిడి లేదు… మెల్లగా చెట్టు దిగాను.. అలికిడి చెయ్యకుండా.. రేణు దాగున్న పొదలలొ చూశాను.. తను లేదు…ఎక్కడ  ఉంది? “రేణూ?” మెల్లగా పిలిచి.. ఆ పొదలలొ పాకుకుంటూ వెళ్ళాను…ఎక్కడో సన్నగా అలికిడి వినిపించింది… మళ్ళీ మబ్బు పట్టిందేమో.. కనిపించటం లేదు… ఇక్కడె ఉంది అని అనిపిస్తోంది… ఎక్కడ రేణు…? పెద్దగా పిలిస్తే వాళ్ళు వచ్చేస్తారు…  “రేణు?”
“యషూ… ఇక్కడే.. జాగర్త.. గుంట లో పడతావ్..”  నా కింద నుంచి వచ్చింది గొంతు… చూస్తే… ఆకులు అన్ని కప్పెసిన గుంట… కాదు… దడి లాగా కర్ర పుల్లలు కట్టి..దాని మీద ఆకులు కప్పి ఉన్నాయి.. అస్సల.. రేణు చెప్పకుంటే… నేణు అందులోనే అదుగేసే దానిని… కొత్తగా వచ్చిన చీకటికి కళ్ళు అలవాటు పడ్డాక.. చూస్తే…  ఒక మనిషి కిందకు పదినట్టు రంధ్రం ఉంది అందులో…
“రేణు? Thank  God! నేను.. భయపడ్డానే…” మిగతాది చెప్పటానికి..కాదు ఊహించటనికే భయం వేసింది..
"Sush..  గట్టిగా మాట్లాడకు….!  నీ ఓణి… చివర చింపెయ్యి… మవయ్య ఇక్కడే ఉన్నారు.. ఆయన టవల్ , నీ ఒణి కడితె.. మేము అది పట్టుకొని పైకి రావచ్చు… ఇందాకటి నుంచి.. ఎం చెయ్యాలో తెలియక .. కూర్చున్నాం.. ఇది ఏనుగులను  వేటాడటానికి తవ్వే గుంట."
 ఒక్క నిముషం నాకు ఏమీ అర్ధం కాలేదు “ మావయ్య ఎప్పుడొచ్చారు?ఏనుగులా? నాకేం అర్ధం కావటం లేదు! “
 “ యషూ… అశ్చర్యం తరువాత… చెప్పింది చెయ్యవే please..."
ణా  మూర్ఖత్వానికి నాకే  ఏదో లా అనిపించి… వెంటనే… నా ఓణి చింపి కిందకు వేసి పట్టుకున్నాను ఇద్దరూ మెల్లగా పైకి వచ్చారు.. హమ్మయ్యా అనుకున్నాను…
“రేణు మావయ్యా ఏంటే ఇక్కడ?”
“తరువాత.. ముందు.. మనం బయటపడాలి…” అని అంటూనే.. మావయ్య… దారి చూపించారు… మేము ముగ్గురం.. చప్పుడు లెని పరుగు అందుకున్నాం… ఇల పరిగెట్ట గలనని నాకు ఎప్పుడూ తెలియదు… మళ్ళీ … భయం.. రేణు ని మావయ్య ని చూసిన క్షనం లో నాకు… భయం అనిపించలెదు కానీ.. ఇప్పుడు మల్లి పరిగెడుతుంటె.. ప్రాణ భయం … కానీ ఇప్పుడు ఇంతక ముందు ఉన్నంత నిస్సహాయం  గా అనిపించలేదు! మావయ్య ఉన్నందుకేమో బహుశా.. ఏదో ఆశ.. ఈ రత్రి గడిచి.. పొద్దున్నె సుర్యుడిని చూస్తం అనే చిన్ని నమ్మకం..

                                                                ****
"నాకు నమ్మకం సన్న గిల్లుతాంది అయ్యా" మా అయ్య తో అన్నాను.. మా అయ్య ఇంటన్నట్టు లేడు..
"ఏమీ అలొసిత్తనావు అయ్యా?"
"ఏం లే బిడ్డా! ఆళ్ళు ఈ దిక్కున లేనట్టు ఉన్నారు..."
"ఎం సెద్దాం అయ్యా!ఇన్ని ఇన్ని సంవత్సరాల కల అట్ట వదిలెయ్యాల్సిందేనా?"
"బిడ్డా! ఈడ దంకా తెచ్చిన రుద్రయ్య మనల్ని ఇడిసిపెట్టడు.రేపు ఉదయాన్నే మనం రుద్రయ్య కి శాంతి
పూజ జరిపి శివయ్య గా కొలుస్తాం. ఇది నా ఆన!"
సరిగ్గా అదే నిమశాన ఏదో అలికిడి అయ్యినాది.. ఆ దిక్కున సూసే లొపల పెద్ద మెరుపు ఆ పై ఉరుము ఉరిమినాది..మా అయ్యా మాతదుతున్నడే గానీ,ఈడ లేడు! ఏదో దిగులుతొడ ఉన్నట్టు గా నుండె.. బహుశా నన్ను ఇడిసిపెట్టాల్నని
బెంగ నేమో.. మా అయ్య యెనకడుగు ఎయ్యగూడదంటే.. ఆళ్ళు దొరికినంక.. ముందు నాను... నన్నే అర్పించుకోవాల!ఎన్ని ఎన్ని జన్మాలు ఎందరు ఎందరు ఎదురు సూసి ఉంటారు అయ్యా? ఇప్పుడా యెనక అడుగెసెడిది?నేను నిన్ను వెనకడుగు వెయ్య నిచ్చేది లే అని ప్రతి దిక్కూ సూతన్నా..
నాకు ఆళ్ళు ఈ అడివి ఇడిసిపెట్టి పోవాల్లంటె గుడి దిక్కునే పోవాల.. వేరే దారి లేదు.. అనిపిస్తాంది. ఎంత దూరం పరిగెడెతే.. ఈ దిక్కున ఆళ్ళు బయట పడాల? ఈ ఇశయం కొత్త పోరికి తెలియకున్న.. రేణుకకి తెలుసు.. ఆళ్ళ మావయ్య ఆడ గుడి దగ్గర పడి ఉన్నాడు. ఈళ్ళు కచ్చితం గా ఆడకే రావల్ల..
ఎంటనే మా అయ్య దిక్కున తిరిగి "అయ్యా గుడి కాడ ఉందాం అయ్యా!" అంటిని.. మా అయ్య కి నాను ఏం అంటాండానో అర్ధం అయ్యింది.మా అయ్య కళ్ళు మెరిసినాయి. ఘడియ కింద ఉన్న దిగులు మాయమయ్యె మా అయ్య కళ్ళలొ.. నాకు ఎన్నెల ఎలుగు లో మా అయ్య కళ్ళు జూసి కొండంత సంబరమాయె. మా అయ్య తల ఊపి .. గుడి దిక్కు నడిసిండు.. నేను మా అయ్య ఎనకాల .. పరుగులంకించుకుంటిని.
                                                          ****

నమ్మకం అసల ఏ నమ్మకం తో ఇలా తప్పించుకొటానికి పరిగెదుతున్నామో నాకు అర్ధం కావటం లేదు. అసల పాపం యషూ ని తీసుకొచ్చి ఇలాంటి పరిస్థితి లొ పడెశాను. ఆయినా నాకు మాత్రం తెలుసా?ఇలా జరుగుతుంది అని? అసల ఎమైంది వీళ్ళకు?ఇంతక ముందు ఎన్నడూ ఇలా జరిగిన దాఖలాలు లేవే? తను మా నక్షత్రాలు అదిగింది.. నాది..యషు ది ఒకటే ఆరుద్రా నక్షత్రం అని చెప్పగానే మా పై దాడి చెసింది.. అంతే కొంప తీసి వీళ్ళు ఆ రుద్రయ్య-శివయ్య మూఢ నమ్మకాన్ని నమ్మటం లేదు కదా? అని అనుకుంటూ ఉండ గానే  మా కోసం వెతుకుతున్న వాళ్ళు మేము నెమ్మది గా నడుస్తున్న పొదలకి అవతల కొన్ని అంగల దూరం లో ఉన్నారు.. మాకు
" బిడ్డా! ఈడ దంకా తెచ్చిన రుద్రయ్య మనల్ని ఇడిసిపెట్టడు.రేపు ఉదయాన్నే మనం రుద్రయ్య కి శాంతి
పూజ జరిపి శివయ్య గా కొలుస్తాం. ఇది నా ఆన" అని శివయ్య అనటం వినిపించింది..
అది విని నా గుండె జారిపోయింది..ఆ ఇది లో అనుకోకుండా అక్కడే ఉన్న కర్ర పుల్ల మీద కాలు వెశాను... అది విరిగి చిన్న శబ్దం వచ్చింది.. ఆరుద్ర చూసింది అనే అనుకున్నా.. ఈ లొపల...పెద్ద మెరుపు తో కూడిన ఉరుము.. ఇదే అదును అనుకొని మవయ్య చెతినీ,యషు చెతిని పట్టుకొని.. ఒక్కటే పరుగు.. ఇప్పటి వరకు ఏమి జరుగుతుదో అర్ధం కాలేదు.. పొదల చాటున ఉన్నప్పుడు.. యషు గురించి, మవయ్య గురించి బెంగ.. తరువాత మవయ్య వచ్చి.. నా నోరు మూసి వెనక్కు లాగితే.. ఇద్దరం గొతి లొ పడ్డాం.. అప్పుడూ నాకు ఏమి చెయ్యలో అర్ధం కాలేదు.. ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు.. కానీ సాయంత్రం నుంచి మొట్ట మొదటి సారి నాకు ఏం చెయ్యలో తెలుసు.. ఎక్కడికి వెళ్ళలో తెలుసు.. గుడి దగ్గరకు వెళ్ళలి అక్కడి నుంచే బయటపడాలి.. వేరే దారి లేదు.. వీళ్ళు వెడిచి పెట్టరు.. ఇప్పటి వరకు తెల్ల వారిపొతే..ఎటోకటు వెళ్ళచ్చు అనుకున్నా.. లేదు.. పొరపాటు.. నాకు ఏమి ఐన ఫర్లేదు.. కాని యషు కి ఏమి కాకూడదు! నన్ను నమ్ముకొని వచ్చినందుకు ఏమి కాకూడదు...
                                                   ****
రేణు కి దెబ్బ తగిలినా, ఏమి జరిగినా ఇంత.. సారం ఎక్కడిదో.. ఆగకుండా పరిగెడుతొంది.. నాకు ఏమి కాకున్నా.. పరిగెట్టలెకపొతున్నా.. కానీ నా మది లో ఎన్నో ప్రశ్నలు.. రేణు.. వాళళ సంభషణ విన్న నిముషం నుంచి.. పరిగెడుతునే ఉంది .. ఇంత వరకూ భయం వెసినా.. దాని వెనక.. చిన్న ఆశ్చర్యం ఉంది..కానీ ఇప్పుడు అలా కాదు.. తన కళ్ళలో దిగులు.. భయం.. అన్నిటికీ మించినది.. నిస్సహాయత కనిపిస్తున్నాయి .. "రేణు..? ఎమిటే మవయ్య ఎలా వచ్చారు? వాళ్ళు ఎం మాట్లాడుకున్నరు ఎంటి ఇది అంతా.. నీకు తెలుసు.. నాకు చెప్పు అని ఆయస పడుతూ పరిగెడుతూనే నిలదీశాను... రేణు ఒక్క నిముషం ఆగినట్టు గా ఆగి.. మళ్ళీ పరిగెడుతూ.. చెప్ప సాగింది.. "ఆ గుడి కి ఒక కధ ఉంది.. అది.. రుద్ర నడిచిన భూమి మీద కట్టారు అనే పేరు ఉంది.. అంటే.. ఇంతక ముందు.. ఆ గుడి ఉన్న చోట స్మశానం ఉండేది.. నాకు తను చెప్పేది.. ఒక్క ముక్క కూడా అర్ధం కావటం లేదు.. స్మశానం మీద గుడి కట్టరా? ఐతే మాత్రం ఈ పరుగులు ఎమిటి? ఏ దాడులు ఎమిటి? తను పాపం పరిగెడుతునే.. ఆయస పడుతునే ఉంది.." రుద్ర అంటే తప్పు చెసిన వాళ్ళని భయకరం గా శిక్షించే దేవుడు.. ఆయన తరువాత..అక్కడ గుడి కడదాం అని అనుకున్నారు.. అక్కడే గొడవ.. గుడి కట్టిన తరువాత.. ఆ గుడి లోని దెవుడి గుర్తు గా తప్పు చేసినోళ్ళని కఠినంగా శిక్షించాలి అని కొందరు.. లెదు.. ఎవరినైన శిక్షించే హక్కు దెవుదికె తప్ప ఎవరికీ లేదని కొందరూ వాదించుకొని రెండు వర్గాలు గా విడిపోయారు ఇద్దరూ రుద్రని నమ్ముతారు.. కానీ ఒకళ్ళు స్వామి శంత మూర్తి అని.. ఇంకొకళ్ళు.. రౌద్ర మూర్తి అని..ఒకళ్ళు శివయ్య అంటారు .. ఇంకొకళ్ళు రుద్రయ్య అంటారు.. అలా గొడవలు జరుగుతూ ఉండగా మగవాళ్ళ గొడవలు.. శ్రుతి మించి .. గ్రామ పెద్ద గారి అబ్బాయి..వాళ్ళు.. రుద్రయ్య అని నమ్ముతారు.. ఎప్పటి నుంచో పూజారి గారి అమ్మాయిని ప్రెమించాడు.. ఆమే ఈ గొడవల ముందు ప్రేమించింది.. కానీ.. ఏ గొడవల కారణం గా అతనిని కాదు అంది.. మరి అతనే చంపాడో.. ఎవరు చంపారో తెలియదు.. అప్పటి.. నుంచి గొడవలు పెరిగిపొయాయి.. అదే రోజు నుంచి.. కోనేరు లోని శివలింగం తెజోమయం అయ్యింది.. అప్పటి పూజారి.. భయపడి... దెవుడికి కొపం వచ్చింది.. శివాలయం రుద్రాలయం అయ్యింది.. మెము ఇందులో పూజ చెయ్యము అన్నాడు.. మరి కూతురు పోయిందనో..ఎమో.. ఇంకా.. వాళ్ళ కులం వాళ్ళెవ్వరూ అడుగు పెట్టలేదు.. ఇక్కడ.. ఇదిగొ.. అప్పటి.. నిమ్న జాతి వళ్ళైన.. ఆరుద్ర వాళ్ళే.. పూజలు చెస్తున్నారు... రుద్రయ్య కి.. " అది కొంచెం ఆగి.. మళ్ళీ చెప్పింది.. "అప్పుడు.. ఆ పూజారి.. చెప్పింది ఎంటి అంటే.. అతనికి కల్లోకి.. రుద్రయ్య వచ్చి.. ఇల ఆరుద్రా నక్షత్రం కన్నెలను.. వాళ్ళంత వాళ్ళుగా గుడి లొనికి నడిచి వచ్చిన వాళ్ళను బలి ఇస్తే.. స్వామి కొపం తీరి రుద్రాలయం.. శివాలయం అవ్వుతుంది...అప్పుడు.. మళ్ళీ.. పూజారీ లు అడుగు పెట్టచ్చు.. ఈ గుడి లో.."
నాకు పిచ్చెత్తిపోయింది.. ఎప్పుడో.. వెయ్యి సంవత్సరాల కధని  నమ్మి.. మమ్మల్ని చపుతారా?
ఎక్కడ నుంచో తెలియని కోపం పొడుచుకొచ్చింది.. "What Nonsense is this.. Renu? Do you beleive in this shit?" కాస్త.. పెద్దగానే అన్నను.. రేణు.. "SuSh.. నేను.. నమ్మను .. నమ్మలేదు.. యషు.. కానే వాళ్ళు నమ్ముతున్నారు.. అందుకే మనం ఇలా ఆగకుండ ప్రాణాల కోసం పరిగెడుతున్నాం!" అని అంది.. అది ఆయాసపడుతూనే.. నేను.. నమ్మలెకపోయాను..నా జీవితం.. ఒక మూఢ నమ్మకానికి.. బలి కావటం.. నాకు ఇష్టం లేదు..కొంచెం పరుగు.. నిదానించి.. రేణు ని లాగాను.. అది..హఠాత్తుగా .. నేను లాగిన బలం కంటే ఎక్కువగా.. వెనక్కి తిరిగి.. నన్ను.. ఒక చెత్తు.. కి అదిమి పెట్టి.. " నువ్వు నమ్ము.. నమ్మకపో..but.. we are going to make it out of this mess.. I beleive this in my heart and you have to trust me.. కానీ.. దానికంటే.. ముందు.. నీకు నచ్చిన నచ్చకపోయినా.. నువ్వు నమ్మాల్సింది.. ఇంకోటి.. ఉంది whether you like it or not.. you woke up into a nightmare.. my dear darling.. now lets run out of it!"అని చెప్పి.. నా చేతిని.. బలం గా పట్టుకొని.. మళ్ళీ పరిగెత్తటం మొదలు పెట్టింది.

P.S: I tried my best to complete it.. but couldn't do it in this part... please don't mind spell checks..

To be Continued...

Wednesday, September 18, 2013

కార్తిక పౌర్ణమి -III

నేను బయటకి  వచ్చిన  నిముషం నుంచి ఆగకుండా పరిగెడుతున్నా,నా చెయ్యి పట్టుకొని పరిగేడుతున్నది ఎవరు..? అయ్యా రేణు  అందులోనే ఉండి పోయిందే  అని చూస్తే...  నన్ను బయటకు లాగిందే రేణు! నేను గమనించలేదు.. నేను భయపడుతుంటే  అది బయటపడే మార్గం ఆలోచించినట్టు ఉంది ...  మా వెనకాల శబ్దమే లేదు!మమ్మల్ని వాళ్ళు, తరమటం  మానేశారా? ఆగకుండా చాలా దూరం పరిగెట్టి బహుశా ఒక  పావుగంట సేపు పరిగెత్తమేమో.. ఇంక పరిగెట్టే ఓపికలేక ఒక  గుబురుగా ఉన్న  చెట్టు దగ్గర ఆగాము. విపరీతం గా అలిసిపోయా, ఆయాసం వస్తోంది, రేణు  మాట్లాడలేక సైగ చేసింది.. పైకి ఎక్కమని, అతి కష్టం మీద నేను చెట్టు ఎక్కుతూ 'ఖర్మ కాకపోతే లంగా ఓణి తో  చెట్టు ఎక్కటమేంటి? చచ్చే కష్టం గా  ఉంది  అనుకుంటూ ఉండ గానే పరికిణి  చివర చెట్టు కొమ్మకు చిక్కుకొని... వెనక్కు లాగినట్టు అయ్యి కింద పడ్డాను. "త్వరగా ఎక్కవే! ఈ చెట్టు చాలా  గుబురుగా  ఉంది  ఎవరికీ  కనిపించము" అంది  రేణు. నేను మళ్ళి కష్ట పడి  చెట్టు ఎక్కి , రేణు ని ఎక్కమనే లోపల ఎవరో ఆకుల్లో కదలాడే శబ్దం, మనుషులు కనిపించలేదు కానీ , అడుగుల శబ్దం పెద్దగా వినిపించింది  నేను పైకి సర్దుకున్నాను రేణు  ఎక్కుతుందేమో అని .. కానీ  తను  అక్కడే ఉండు  అన్నట్టు  సైగ చేసి, ఎదురుగా  ఉన్న  పొదల్లోకి  వెళ్ళింది. కింద ఆ రెండు జతల కాళ్ళకి సంబందించిన శరీరాలు కనిపించాయి....  నాకు ఒక్క నిముషం  గుండె  కొట్టుకోటం ఆగిపోయింది.. ఒక్క నాలుగు అడుగులు వేస్తే రేణు కనిపిస్తుంది.. లేదా పైకి తల ఎత్తి  చూస్తే నేను కనిపిస్తాను.... ఛ ! రేణుని ముందు ఎక్క మనల్సింది, పాపం దాని చేతికి గాయం కూడా అయ్యింది..
"యాడకి  పొయ్యి   ఉండరు! ఈడనే  దాక్కున్నారు!  ఈ దిక్కునే  పహారా కాద్దాం బిడ్డా !" అని అన్నాడు శివ , విని తల ఊపింది ఆరుద్ర. ఇద్దరు కొంత దూరం నడిచారు, తరువాత కనిపించలేదు..  చెట్టు దిగటానికి నాకు, ఆ పొదల్లోంచి కదలటానికి రేణుకి ధైర్యం చాల లేదు... అక్కడే ఉండు  అన్నట్టు సైగ చేసింది..
ఈ లోపల అమాంతం  పున్నమి వెన్నెలని వెక్కిరిస్తూ  మబ్బులు కమ్మేశాయి! వెన్నెల కాంతి అంతా చీకటి మయం  అయ్యిపోయింది.. విపరీతమైన వర్షం, ఎంత సేపు పడిందో చెప్పలేను.. బహుశా  రెండు గంటలు పడిందేమో.. మధ్యలో రేణు. గట్టిగా కేకపెట్టింది! ఎంత ప్రయత్నించినా  నాకు తను ఉన్న  చోట చీకటి తప్ప ఏమి కనిపించలేదు, వర్షం  సూదుల్లా  కంట్లోకే కురుస్తోంది! చూడలేకపోతున్న! తను ఎందుకు అరిచిందో,కిందకు  దిగే ప్రయత్నం కూడా చెయ్యలేకపోయాను.. ఎందుకంటే  ఎవరో చాలా  దగ్గరగా  తిరుగుతున్నట్టున్నారు .. చీకటి, భయం ..  తనకు  సాయం  చేసేందుకు కిందకు  దిగాలేకపోయాను. వర్షం తెరిపిచ్చాక వెన్నెల అల్లుకుంది.. అంత వరకు నిశ్శబ్దంగా ఉన్న  అడివి .. వర్షం  పడి  ఆగటంతో  అప్పుడే జీవం సంతరించుకున్నట్టు.. కీచురాళ్ళు , కప్పల  శబ్దాలతో, గుడ్లగూబల కూతలతో ...  నక్కల ఓలలతో  మారు  మోగిపోయింది.. ఇది కలే కదా! కల అయితే ఎంత బాగుణ్ణు!

                                                                 ****

ఏడనున్నారో ? ఎన్ని జన్మాలు  వేచాం సామి ..  ఈ యాల ... మా జీవితాలకి అర్ధం సెప్పె ఈ యాల గూడా  నీ పరీచ్చ ఆపవా సామి?...  నాకాడికొచ్చిన  ఈ వరాన్నిఇడిసి పెట్టా! ఈ యాల అడివంతా  జల్లెడ పట్టి అయినా  ఆళ్ళని  ఎతకాల... నానేమన్న  పొరపాటు సేసినానా?  నాను  సరిగా కలియజూడటం  లేదా? నా బిడ్డ! ... అని ఒక్క నిముషం కన్నపేగు కలుక్కు మన్నాది .. నా కంట్లో చివ్వున్న నీళ్ళు తిరిగినాయి.. ఆ ఎంటనే  మా అయ్య గుర్తోచినాడు.... ఆడేప్పుడు అనేటోడు ... "రుద్రయ్య బంటు అంటే... గుండె రాతి బండ లెక్క ఉండాలా" అని
ఈ యాల.. ఆడి  మాటల సారం బోధ పడతాంది! ఓ దిక్కు.. రుద్రయ్యకి మోచ్చం .. ఇంకో దిక్కు...
"బిడ్డా ! ఆ ఎదర  చూడు నువ్వు .. ఈ యెనక జూస్తా నేను !"
"అట్నే అయ్యా!"
నా బిడ్డ నా మాట దాటింది లేదు.. ఈ అయ్యా ఏది సెప్తే అది నమ్మినాది.. పసిగుడ్డుగా  ఉన్న  దినాం  మొదలు .. ఈ యాల  దాకా రుద్రయ్య కటాచ్చమే.. నా బిడ్డ అని నమ్మినా! ఈ యాల అది నిజం అయినాది .. అయినా నా  గుండె  బరువేక్కుతాందే... ఎతుకు శివయ్య  ఎతుకు .. ఆళ్ళు  కాన రావాల.. ఎన్ని జన్మాల... కాంచ  తీరాల..
ఎతికితే.. ఆళ్ళు  కానోస్తే... అయ్యా! నా గుండె గతి తప్పకుండా చూడు.. ఎనకడుగు ఎస్తానేమో  అనే  ఈ సమయాన మా అయ్య సెప్పిన పురాణం గుర్తుకు అస్తాంది!

                                                                 ****
"ఎయ్యి సంస్త్సరాల నాటి గుడి బిడ్డా ఇది.." నా సిన్న సిన్న కళ్ళు పెద్దవి సేసి సూసినాను.. నాను నమ్మలేక పోయినా..
"రుద్రయ్య బతికి  ఉండేటోడు  .. మనం తిరుగాడే నేల  మీదనే .. రుద్రయ్య నడిసిండు.... సెడు సేసే ఆళ్లంటే రుద్రయ్య
ఇడిసిపెట్టెటోడు   గాదు.. ఈడనే .. అప్పటి స్మశానం ఉండెడిది.. రుద్రయ్య.. ఈడనే .. ఉండేటోడు.. తప్పులు సేసినోళ్ళ  పుర్రెలు హారం  లెక్క  ఏసుకొని  తిరిగేటోడు...  అట్టాంటిది .. రుద్రయ్య  తరవాత..  అట్టా
సిచ్చించే  ఓళ్ళు  లేక నేల  అరాచకాలతో  ఇలా ఇలా లాడిపోనాది... మన పూర్వపుటోళ్ళు..  రుద్రయ్య నడిసిన  చోట గుడిగట్టి.. ఆ సామి ఏసిన సిచ్చలే ఏసేటోళ్ళు.. కానీ  రుద్రయ్యని శివయ్య అని పిలిసేటోళ్ళు  ఉండారు  గందా.. ఆళ్ళు .. గుడి కట్టేదానికి ఒప్పుకున్నరు గానీ.. సిచ్చలు  ఏసేది శివయ్య మాత్రమేనని   వాదులాటకు దిగినారు.. మన ఓళ్ళు ... ఆళ్ళ ఓళ్ళు .. గట్టిగ సమరాన పడినాక.. ఆ కోనేరు శివలింగం మెరవ సాగేనట.."
"అంతక ముందు మెరిసేడిది గాదా అయ్యా ?"
"లే  బిడ్డా... అప్పటి నుంచి ఇది రుద్రాలయమే బిడ్డా..  ఆల్లేమో  శివాలయం అంటారు .. రుద్రాలయం ఉండుట  మంచిది గాదు బిడ్డా...సామి  కోపంగానే ఉన్నాడు  అప్పటి సంది.. ఇది శివాలయం జెయ్యాలంటే.. మూడు ఆరుద్ర నక్షత్రం కన్నేలని బలి ఇవ్వాలి బిడ్డా.. ఒకటి మన బిడ్డ.. రెండు ఆళ్ళ బిడ్డలు.. కార్తిక  పున్నమి నాడు.. నీవు తేగూడదు... ఆల్లంత ఆళ్ళే  గుడి లోనికి రావాల  "
"బలి ఇస్తే సామి శాంతిస్తాడ? ఎవరంటిరి  అయ్యా  బాలి ఈయ్యాలని..?"
"అప్పటి గుడికి  సామి ... ఆ లింగం మేరవసాగానారంభించాక..  రుద్రయ్య కలలోకి వచ్చి చెప్పెనట!"
"బలి గోరే  సామి రుద్రయ్య అయ్యి ఉండడయ్య!"
మా అయ్యా మొఖాన క్రోధం జూసినా ..
"మీ యమ్మ  నీకు శివయ్య అని పేరు పెట్టినప్పుడే ..అడ్డు జెప్తావని అనుకుంటి రా.. "
"నాకు ముందు జెప్పినోళ్ళు.. ఏర్రి  యెదవలా  ఏమి?"
నాను ముడుసుకుంటిని...
"సూడు బిడ్డా... అందరూ  బతకతారు.. రుద్రయ్య కోసం సచ్చే దానికి రాసి ఉండాలి .. "
మా అయ్య జెప్పినదే నమ్మినా  నా బతుకంతా...  రుద్రయ్యను కొలిచినా.... నా బిడ్డకు  అదే జెప్పినా... నేను  నమ్మిందే  జెప్పినా... కాదు కాదు నాకు నమ్మమని జెప్పిందే జెప్పినా... మా పూర్వపుటోళ్ళు  అంతా ఏ  దేననికై ఎదురు జూసి సచ్చినారో .. ఆ రోజు వచ్చే... ఈ దినం రావలేనని... నేను మొక్కని క్షణం లెదు.. కానీ ... సామి.. సంతోసించాల్సిన .. రోజున ... ఈ రాతి గుండెన... కన్నీళ్ళు  ఏంది  సామి... ? ఎతుకు  శివ ఎతుకు ఆళ్ళు  దొరకాల!
కన్నీళ్ళు  తుడు ... నీ బిడ్డని జూసి నేర్చుకో...  రుద్రయ్య కోసం సచ్చేదానికి తాయారు అయ్యినాది...
 కళ్ళు  తుడుసుకుంటి! ఎతకనారంభించినా... రుద్రాలయం... శివాలయం గావల  రేపు .. సూరీడు పోదిచేలోపల.


 

Tuesday, September 17, 2013

కార్తిక పౌర్ణమి --II

నేను... తలుపు మూస్తుండగా  రేణు .. ఆ గుమ్మం  ముందు  ఉన్న మెట్టు మీద కూర్చొని, కత్తి  నెమ్మది గా  తీసి  తన వోణి  తో  కట్టు కట్టుకుంది. పాపం చాలా లోతుకు దిగినట్టు ఉంది, ఎంతో రక్తం కారుతోంది.. కళ్ళలోనుంచి నీళ్ళు వస్తున్నాయి  తనకు .. బహుశా నొప్పికి ఏమో...
"ఏమయ్యిందే  తనకు? ఎందుకు అలా చేసింది?"
"ఏమో నాకు మాత్రం ఎం తెలుసు, చాలా విచిత్రం గా ఉంది... అస్సల అర్ధం కాలేదు నాకు ..." తను మాట్లడుతుందే కానీ, శరీరం   వణుకుతోంది... నాకు తన పక్కన కూర్చోవాలి అని ఉన్నా... మావయ్యని వెతికి .. ఇంటికి వెళ్ళాలి కాబట్టి మెట్లు దిగుదాం అని.. చూసే సరికి  మావయ్య లేరు .. గేటు  దగ్గర  పడిపోయి ఉన్నారు...  రక్తం కారుతోంది .. ఆయన తలకి గాయం  అయ్యినట్టు  ఉంది, నేను  వెంటనే  ఆయన  దగ్గరకు వెళ్ళాను.  నాకు  ఒక్క నిముషం ఎం జరుగుతోందో అర్ధం కాలేదు, మమ్మల్ని అంటే  ఆరుద్ర  అలా చేసింది.. మరి మావయ్యని?... ఆరుద్ర  కొట్టిన గంట విని ఎవరో  వచ్చారు ఐతే... వెన్నులో వణుకు  పుట్టింది. ఇంతలో  రేణు  కూడా అక్కడికి వచ్చింది.  అప్పటి వరకు లేని భయం, ఎవరో ఉన్నారు.. ఇక్కడే ఉన్నారు .. ఎటు ఉన్నారో  తెలియదు..
                                                                        ***


"రేణు..  ఎవరో ఉన్నారే .."
 నా గొంతు  నాకే  వినపడలేదు .. భయం తో పూడుకు పోయింది, కానీ ఆశ్చర్యంగా రేణుకి వినపడినట్టు ఉంది, తను తల ఊపింది... ఆ కత్తి గాయం  అయ్యాక ఇదే తన ముఖం చూడటం.. చాలా నిస్సారం గా ఉంది, కానీ  తన కళ్ళు మాత్రం  చాలా చురుకు గా  పని చేస్తున్నాయి.. ఆ ప్రదేశం  అంతా..  పరికించి చూస్తూ, చుట్టూ  చీకటి  గుడి ద్వారం  దగ్గర వెలిగించిన దీపాలు,కోనేరు  దగ్గర ఉన్న శివలింగం  దగ్గర ఉన్న దీపాలు, చంద్రుని కాంతి తప్ప వేరే వెలుగు లేదు.. ఒక్క పది నిముషాల క్రితం( పది నిముషాలేనా ? అప్పుడే ఎన్నో రోజుల క్రితం  అన్నట్టు అనిపిస్తోంది ) చూసినంత అందం గా ఈ ప్రదేశం ఇప్పుడు కూడా ఉన్నా, ఇప్పుడు ఆనందం కంటే  భయం వేస్తోంది.. అంత చలి లొనూ చెమటలు పట్టాయి.  "రేణు , నువ్వు చూస్తూ  ఉండు నేను  మావయ్యకి కట్టు కడతాను అని దిక్కులలో  పొంచి ఉందేమో అని నేను అనుమానిస్తున్న ప్రమాదం కోసం వెతుకుతూ, కిందకి వంగి, మావయ్య  కండువా లా కప్పుకున్న, తుండును తీసుకొని చింపి  ఆయనకు కట్టు కట్టాను. ఆయన్ని కదిపినా లెవ లేదు...  రేణు  కిందకు వంగి, "నీళ్ళు తీసుకురానా?" అని అడిగింది....  బాడ్ ఐడియా, ఎవరో ఇక్కడే ఉన్నారు .. గుడి లోపల ఆరుద్ర ఇంకా తలుపులు బాదుతోంది .. ఇప్పుడు మాలో ఒకళ్ళు  నీళ్ళ కోసం  వెళ్ళటమా?...  నాకు ఎందుకో మంచిగా  అనిపించలేదు...
"ఇద్దరం వెళ్దాం"
 అని అన్నా, తను అదే అనుకున్నట్టు ఉంది..  మావయ్యను అక్కడే  విడిచి పెట్టి ఇద్దరం కోనేరు వైపు అడుగులు వేశాము. ఇంతక  ముందు చూడలేదో, లేదంటే  ఇప్పుడే  వచ్చిందో  ఒక వ్యక్తి  కోనేట్లోని శివలింగం  దగ్గర..  ఒళ్ళంతా  వీబుధి  పూసుకొని  ఏదో ధ్యానం లో ఉన్న వాడిలా(నిజంగానే  ఉన్నాడేమో) కూర్చున్నాడు. ఇద్దరం ఇంక ఒక్క అడుగు కూడా వెయ్యలేదు, కోయ్యబారిపోయాం. ఆరుద్ర దగ్గర ఉన్న కత్తి లాంటిదే  శివలింగం  దగ్గర  పెట్టి  ఉంది.
                                                                         ***


 భయం  కమ్మేసింది  ఇద్దరం  మావయ్య దగ్గరకు పరిగేత్తి   ఆయన్ను  లేపే అందుకు ప్రయత్నించాము, అయన లేవ  లేదు.. ఎం చెయ్యాలో  తెలియటం  లేదు...  గుండె చప్పుడు, నా గుండె చప్పుడే  అనుకుంటా  చెవ్వుల్లొ మరణ మృదంగం  లా  వినబడుతోంది. రేణు  దీనంగా  బ్రతిమాలుతోంది
"ప్లీజ్ మావయ్య, లేగవ్వా ? నాకు భయమేస్తోంది  మావయ్య అని", గర్భ గుడి తలుపులు శబ్దం  ఆరుద్ర, తలుపులు  బాదుతోంది...   ఈ లోపల  ఆ శివలింగం  దగ్గర  ఉన్న  వ్యక్తి  కత్తి  పట్టుకొని నెమ్మది గా  లేవ సాగాడు. ఆరుద్ర కళ్ళలో  కనిపించిన అదే ఆనందం  అంత దూరం  నుంచి కూడా నాకు ఆయన కళ్ళలో కనిపించింది.
నాకు భయమేసింది  రేణు ని పట్టుకున్నా..  తను ఏడుస్తోంది .. తనకు దారి తెలుసు  కానీ  ...
 "రేణు .. ఇంటికి ఎలా  వెళ్లలే...  చెప్పు  రేణు!"  తనని  కుదుపుతూ అడిగాను
ఏమి  చెప్పలేదు .. ఇప్పుడు  గుర్తు తెచ్చుకునే  సమయమూ  లేదు...   గుడి  బయట నుంచి  చెట్లలోకి  పరిగెట్టాము.... చివరి గా  వెనక్కి తెరిగి చూసే సరికి ఆ కత్తి మా వైపు విసిరి, అతను గర్భ గుడి వైపు వెళ్తున్నాడు  ఇప్పుడు  ఇద్దరు  వెతుకుతారు, ఒక్కోళ్ళకి  ఒక్కో వేటగాడు గాడు అన్న మాట.  మావయ్యని  ఎం  చేస్తారో, ఆయన్ని  వదిలేసి  రావటం ఏంటి? నా మనసులో తిట్టుకున్నాను. సొంత ప్రాణం అంటే అంత తీపా మాకు? నా మీద నాకే అసహ్యం వేసింది.  కానీ  ఏ  మూలనో, ఆయనని ఏమీ  చెయ్యరు  వాళ్ళకి  కావాల్సింది నేనూ, రేణు  మాత్రమే  అనిపించింది ...  ఇంకా పరిగెడుతూనే ఉన్నాం.. ఇంత  భయం లొనూ  నా బుర్రకి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయో  అర్ధం కాదు..  ఎవరన్నా  మేము  పరిగెట్టింది  రికార్డు చేసి ఉంటే, నేను రేణు ఏదో ఒక  వరల్డ్  రికార్డు  బ్రేక్ చేసి ఉండే  వాళ్ళమేమో  అనిపించింది. నా బుర్రకు  బుర్ర లేదు అని తిట్టుకొని, ఏదో  పంపు షెడ్డులా  ఉంది, అందులోకి వెళ్ళాం నేను రేణు. ఇద్దరం  ఆయాసం తో కింద కూర్చున్నాం, పరిగేట్టినంత సేపూ తెలియలేదు కానీ... కాళ్ళు లాగేస్తున్నాయి... కడుపులోని పేగులు మొత్తం ఎవరో  పట్టుకొని పిండేసినట్టు  అనిపిస్తోంది. మొదట కాళ్ళు  మాత్రమే  అనుకున్నా  కానీ, క్షణాలు  గడిచే  కొద్దీ, ఒళ్లంతా  తూట్లు పడిపోయినట్టు  ఒకటే  నొప్పి... ఇద్దరం ఒకరి  మొఖం లోకి  ఒక్కళ్ళు  చూస్తున్నాం కానీ  ఆయాసం  వల్ల  మాట్లాడుకోలేకపోయాం..  చివరకి  రేణు  నే మొదలు పెట్టింది....
"అతని పేరు శివ! ఆరుద్ర  వాళ్ళ నాన్న"
"అది సరేనే, వాళ్ళు ఎందుకు ఇలా కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు?"
""ఏమో నే"
" దొరికితే చంపేసే లా ఉన్నారు!"
"నాకూ  అదే  అర్ధం కావటం లేదు...  ఎప్పుడు ఇలా ఉండటం  చూడలేదు నేను!...  చాలా  మంచి వాళ్ళు .."
" కత్తులు  పట్టుకొని  మీదకి  వస్తుంటే  మంచి వాళ్ళు అంటావేంటే?" కోపం లో  నా గొంతు  కాస్త  పెద్ద శబ్దం తోనీ  మాట్లాడింది.
 బయట ఏదో అలికిడి అయ్యినట్టు    అనిపించి , ఇద్దరం  బిక్క చచ్చిపోయాం..  ఏవో అడుగులు  ఈ
పంపు షెడ్డు వైపే  వస్తున్నట్టు ఆకుల అలికిడి  వినిపించింది...

ఇద్దరం రెండు చేతులు  నోటికి అడ్డంగా పెట్టుకొని వింటున్నాం  ఎవరో  వస్తున్నారు...   చప్పుడు ...   ముందర తలుపులు కొడుతున్నారు.. లోపల  నుంచి  గడి  పెట్టి ఉండటం  తో ..షెడ్డు లో ఉన్నది  మేమే  అని అర్ధం అయ్యిపోయింది అవతల  వాళ్ళకి...ఆ తలుపు ఏ  నిముషం లో అన్నా వచ్చేసేలా ఉంది... ఇంక దొరికిపోతాం , కాదు  చచ్చిపోతాం ! అనుకుంటూ ఉండగానే , పంపుసెట్టు కోసం గోడలో చేసిన రంద్రం లోంచి నన్ను ఎవరో బయటకు లాగారు..
అరవటానికి ,ప్రతిఘటించటానికి   వీలు లేకుండానే  అంతా.. ఒక్క క్షణం లో జరిగింది..  తలుపు  బద్దలు  అయ్యిపోయిన  నిముషం, ఆ షెడ్డు లోంచి పండు వెన్నెల్లో  తడుస్తున్న  అడివిలోకి  నేను వచ్చిన  నిముషం ఒక్కటే..



P .S: To  Be  Continued .. 

కార్తిక పౌర్ణమి -I

నేను కల కన్నది ఇదేనా ? పొద్దున్న ఉలిక్కి పడి, నిద్ర లేవక ముందు నాకొచ్చిన కల ఇదేనా? ఇది కలేనా? కల అయితే ఎంత బాగుండు, ఇప్పుడు నేను ఉలిక్కి పడి  లేచి, ఇంట్లో హాయిగా నా మంచం మీద వెచ్చని దుప్పట్లో ఉంటే ఎంత బాగుణ్ణు!  కానీ  నాకు నా కళ్ళ ఎదురుగా  ఉన్న  ఈ చీకటి,  చీకట్లో పౌర్ణమి వెన్నెల  కాంతి లో, ఇలా బిక్కు బిక్కు మంటూ , అదే ఈ పరిస్థితి లో కాకుండా ఉండి ఉంటే, మల్లె పూలు విరజిమ్ముతున్నట్టు ఉన్న  వెన్నెలని ఆస్వాదించే దానిని. చిన్న చినుకు చుక్క నీళ్ళలో పడిన శబ్దం, ఆ శబ్దానికి ఉలిక్కి పడ్డాను, తీరా చూస్తే నా నుదుట చెమట ధారలా కారి, కిందనున్న మడుగులో పడిన శబ్దం  అది....

    ఇక్కడ  కూర్చుని ఈ సమయం లో ఇలా ఆలోచిస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక రెండు రోజుల క్రితం నా జీవితం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది!  ఎక్కడి  నుంచో, ఏదో ఒక మూలుగు వినిపించింది.. వెళ్ళనా? ఏమో ఇది నా కోసం పన్నిన వల అయితే?  అమ్మో అది తలచుకోవటానికి , చాలా భయంగా ఉంది. ఒక వేళ అది నిజంగానే  సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రాణి అయితే? ఇది ఇంకా భయం కలిగించింది. ఎప్పుడూ పెద్దగా, దేనికీ  ఏడ్చిన వ్యక్తిని కాను నేను, నిస్సహాయత ఇంత దారుణం గా ఉంటుంది అని మొదటి సారి అనిపించిన తరువాత, ఏడుపు వచ్చింది, ఈ  చీకట్లో..  వెన్నెల్లో..  అడవిలో, ఈ  చెట్టు మీద కూర్చోని  నిస్సహాయంగా  రాలుతున్న కనీళ్ళు  తుడుచుకుంటూ, ఈ పరిస్థితికి కారణాలు అన్వేషించ సాగాను..

                                                                      ***

"యశు, మనకు ఈ వారం రోజులు హాలిడేస్ కదా, నేను మా ఇంటికి వెళ్తున్నాను. నువ్వు కూడా మా ఇంటికి రావే ప్లీజ్"

" మీ ఇంటికా? అమ్మో మా ఇంట్లో ఏమంటారో?" వెళ్ళాలి అనే ఉంది, ఎంత స్నేహితురాలు ఐనా, తను అడగ్గానే  ఎగిరి గంతేసి  ఒప్పుకుంటే ఏం  బాగుంటుంది అందుకే ఈ బెట్టు.
" అబ్బా ! మీ ఇంట్లో నేను అడుగుతాను. ఐన నేను ప్రతి హాలిడే కి మీ ఇంటికి రావటం  లేదా? ఈ సారి   నువ్వు  వచ్చి తీరాల్సిందే!"  తన పద్ధతి లో హడావుడి చేస్తోంది రేణు.

తను, నేను కలిసి నాన్నగారిని ఒప్పించాము. రేణు వాళ్ళ ఊరు చూడాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా,
యానం దగ్గర చిన్న పల్లెటూరు కనకాలపేట  తనది. చాలా పాత ఊరు, ఇండో  ఫ్రెంచ్  కల్చర్, చుట్టూ చిన్న చిన్న అడవులు, ఇవన్ని వినటానికే ఎంతో ఉత్సాహం గా అనిపించింది.  అందులోనూ , చిన్నప్పటి నుంచి యానం  చూడాలనే కోరిక  ఉంది. వీలు కానంత దూరం కాకపోయినా ,ఎందుకో ఎప్పుడూ  వీలు చేసుకోలేదు. ఇప్పుడు రేణు వల్ల  ఆ అవకాశం వచ్చింది. ఎంతో ఆనందంగా అన్నీ ప్యాక్ చేసుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరాము. యానాం లో దిగిన వెంటనే, మమ్మల్ని వాళ్ళ ఊరు తీసుకెళ్ళటానికి రేణు వాళ్ళ నాన్న గారు, వాళ్ళ మావయ్య పాత  ambassedor  కారు లో వచ్చారు. హైదరాబాద్ నుంచి యానాం వచ్చిన నాకు 2013 నుంచి అమాంతం 1987 కి వచ్చినట్టు అనిపించింది. అక్కడ ఇళ్ళు, వీధులు మనకు  లానే ఉన్నాయి, కానీ  చిన్న చిన్న తేడాలు కూడా ఉన్నాయి, అవి ఏంటో  స్పష్టంగా తెలియటం లేదు, అయితే అందంగా మాత్రం అనిపించాయి.ఆ అందం ప్రదేశం వల్ల కాదేమో, బహుశా  ఇక్కడికి వచ్చాను అనే నా ఆనందం వల్లనేనేమో! యానాం  తరువాత, కొద్ది దూరం లోనే  కనకాలపేట అంట!
"ఎంత దూరం uncle  ఇక్కడి నుంచి మన ఊరు?"
"ఇక్కడి నుంచి 10 Km అమ్మ!"
"మధ్యలో అన్నీ  పోలలేనా?"
" కాదు రా, ఊళ్లకు చుట్టు పక్కల  పొలాలు ఉన్నాయి. ఊరు నుంచి దూరం వెళ్ళే కొద్దీ అంటే యానాం కి మన ఊరుకి మధ్యలో అడవి ఉంది."
"హయ్య ! అడివా? exciting !!"
"లేదమ్మా , ఇక్కడ అడివి  చాలా  ప్రమాదం, జంతువులు బానే ఉంటాయి! ఎలుగు బంటులు, నక్కలు, చిరుతలు, ఒకటో రెండో పులులు కూడా ఉన్నాయి అంటుంటారు"
"అవునే బాబు, ఇంక పాముల సంగతి సరే సరి! మా ఊర్లోకే చాలా వస్తాయి"
 అని పూర్తి చేసింది.
దూరంగా ఏదో ఆలయ గోపురం లా అనిపించింది... వెంటనే  "అది ఏంటి?" అని అడిగాను.
"అదా? శివాలయం. చాలా పాతది. ఒక 1000 సంవత్సరాల క్రితం గుడి. చాలా బాగుంటుంది. అసల ప్రతి కార్తిక పౌర్ణమికి ఆలయ గోపురం మీద నుంచి చందమామని చూస్తే, చాలా మంచిదంట! అక్కడే బయట, కోనేరు దగ్గర ఇంకో  పెద్ద శివలింగం ఉంటుంది, చీకట్లో కూడా చాలా తేజస్సు తో ఉంటుంది తెలుసా? కటిక అమావాస్య రోజున చూసినా, నల్ల రాతి తో చేసిన శివలింగమే అయినా ఏ దీపం లేకుండా  శివలింగం బాగా కనిపిస్తుంది."
"అవునా? ఎందుకలా? ఏదన్న ప్రత్యేకమైన రాయి తో చేసిందా?"
"ప్రత్యేకత రాయి లో కాదమ్మా, ఆ రాయిని దేవుని కింద మలచిన ఆయనలో ఉంది. ఆయనతో పాటు ఈ రోజు వరకు అదే గుడిలో సేవలు చేస్తున్న వాళ్ళ వంశం లో ఉంది. మా ఊరి లో ఉంది."
"మీరన్నది నిజమే అంకుల్  మనలో ప్రత్యేకత లేకుంటే దేవుని లోని ప్రత్యేకతను ఎలా గుర్తించగలం?"
అనుకుంటూ  ఉండగానే  ఇల్లు వచ్చేసింది.
"ఈ మధ్యనే నేను 10th  క్లాసు లో ఉన్నప్పుడు, మా పాత ఇల్లు  పడగొట్టి కట్టారు ఇది. ఎంతైనా  ఆ పాత ఇల్లే ఇష్టం నాకు. మా తాతగారు పోయాక కట్టారు నాన్న లేదంటే ఆయన అసల ఒప్పుకునే వారు కాదు". అంటూ కారు లోంచి దింగింది రేణు.
లోపల నుంచి రేణు  వాళ్ళ అమ్మ పళ్ళెం లో యెర్ర నీళ్ళు పట్టుకొని వచ్చి, గుమ్మం లోనే నన్నూ, రేణుని  నుంచో పెట్టి  దిష్టి తీసేశారు. రేణుకి చాలా చాలా  చిన్న తమ్ముడు  ఉన్నాడు. వాడు  5th  క్లాసు చదువుతున్నాడు అంట, అస్సలు మాట్లాడాడు చాలా  చాలా  సిగ్గు పడిపోయాడు, నన్ను చూసి, కొత్త మనిషిని కదా!
ఆ  రోజంతా, ఎంతో సందడి గా మా కాలేజీ కబుర్లు రేణు  వాళ్ళ అమ్మకి, నాన్నకి చెప్తూ  గడిపాము. ఆంటీ చేతి వంట, నాకు ఎప్పుడు తెలియని పల్లెటూరి వాతావరణం నాకు చాలా  నచ్చేశాయి. రేణు  తమ్ముడు సిగ్గుపడటం మాని చక్కగా చిరునవ్వు నవ్వే వరకు వచ్చాడు సాయంత్రానికి. ఆరు బయట పడుకోవాలి  అని అనిపించింది నాకు కానీ, పాములు ఎక్కువ తిరుగుతుంటాయి, కార్తిక మాసం చలి లో అది అంత మంచిది కాదు అని అంకుల్ అనటం తో మారు మాట్లాడకుండా ఇంట్లోనే పడుకున్నాం. ప్రయాణం వల్ల  అలిసి  పోయాం ఏమో, ఇద్దరం పడుకున్న వెంటనే నిద్రపోయాము.

                                                              ****
ఎవరో నన్ను తరుముతున్నారు, చీకటి ... వెన్నెల వల్ల  ఉండే  కాంతి పరిగెడుతున్నాను...  ఎక్కడికో  దూరం గా  పరిగెడుతున్నాను... ఇంత లోపల ఏదో తగిలి కింద పడిపోతున్నాను..... ఎక్కడ పడుతున్నాను? చీకటి ఏమి  కనిపించటం లేదు.. అనుకుంటూనే కింద పడిపోయాను...  ఉలిక్కి పడి లేచాను ... ఒళ్ళంతా  చెమటలు పట్టాయి.. నా పక్కన రేణు నోరు తెరుచుకొని మరీ నిద్ర పోతోంది. నవ్వు వచ్చింది. ఇంతకూ  నాకు ఇంత భయం కలిగించిన కల ఎంటబ్బా అని ఆలోచించాను, నాకు ఏమి గుర్తు రాలేదు. నాకు అంతక ముందు ఎన్నడూ  కల వచ్చిన గుర్తు కూడా లేదు, ఇదే మొదటి సారి నేను ఉలిక్కి పడి  లేవటం అప్పుడే తెల్ల వారు ఝామున 5:30 అవ్వటం తో ఇంక పడుకున్నా  నిద్ర పట్టదని లేచాను.  పొద్దున్నే  ఇంటి పెరటి లో ఆంటీ పూజ చేస్తున్నారు, రేణు  వాళ్ళ మావయ్య పొలానికి అనుకుంట బయలుదేరుతున్నారు. ఆయన పాపం  వినలేరు, మాట్లాడలేరు  అందుకే ఆయనకు కనిపించే ల సెల్యూట్  చేశాను "గుడ్ మార్నింగ్" అన్నట్టు, ఆయనా అందంగా, హుందాగా ఒక చిన్న నవ్వు నవ్వారు. ఆరు అడుగుల ఎత్తు, విశాలమైన భుజాలు, అందమైన నవ్వు ఇన్ని ఉన్నా ఆయనకు ఉన్న  వినికిడి లోపం వల్ల ఆయనకు పెళ్లి కాలేదు, రేణు  వాళ్ళతోనే ఉంటారు.

                                                              ****

"ఆంటీ మీ దగ్గర ఉన్న  ఈ నాలుగు రోజుల్లోనే  నేను  బాగా ఒళ్ళు చేసేలా ఉన్నాను!"
"నువ్వు మరీను, ఈ మాత్రానికే ! ఇప్పుడు భోజనాల తరువాత ఊరు చూసి రండి"
"సరే. అమ్మా , ఈ రోజు కార్తిక పౌర్ణమి కదా, శివాలయం కి వెళ్లి వద్దామే  సాయంత్రం, యశు కూడా చూసినట్టు  ఉంటుంది "
"అయ్యో! సాయంత్రం నేను నాన్న గారు యానం లో పెళ్ళికి వెళ్తున్నాం, పొద్దున్నకి అంతా వచ్చేస్తాం, మీరు మావయ్యని  తీసుకొని వెళ్లి రండి.కాకపోతే త్వరగా వచ్చేయండి. వచ్చే దారి అంతా అడవి కదా, ఎక్కువ రాత్రి వేళ తిరిగి రావటం అంత మంచిది కాదు!"
"అబ్బా ! నాకు తెలియదా అమ్మా?అయినా  మావయ్య ఉంటాడు గా మాతోటి"
"సరే  లేవే  కనీసం జాగర్త కూడా చెప్ప కూడదా?"

                                                              ****
మాములు అప్పుడు గుర్తు రాదు కానీ, గుడి అనగానే లంగా వోణి  వేసుకోవాలి అనిపిస్తుంది, నేను రేణు  తయారు అయ్యాం! చక్కగా ముచ్చటగా. ఆరింటికి బయలుదేరాం, ఏడింటికి కి అంతా  తిరిగి వచ్చేద్దాం అని మాతో పాటు ఆంటీ వాళ్ళు బయలుదేరి యానం వెళ్లారు. వెళ్ళే ముందు రేణు  తమ్ముడు మాత్రం వెనక్కి  వచ్చి నన్ను,రేణు  ని ముద్దు పెట్టుకొని "జాగర్త అక్క" అని చెప్పి వెళ్ళాడు, వాడు అల చెప్పటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, కానీ  వాడి చిట్టి చిట్టి చేతుల్ని ముద్దు పెట్టుకోకుండా ఉండలేక పోయాను.

                                                            ****

నేను కూర్చున్న చెట్టు కింద ఏదో అలికిడి అయ్యినట్టుగా ఉంది. గుండె దడ దడ లాడింది. కింద నుండి ఎవరైనా పైకి చూస్తే కనిపించకుండా గుబురుగా ఉన్న కొమ్మ పై కూర్చున్నా, నాకే తెలియకుండా చలికో , భయానికో  నా శరీరం వణక   సాగింది. కంట్లోంచి నాతో సంబంధం లేకుండా నీళ్ళు  రా సాగాయి. బుజ్జి గాడి చేతిని ముద్దు పెట్టుకుంది ఈ రోజు సాయంత్రమేనా? ఎన్నో సంవత్సరాలు , ఎన్నో యుగాలు గడచినట్టుగా ఉంది.
నేను, రేణు , మావయ్య  కలిసి గుడికి వచ్చాం.  ఎంతో  అందమైన గుడి, కట్టి వెయ్యి సంవత్సరాలు అయినా, ఏ  మాత్రం చెక్కు చెదరలేదు. పాత  గుడి అని తెలుస్తోంది, అందరూ  నడచి, నడచి ఉండటం  చేత బండలు నునుపు తేలాయి. దీపాల కాంతి తప్ప లైట్స్ ఏమి లేని ఆలయం సహజమైన శోభతో వెలిగిపోతోంది, ఆలయం ముందు ఉన్న కోనేరు అందులోని కలువ పువ్వులు , కోనేరు వద్దనున్న శివలింగం  అబ్బా! ఎవ్వరన్న ఇలాంటి ఒక అందమైన దృశ్యం చూడకుండా చనిపోతే ఆ జీవితం వ్యర్ధం అన్నట్టే .. నాకైతే ఆ గుడి ప్రాంగణం లోనే  కూర్చొని రోజంతా పెన్సిల్ స్కెచ్ వేసుకోవాలి అనిపించింది. మావయ్య కోనేరు దగ్గర ఉన్నారు .. నేను, రేణు కలువ పూలు కోసాము. గుడిలోకి వెళ్ళే అప్పుడు ఆలయ శిఖరం నుంచి చంద్రుణ్ణి  చూసిన ఆ దృశ్యం ఆహా! ఇది ఎలాగైనా స్కెచ్ గీయాలి  గుర్తు పెట్టుకొని అని అనుకున్నాను ..
                                                           ****

గుడి లోపల ఒక చిన్న నంది విగ్రహం ఉంది. గర్బః గుడి లో ఒక శివలింగం ఉంది. అంతా  దీపపు కాంతి లోనే కనిపిస్తోంది..  ఎంతో అందంగా ఉంది, పూలు పూజారికి ఇస్తాము  ఏమో అనుకున్నా, కానీ  గుడి లోంచి ఒక అందమైన అమ్మాయి , సుమారు నా వయసు అంత ఉండే  అమ్మాయి వచ్చి , పూలు తీసుకొనింది.
"ఎలా ఉన్నావ్ రేణు ?" అని అడిగింది
"ఆరుద్ర! నేను బాగున్నాను .. నువ్వు ఎలా ఉన్నావ్ ?"
"బాగున్నాను . ఈమె నీ స్నేహితురాలా ?"
"అవును ! నా  స్నేహితురాలు యశస్విని ..  యశు తిను ఆరుద్ర , ఈ గుడి అర్చకుల కూతురు , రోజు మాములుగా తనే ఉంటుంది ఇక్కడ , తనకు కుదరనప్పుడు, వాళ్ళ నాన్న వుంటారు " . నేను  ఆరుద్ర వైపు చూసి చిన్నగా నవ్వాను, తను కూడా తిరిగి ఒక చిరునవ్వు  విసిరి  మా నక్షత్రాలు అడిగింది.. నేను కొంచెం ఆశ్చర్యపోయాను... మాములుగా అయితే, గోత్రాలు కదా అడగాలి అని .. నేను ఆరుద్ర నక్షత్రం అని చెప్పను, రేణు దీ  అదే నక్షత్రం, ఇద్దరి జన్మ ఘడియలు అడిగింది చెప్పాము ..
అప్పుడు అంత వరకూ ప్రశాంతంగా అందంగా ఉన్నతన  కళ్ళలో ఏదో తెలియని ఒక ఆనందం... అది మాములు మనుషులు పడే ఆనందం లా అనిపించలేదు. ఎన్నో జన్మల నుంచి వేచి ఉన్నది  దొరికితే కలిగే ఆనందం లా అనిపించింది.. ఏమిటో అర్ధం కాక  తననే చూస్తున్న నేను కొంచెం ఆశ్చర్య పోయాను. అప్పటి వరకు, ఆ గది పైకప్పు లా ఉన్న దగ్గర ఇప్పుడో చిన్న సొరుగు లా కనిపించింది అందులోంచి ఒక పెద్ద గంట బయటకు వచ్చింది.. ఈ అమ్మాయి ఆ గంటను మూడు సార్లు కొట్టింది, అదే గంట నుంచి ఒక పెద్ద కత్తి  ని తీసి రేణు  మీదకు విసిరింది, అంతా  రెప్ప పాటు లో జరిగింది.. రేణు  చేతి కి కత్తి  తగిలి రక్తం రా సాగింది, ఆరుద్ర కళ్ళలో అదే క్రూరం తో  రేణు  వైపుకి రా సాగింది నేను ఆమెను నెట్టేసి, రేణు  రెండో చెయ్యి పట్టుకొని,బయటకు  లాగి గుడి తలుపులు ముయ్యబోయాను... పెద్దవి కావటం తో అవి మూసుకోటానికి చాలా సమయం పట్టింది.




Thursday, May 16, 2013

వెంకట సుబ్బ లక్ష్మి WEDS అభిజిత్

  "ఒరేయ్  అభి, నీ కాబోయే పెళ్ళాం పేరు ఇప్పటి దాకా  చెప్పలేదు అంటే నీకు సిగ్గు ఏమో అనుకున్నా, ఇదా విషయం!.... బా... బా  బాగుంది రా!" అంటూ పొట్ట చెక్కలయ్యే లా  నవ్వారు అభి స్నేహితులు. అతనికేమో ఎం సమాధానం చెప్పాలో తెలియక, వాళ్ళని తిట్టలేక , నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులలో  బుంగ మూతి పెట్టుకొని కూర్చున్నాడు. బాగా సాంతం కింద పడి పొర్లి పొర్లి నవ్విన తరువాత, అభి వద్దకు మళ్లీ  వచ్చి "ఎన్ని కబుర్లు చెప్పావ్ రా నా భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి , పేరు దగ్గర నుంచి ఆమె జుట్టు కోసల  వరకు నాకు నచ్చనిదే చేసుకోను అని హ హ హ హ ..... భ భలే  అయ్యిందా రా నీకు! నీ తిక్క తీరింది  వెధవ!" ఇంకా  అభి కి
ఏమనాలో అర్ధం కాలేదు కాని ఉక్రోషం పొడుచుకొచ్చింది!"అరె సుబ్బు పేరు ఒక్కటే అలా ఉంది రా, తన మాత్రం దేవ కన్య ల ఉంటుంది! అందుకే పెళ్ళికి ఒప్పుకున్నా!" అన్నాడు. అంతక ముందే Flexi పై ఆమె ఫోటో చూసి ఉండటం మూలాన ఎవరు ఇంకా ఎగతాళి చెయ్యలేదు కొంత , ఇంకా ఏడిపిస్తే పెళ్ళికొడుకు ఉడుకు మోతు తనం ఆపుకోలేక కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు ఏమో అనే అనుమానం తో కొంత ఎవరు ఏమి మాట్లాడలేదు. "పెళ్ళి కొడుకుని  తీసుకురండి అమ్మ!" అని పంతులు గారి మాట వినపడటం తో అంత ఆ పని లో పడ్డారు.

              పెళ్ళి హడావుడి,వ్రతాలు ,పూజలు,నోములు,వాయనాలు ,చేటలు  తీర్చటాలు  అన్నీ  అయ్యాక, తొలి రాత్రి మాత్రమే  సుబ్బి తో మాట్లాడటానికి కుదిరింది అభికి." సుబ్బు" అని పిలిచాడు తనని తనేమో "అభి! మీరు నన్ను సుబ్బి అని పిలవండి ప్లీజ్!" అంది. ఎన్నెన్నో కలలు కని, ఏరి కోరి పల్లెటూరిలో పుట్టి పెరిగిన
చదువుకున్న పిల్లను, పెళ్ళికి ముందు ఒక్క సారి కూడా మాట్లాడకుండా చాలా సాంప్రదాయ బద్దంగా పెళ్ళి
చేసుకుంటే, తనతో ఆమె మాట్లాడిన మొదటి మాటే అభి గుండెలలో ధడేల్ అనే శబ్దం తో రాయి వేసింది ... ఐన సరే
కొంచెం తమాయించుకొని ఈ రోజు ఎలా ఐన మంచి రాపో Build చేసుకోవాలి అని నిర్ణయించుకొని "అదేమి ?" అని అడిగాడు. "అంటే సుబ్బు అంటే మగాళ్ళ పేరులా ఉంది కదండీ! ఐనా  నన్ను అందరూ సుబ్బి అనే పిలుస్తారు నాకు అదే అలవాటు!"  అబ్బో అనుకొని, ట్రాక్ ని  ఎలా ఐన రొమాన్స్ వైపు మళ్ళించాలి అని మళ్లి   గట్టిగా నిర్ణయించుకొని, ఆమె చెయ్యి పట్టుకొని "అందరికి నాకు తేడా లేదా?" అని అడిగాడు. ఆమె కొంచెం చిన్నగా నవ్వి "ఆ తేడా ఉండదా  అని మీరు అడగ కూడదు,సంపాదించుకోవాలి!" అని కొంటెగా నవ్వింది. ఆ నవ్వు కి అర్ధం ఏమిటో అర్ధం కాక అభి అయోమయం లో  పడ్డాడు!

          పెళ్ళైన పది  రోజులకి ఆఫీసుకి  వచ్చిన అభిని అందరూ  అభినందించారు!అభికి అంతా అయోమయం గా ఉంది, ప్రేమించి తగలడే అంత ధైర్యం ఎప్పుడూ లేదు .. పోనీ పెళ్ళాడిన పిల్లని ప్రేమించేస్తే ఎలాగు పెళ్లైంది కాబట్టి చచ్చినట్టు తిరిగి ప్రేమిస్తుంది అనుకుంటే అదేమో  ఆశ! దోశ! అప్పడం! వడ! ఆ ప్రత్యేకత సంపాదించుకోవాలి అంటుందా? రేపు ఉదయం తను వాళ్ళ ఊరు నుండి  రాగానే చెప్పేస్తా... ఇదిగో అమ్మాయి ఇలా సంపాదించుకోవటం గట్రాలు ఏమీ లేవు, నువ్వు పెళ్ళి చేసుకున్నావు అంటేనే నేను అందరికన్నా స్పెషల్ నీకు అని ! ఐన ఎంత గడుసుది కాకపోతే నాతో మాట్లాడిన మొదటి మాటే నా పేరు పెట్టి పిలుస్తుందా! అనే ఆలోచన రాగానే ఉలిక్కి పడి పక్కన చూసుకున్నాడు, ఎవరన్న తన ఆలోచనని చదివితే ఇంకేమన్నా ... ఉందా ! పులుసులో కర్వేపాకు లా తనని విలువ లేకుండా తీసిపారేస్తారు ఇక మీదట...  ఐనా నోటి  కండూతి కాకపోతే ఒరే అభి గా ఎన్ని మాటలన్నావు రా వాళ్ళని! అనుకుంటూ అభి తన గతం లోకి చూసుకున్నాడు ఒక సారి ....
  
           రవి లవ్ మ్యారేజ్ చేసుకొని ఏడాది అయ్యిన సందర్భం లో అతను ఇచ్చిన బీర్ పార్టీ లో పీకల దాకా తాగి... ఒళ్ళు తెలియని స్థితిలో పార్టీ ఇచ్చిన రవిని ఎన్నో రోజులుగా అడగాలనుకున్నవి సారీ కడగాలనుకున్నవి కడిగేసాడు

"ఒరే  రవీ ... తాగి మాటడుతున్నాను అనుకోవు కదా.. "
"లేదు లే చెప్పరా ... బాబాయి "
"మీ ఆవిడకేంటి రా అంత పొగరు?"
"ఏరా ... నిన్నేమన్న అందా ఎప్పుడన్నా ?"
"కాదు మామా ... నన్ను అంటే దులుపేసుకునే వాడిని రా.. ఒదిన పాద దర్శనం అయ్యింది తల్లిలా  దండించింది అని.. "
"మరి?"
"నిన్ను అన్నది అన్నయ్యా!... రాముడు లాంటి నిన్ను మా అందరి ముందు పేరు పెట్టి పిలిచింది రా .."
"ఓస్స్ అంతేనా? ఇంకా ఏంటో అనుకున్నా కదా రా మామా ...తను మన classmate కదా రా ... తనకు అదే అలవాటు .."
"నువ్విలా వెనకేసుకొస్తే ఎలా మామా ... రేపొద్దున్న... పిల్లల  చేత కూడా పేరు పెట్టి పిలిపిస్తుంది... "
"ఏంటి రా .. నీ గోల ... "
"గోల లానే ఉంటుంది రా .. ఎందుకంటే .. మీ అందరికీ కళ్ళు మూసుకు పోయాయి ... ప్రేమ అని చెప్పి ... ఏదో షుమారు గా ఉన్న అమ్మాయి ని చూసి చేసుకొని తనకే దాసోహం అయిపోయారు రా... "
"ఛ! నువ్వేం చేస్తావో మేము చూస్తాం గా.. "
"చూడండి రా.. నా పెళ్ళాం పేరు దగ్గర నుంచి జుట్టు కోసల వరకు అన్ని నచ్చితేనే పెళ్ళి చేసుకుంటాను .. మీలా జీతాలకు కకుర్తి పడి .. ఉద్యోగం చేసే అమ్మాయి ని కాకుండా .. చక్కగా పల్లెటూరి లోనే పుట్టి పెరిగి... బాగా చదువుకున్నా సరే ... భర్త పేరు పెట్టి పిలవాలంటేనే ముడుచుకు పోయే మల్లె మొగ్గ లాంటి పిల్లని పెళ్ళి చేసుకుంటాను . వీడికి లా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తున్నాను అని చెప్పా గానే ఉరిమి చూడటం కాదు కదా ..
ఏదో వంకతో నా చెవి దగ్గరకు వచ్చి .. ఎక్కువ తాగకండి .. అని చెప్పి నేను కసురుకుంటాను ఏమో అనే సందేహం తనకు కలిగి.. మళ్ళి వెంటనే మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నాను ... అని.. గోము గా మొఖం పెట్టి .. సాగనంపుతుంది. పొద్దునే లేచి తను తల స్నానం చేసి .. సాంబ్రాణి పొగ వేసుకొని .. ఇల్లంతా శుభ్రం చేసి వాకిట్లో చక్కగా ముగ్గులు పెట్టుకొని ... పూజా కార్యక్రమం ముగించుకొని ,పెద్ద బొట్టు తో , కళ్ళకు కాటుక తో .. ఒక చేతిలో కాఫీ కప్పు  తో ఇంకో చేతిలో పేపర్ తో వచ్చి నన్ను నిద్ర లేపి ... స్నానానికి అన్ని ఏర్పాట్లు చేసి .. నేను స్నానం ముగించి వచ్చే సరికి టిఫిన్ గట్రా వేడి వేడి గా వడ్డించి ... అది రా పెళ్ళైన జీవితం అంటే .. నాకు పెళ్లి అయితే అలా ఉంటుంది .. మీకు లా కాదు .."
"అబ్బో! అబ్బాయి గారికి చాల కోరికలు ఉన్నాయి ... ఐన వీడికి కావాల్సింది అమ్మాయి కాదు రా .. రోబో ..
వీడి దెబ్బకి తాగింది మొత్తం దిగిపోయింది రా బాబు..! చూస్తాం రా .. రేపు నీకు పెళ్ళి అయినప్పుడు .. చూస్తాం "
అని ఊరుకున్నారు ..

  బాబోయి ఇప్పుడు సుబ్బి నన్ను అభి అని పిలిచింది అని చెప్తే ఇంకేమన్నా వుందా అని అనుకోని ఆఫీసు పని లో పడ్డాడు!

      "అమ్మాయి ! నీ బస్సు.. 8 ఇంటికి కదా.. అప్పుడే వచేసారు?.. రండి అన్నయ్య గారు!" అని వాళ్ళమ్మ వచ్చిన వాళ్ళని పలకరించటం తో మెలకువ వచ్చి హాల్లో కి వచ్చి చూసాడు.. అభి.  "ఎం అల్లుడు గారు ఎలా ఉన్నారు ?"
మావ గారి పలకరింపు .. ఆయన కాసేపు మాట్లాడి వాళ్ళ ఊరు తిరుగు ప్రయాణం కట్టారు ! ఆయనను బస్సు స్టాండ్ లో దించి అభి ఆఫీసు కి వెళ్ళిపోయాడు.. సుబ్బి తో మాటాడే అవకాశమే .. దొరకలేదు!
         ఇంటికి తిరిగి వచ్చేసరికి సుబ్బి తల నిండా మల్లె పూలు పెట్టుకొని, గుమ్మం ముందు కూర్చొని ఎదురు చూస్తోంది!. సుబ్బీ ! అంటూ అభి స్లో  మోషన్ లో పరిగేతుకుంటూ వెళ్ళే సరికి అతని కాలికి గుమ్మం తగిలిన్ది.. అబ్బా!అనుకుంటూ లేచి చూస్తే ఆఫీసు లో ఉన్నాడు ... హార్ని కలా ? అనుకొని. వెంటనే ఇంటికి బయలుదేరాడు ..

   ఎక్కడా .. సుబ్బి జాడ లేదు .. ఎంత సేపు వాళ్ళమ్మ కి అనుమానం రాకుండా వెతికాడో తన గురించి .. ఇంకా ఉండ బట్టలేక అడిగేసాడు .." అమ్మా! తను ఏది ?" అని  "సుబ్బి కి బ్యాంకు PO  టెస్ట్ అయ్యింది కదా! ఈ  రోజు ఇంటర్వ్యూ ఉంటేను వెళ్ళింది ! "  సుబ్బి ఇంటర్వ్యూ కి వెళ్ళిందా ? అంటే తను ఉద్యోగం చేస్తుందా ? చేస్తే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ముందు ఎలా అనుకో సాగాడు అభి .. ఈ లోపలే తెలివి తెచ్చుకొని "అదేంటమ్మా .. ఒక్క దానినే పంపించావా?పొద్దునే చెప్పుంటే నేనే దింపే వాడిని కదా!" అని పైకి అని ఏదో ఒక నాటకం ఆడి .. అది ఇంటర్వ్యూ కి వెళ్ళ కుండా చేసే వాడిని అని మనసులో అనుకున్నాడు!  " లేదు రా చెల్లి తీసుకెళ్ళింది స్కూటీ మీద!"
"దాని మొహం దానికే సరిగ్గా రాదు ఇంకా నువ్వు సుబ్బి ని దానికిచ్చి పంపించావా?".. "ఏంటి రా పెళ్ళాం మీద ప్రేమ పొంగిపోతున్నట్టు ఉంది ?.. ఐన సుబ్బే డ్రైవింగ్ .. చెల్లి దారి చెప్తుంది అంతే!" అంటే అంటే అంటే సుబ్బికి బండి నడపటం కూడా వచ్చా! ఖర్మ కాకపోతే ఇంకా బండి మీద నేను తీసుకెళ్ళే అప్పుడు ఏమండీ .. కాస్త నెమ్మది గా  వెళ్లండి ప్లీజ్ అని ఎందుకు బ్రతిమాలుతుంది .. ఈ సరదా కూడా గంగ పాలె..

           సాయంత్రం ఏడింటికి వచ్చారు సుబ్బి, చెల్లి .. ఇద్దరూ .. మంచి స్నేహితులు అయ్యిపోయినట్టు వున్నారు ఒకటే నవ్వులలో మునిగి పోయి వచ్చారు! అభిని చూడ గానే సుబ్బి ఒక్క గెంతు గెంతి "అభి! మీకో సంగతి తెలుసా నాకు జాబు confirm అయ్యింది ... వచ్చే నెలలో joining  అని స్వీట్ బాక్స్ లో స్వీట్ నోట్లు కుక్కి అభి రియాక్షన్ కోసం చూడకుండా ... వంటింట్లోకి పరిగెత్తి ... అత్త గారికి ఒక స్వీట్ తినిపించి, భోజనాలు అయ్యే వరకు అత్త, కోడలు ,
మరదలు ఏవో కబుర్లు చెప్పుకున్నారు!మామగారు, భర్త గారు మాత్రం మాములుగా తిని లేచారు. ఈ
ఆడ వాళ్ళు ఇంతే కాబోలు .. అనుకున్నాడు అభి ఐన చెల్లి, అమ్మ తనతో ఎందుకు అంత చనువుగా వుంటున్నారు ఏదో తు తు మాటలాడితే  కదా తను నాకు దగ్గరయ్యేది ..ఛ ఛ .. వీళ్ళకి అది కూడా తెలియదు అనుకున్నాడు. సుబ్బి గదిలోకి వచ్చినప్పుడు కనీ గమనించలేదు .. తన వాలు జడ .... ఎదీ లేదే .. "సుబ్బి ! నీ జడ ఏమయ్యింది రా ? " " నా  జడ ఎప్పుడూ ఇంతే అండి .. పెళ్ళి కదా అందరూ  గొడవ చేస్తే, సవరం  వేసుకున్నా! నాకు పెద్ద జడ ఇష్టం ఉండదు!" అని అంది... చాలు బాబోయీ ఇన్ని మరీ ఇన్ని ఎదురు దెబ్బలా .. పై వాడికి నా మీద అస్సల కనికరం లేదు!
        
    అభి పొద్దున్నే లేచి, కళ్ళు తెరిచే సరికి.. ఇళ్లంతా ఒకటే పొగ ... తన కలల రాకుమారి సుబ్బి .. గారి మహత్యం అని ఆనందం గా .. ఆ పొగ తో కూడిన గాలి పీల్చి ఏదో తేడా గా ఉందే అని, విషయం అర్ధం అయ్యి వంటింట్లోకి వెళ్ళి చూస్తే,
పొయ్యి మీద నుంచి ఒకటే పొగ.. పక్కనే సుబ్బి దగ్గుతూ .. ఏదో యుద్దానికి వెళ్ళే యోధురాలి లా గ్లోవ్స్ వెసుకొని.. రెండు చేతులతో .. రెండు గరిటలు పట్టుకుంది .. అభి ని చూసి "అభి.. మీ అమ్మ గారు లేరు మీ కోసం టిఫిన్ చేద్దాం అంటే ఇదిగో .. చూడండి ... " అంటూ బిక్క మొహం వేసింది ... అభి కి గుండె ఆగిపోయినంత పని అయ్యింది అంటే నా రాకుమారికి వంట చెయ్యటం రాదా ఇంకా వంటే రాదు అంటే ముగ్గులు ,పూజలు గోవిందా గోవిందా!? అని తన బిక్క మొహం చూసి ఆగ లేక తనే టిఫిన్ .. చేశాడు ..  కరెక్ట్  గా తను వంట పూర్తి అయ్యే సరికి రవి వచ్చాడు ..  ఇంక అభి కి ఇల్లు వాకిలి వదిలి వెను తిరగకుండా పరిగెత్తి పారిపోవాలి  అనిపించింది.

  పాపం అంత కన్నా షాకింగ్ విషయం ఏంటి అంటే ...  "అన్నయ్యా ! ఎప్పుడు వచ్చావు అమెరికా నుంచి ..  నాలుగు, నెలల దాకా రావు అంది ఒదిన మొన్న పెళ్ళికి రాలేదేమని అడిగితే! అభి .. ఈయన మా అన్నయ్య.. కొంచెం దూరం  చుట్టల్లె ... ఆ మధ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని .. మా పెద్దమ్మ ఇప్పటి వరకు ఇంటికే రానియ్యలేదు .. పాపం ! మర్చిపోయా అన్నట్టు మీ సంబంధం నాన్నకు చెప్పిందే అన్నయ్య . చెప్పి అమెరికా వెళ్ళిపోయాడు !"

  భగవంతుడు నా మీద కక్ష కట్టాడు అనుకున్న, కక్ష కట్టింది భగవంతుడు.. కాదు రవి గా ఎంత పని చేసావు రా .. తాగి వాగినందుకు ... అన్ని విధాలా నేను కుమిలి పోయేలా చెయ్యాలి అని ఇలా చేసావా అని.. అనుకుంటూ వుండగా .. రవి , అభి వైపు  చూసి కన్ను కొట్టి  "ఈ పరిచయాలు అనవసరం సుబ్బి .... మీ అయన నా బెస్ట్ ఫ్రెండ్!"
అని చెప్పాడు! రవి, అభి నెక్స్ట్ సిట్టింగ్ లో ఒక్కళ్ళని ఒక్కళ్ళు చితక బాదేసుకోవాలి అని రగిలిపోతూ ..

P.S : "సుబ్బి .. నువ్వు పేరు మార్చుకోవచ్చు కదా!.."
"ఎం .. ఈ పెరుకేం ?"
"కొంచెం పాత పేరు కదా ...? అందరూ  ఎక్కిరిస్తారు కదా!"
"మనిషి విలువ పేరు లో ఉండదండి ... మనకు ఏ పేరు ఉన్న .. అది అందరూ ... గుర్తు పెట్టుకునే అంత మంచి పనులు చెయ్యాలి , పిచ్చి  పిచ్చి ఆలోచనలు మాని పడుకోండి !"
ఇంకేం మాట్లాడతాడు , ఎం  మాట్లాడ గలడు ? ఇంత తెలివి తేటలు ఉంటే భార్యకు .. ఆఫీసు లో బాస్ మాట ఇంట్లో భార్య మాట .. వినక తప్పదు ... నా జీవితం ఇంతే అని నిట్టూర్చాడు
 

Saturday, May 04, 2013

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా !!

             తొలకరి వాన జల్లు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? నాకు కూడా తొలకరి వాన జల్లు అంటే చాలా ఇష్టం! ఎంత ఇష్టం అంటే నా ప్రతి జీవ నాడి  లోనూ , చిరు జల్లు కి  తడచిన మట్టి సువాసన నిండి పోయి, నా ప్రాణాన్ని మైమరపిస్తుంది. హాయి గా ఆ వానలో తడుస్తూ  నా వగల గుబులంత తీర్చుకుంటుంటే ఆ అనుభవం మాటల్లో చెప్ప గలిగేది కాదు. దివి నుంచి కిందకు రాలి పడే దీవెనల లా అణువణుని  తడిమే ప్రతి చినుకు తో తడిసి ముద్దవుతూ, స్వర్గం అంటే ఇదేనేమో అని ఆనందిస్తున్న నాకు , వాన ఆగిపోవటమే విషాదమేమో అనుకుంటే నా గొం తు నులిమేస్తూ నన్ను లాక్కెళ్ళారు. ఊపిరి ఆడకుండ నాలాంటి వాళ్ళు ఎంతో మంది వున్నా చోట బందించేసారు! ఎలా ఈ చేరసాల నుంచి తప్పించుకోవటం?ఎటూ దారి తోచదే ! అమ్మ నన్ను లాక్కేళ్ళుతున్న  వాళ్ళని దీనం గా చూడగాలిగిందే తప్ప ఏమి అనలేదు.

        అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటే, నాకు తను చెప్పిన మాటలే గుర్తొచ్చాయి,
" ఏదో ఒక సమయం లో  నిన్ను నా నుంచి వేరు చేస్తారు బంగారు, అప్పుడు నువ్వు చాలా ధైర్యం గా ఉండాలి , భయపడ కూడదు , ఏడవ  కూడదు సరేనా?"
 "అమ్మ.. నేను నిన్ను వదిలి వెళ్ళాను అమ్మ! నన్ను పంపించకమ్మ!"
"నాకు నిన్ను పంపటం ఇష్టం లేదు తల్లి కనీ నువ్వు వెళ్ళే రోజు నేను ఎంత బాధ పడతానో నీకు తెలియదు, నా బిడ్డలని ఇలా దూరం చేసుకుంటూ ఉంటే నాకు ఆనందమా? చెప్పు?!"

అమ్మని  తలచుకుంటూ ఉన్న నాకు పెద్దగా అరవాలనిపించింది," నన్ను వదిలిపెట్టండి..!!" అని... నేను మీకేం అన్యాయం చేశాను అని  ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు? పగలే చీకటిని తలపించే ఈ ప్రదేశం లో నేను ఉండలేను ... నన్ను నన్నుగా  కాక ఒక విలస వస్తువుగా  చూస్తున్న మీ దగ్గర నేను ఉండలేను అంత కన్నా చావు మేలు ! అని వీళ్ళందరికీ  చెప్పాలి అని ఉంది. నా బాష వీళ్ళకి తెలుసో లేదో! నా బాధ వీరికి అర్ధం అవ్వుతుందో లేదో! నా ఘోష  ఆ చెవులను తాకుతుందో లేదో!

   వర్షం చినుకులు చెట్ల ఆకుల నుంచి ఒక్కోటే కింద పడుతుంటే,అమ్మ ఏడుస్తున్నట్టు అనిపించింది తనని ఒక సారి నేను అడిగిన ప్రశ్న గుర్తుకు  వచ్చింది .
"జీవితం అంటే ఏంటి అమ్మ?"
"ఆనందం గా ఉండటం !"
 "అంటే ఆనందం గా లేనప్పుడు జీవిస్తున్నట్టు కాదా?"
"ఏమో నే నాకే తెలియని ప్రశ్నలు  వేస్తావు నువ్వు !"
అని అమ్మ మాట దాట  వేసింది ...

ఎందుకో తెలియదు కాని ఇక్కడ ఇలా బందించి ఉన్న  ఈ సమయం లో అమ్మ చెప్పిందే నిజం అనిపిస్తోంది ఇది నా జీవితం లా అనిపించటం లేదు. నన్ను బందించి కళ్యాణ రాముని కౌగిట్లో చేర్చెందుకో  లేదా భార్గవ రాముని  పాదాల చెంత కో కాదు ఎవరో అనామకుడి పొందుకు.  సీతమ్మ సిగ లోనికో, రుక్మిణి పూజ కో కాదు ఊరు పేరు
తెలియని అనమకురాలి అలంకారానికి! ఐన దేవుడి చెంతకు అయితే మాత్రం నేను ఎందుకు సంతోషించాలి,
నా జీవితం పూర్తి కాకుండా నన్ను లక్కోచి పడేస్తే నేను ఆనందించాలా? మా  భగవంతుడు మాకూ ఉన్నాడు, మీ దేవుడికి నన్ను మీ స్వార్ధం కోసం అర్పించి నా జన్మ ధన్యం అయ్యింది అని మీరే సెలవు ఇచ్చేస్తారా? ఎంత అహంకారం? పోనీ నేను అందంగా ఉన్నాను అని మీరు  ఇలా చేస్తున్నా,ఎంత దురాశ?నాలుగు రోజుల పాటు అందంగా  చెట్టుకే ఉండనివ్వచు గా..  లేదు అందం గా కనిపించింది సొంతం
చేసుకోవాలనే ఆశ  ఆ ఆశ లో మా జీవితాల్ని గంటల వ్యవధి లో నాశనం చేసేస్తారు. నా జీవితం నా
నుంచి లాగేస్తే నీ కడుపు నిండుతుందా ? నీ  ఆకలి తీరుతుందా? దాహం తీరుతుందా? నీ అత్యాశ కూడా నిండదు
మరి నా జీవితాన్ని ఎందుకు ముక్కలు చేస్తున్నావు?  చెట్టుకే ఉంచి ఆరదిన్చాలేవా? అందుకొనే ఆరాటం లో మా జీవితాలని అర్ధంతరం గా ముగించేస్తావ?


P.S. : పువ్వులు  బాధ పడతాయేమో అని అనిపించి రాసిన ఒక చిన్న వ్యాసమే తప్ప, NO OFFENSE  INTENDED. PURELY MY OPINION.




 

Sunday, April 14, 2013

Books and Mind Keeping


After having such a title, I just want to let you know that I just picked this word ‘Mind Keeping’ to give a fancy name to my write up here. And this is all about books , books and more books

 Suggest me some good books dear friends…  (wait !I am not asking you to suggest here.. but you can post names of any interesting books in the comments section though)

This was my Facebook status few months ago.. Many people suggested me few books…  but one particular reply nailed me to think of something else…

“You fool! Why do you want to read a book? Just read life!”

And another reply supporting that comment is “Yes! He is absolutely right!!”

So I thought, book reading is always considered a good Hobby… And If I am bored or want to do something.. I can just open a book and read it.. but how am I supposed to read life at my leisure..?

I asked them so, I got a reply “Reading in itself is a boring process, so when you are bored, you read a book that will make you still bored” this is a casual comment.. But set me up for thinking..

Is reading really such a boring thing? The answer for me is a big NO… I would come to this point later.. and I have another message.. rather than a comment on my status.. That again nailed me… and made me wonder.. is this kind of thinking  good..

“Why do you want to show off yourself that you read books?”

I actually didn’t understand it..

“What?” is my answer..

Asking someone to suggest a book on FB is a show off thing? I was thinking.. Putting up your most handsome pics up there is not a show off… but asking someone to suggest a book for reading is a show off..  wow.. Awesome!!!!

“It is not show off.. if it so.. no one would reply my request”

“They are trying to show off too… This is all self-marketing”

Good .. logical.. and neat.. Let us consider this person is very true.. but is it bad showing off that you read books? Or will it have any bad influence on anyone who gets my updates?

Is it as bad as spreading hate messages? Is it as bad as bullying someone on FB or is it as bad as killing someone else’s interest in doing something just by telling them that it is a show off? I don’t know..

So leaving my personal experiences there..

I would want to discuss why books are important.. as anything has good and bad in itself.. books also has good and bad in it.. but the overall good done by books cannot be dominated by its teensy bad influences.

First thing we do after we get up , if we don’t have books or any medium of recording our experiences, is to grab a pair of stones.. and hit them against each other in order to generate fire.. Maybe not that too.. we will be doing something even primitive. We stand on the shoulders of our ancestors no matter how good we are at technology, today.  Sure, your life teaches you some lessons.. But you cannot learn that all by yourself and from your own life. You learn from your surroundings,from your friends and their lives and from every one… For some the thirst and search for things and experiences ends with their own.. for some they seek new knowledge every day. How do you get that from? Books obviously, the recordings of others experiences, thoughts.Every medium of entertainment.. every means of communication has to be written… to pass your experience to others. To pass your feelings to others.. Barring vocal communication..

You dance for a super song right? The notes of that song.. notes related to every single instrument is jotted down first and recorded from that.

You listen to a vocal artist .. he or she should write down the lyrics first.

Watching a movie?  The script has to written first.

So there is no shame in reading books, no shame in loving them, no shame in writing books..

All the shame related to books is in our hearts… why are we so content in being ignorant? Ignorance is a bliss, only in few chosen circumstances…

Why are we so obsessed with being extremely normal…  we draw a narrow lane, that will just fit us in…and want to raise in that lane… how far can you grow.. when your close the lid of a jar in which you kept your thoughts so tightly ?
P.S: No offense intended!

Wednesday, April 03, 2013

10 AM, Hitech City Station

 అసలు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలా? అని ఆలోచిస్తున్నాను అండి! నేక్లేస్స్ రోడ్ స్టేషన్నుంచి నేను బయలుదేరిన దగ్గర నుంచా? లేదంటే Hitech  సిటీ స్టేషన్లో దిగిన దగ్గర నుంచా?అసలు ఈ introductions అంటేనే మహా చెడ్డ చిరాకు అండీ బాబు!మనం రాయవలసిన దానిని క్లుప్తంగా చెప్పాలంట! కాస్త ఎక్కువ చెప్దాం అంటే మొత్తం ఇక్కడే చెప్పేసావ్ ఇంకా లోపల ఏమి చెప్పుంటావు అంట?అని  ఎక్కడ  మిగతాది  చదవకుండా   వెళ్ళి పోతారో అని భయం. పోనీ, తక్కువ చెప్దాం అంటే ముందు ఏముందో చెదవాలన్న ఆసక్తి రాదాయే! అంత
రానప్పుడు  రాయటం ఎందుకు?ఇలా మాకు దేని గురించి చెప్తున్నవో దాని గురించి చెప్పకుండా ఈ సోది ఎందుకు?
అని మీరు కసురుకునే లోపలే చెప్పేస్తున్నా...


పొద్దునే లేచి... MMTS ( లోకల్ ట్రైన్ ) ఎక్కితే ఎలాంటి అనుభవం ఎదురువ్వుతుంది  అనేది మన ప్రస్తుత విషయం



 ట్రైన్ వచ్చి platform మీద ఆగింది చూసి పరుగేతుకుంటూ స్టేషన్ లోపలి వెళ్ళి ఒక టికెట్ కొన్నాను. ఎక్కడ  రైలు కదిలిపోతుందో,అని చిల్లర కూడా పూర్తిగా తీసుకోకుండా... రైలు ఎక్కేసాను!(అప్పుడే  కదలటం  మొదలు
 పెట్టిన  రైలు) చాలా గొప్పగా నాకు చేతనైనంత లో సామాజిక భాద్యతను తీసుకుంటాను అని పైకి అనక  పోయినా ,మనసులో అనుకునే నేను,పొద్దునే చేసిన భాద్యతా రాహిత్యమైన పని, కదులుతున్న రైలుని ఎక్కటం!పోనీలే బ్రతికే ఉన్నావు కదా,ఎందుకు ఈ సొప అని అంటారా?కానీయండి  ఇలా ఎన్ని తప్పులకు రాజీపడి, సమర్ధించుకుని  బ్రతికేయటం లేదు! ఎక్కిన తరువాత సీట్ లో కూర్చున్నా, అందరూ అంటే అందరూ, head set పెట్టుకొని పాటలు వింటున్నారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్ప! వాళ్ళు, వాళ్ళలో వాళ్ళే ఏదో మాట్లాడుకుంటున్నారు. చిన్నప్పుడు పరాయి వాళ్ళ తో మాట్లడద్దు అని అమ్మ చెప్పిన విషయాలు అందరూ ఎంతో చక్కగా పాటిస్తున్నారు!అనిపించింది. నాకు ఇంకో అనుమానం కూడా వచ్చింది. నాకు  ఏమీ  తోచక  ఎవరినన్నా  పలకరించినా  నా  వైపు  అనుమానం గా చూసి జవాబు చెప్పరు అని.ఇంక  చేసేది ఏమి లేక నేనూ నా హెడ్ సెట్ తీసా కనీసం ఇళయరాజా గారి వాద్యాలలో బాలు గారు పలకరిస్తుంటే పులకరిద్దాం అని.ఈ లోగ భారత్ నగర్ స్టేషన్ లో ఇద్దరు ఎక్కారు. బహుశా  HITECH CITY స్టేషన్ కే అనుకుంట!నా  హెడ్ ఫోన్స్ లోంచి కూడా నాకు వాళ్ళ సంభాషణ వినిపించింది .. అబ్బా అలా అనుమానంగా చూడకండి! నిజంగానే వినిపించింది అండి .. నేను కావలి అని వినలేదు!
"మా చిన్ను గాడికి నేను రోజు ప్యాక్ చేసే పంపుతా అక్కడ వాళ్ళు food provide చేసినా కానీ, నాకెందుకో నేను
పంపిందే  తింటాడు అనిపిస్తుంది. అందుకే .."
"అవును  సరిత, ఏదో మనకు కుదరక కాని మన లా వాళ్ళు చూసుకోగలరా? చెప్పు"
"వాడిని వదిలి పెట్టి రావాలంటే రొజు.. నా గుండె భారం గా ఉంటుంది ...At the same time
 I don't want to take a break in career"
"That  is okay yaar ... you will out grow this .. baby is not missing you right !"

సరిగ్గా ఇక్కడే నాకు ఆసక్తికరం గా అనిపించి నా సాంగ్ pause చేశా! అబ్బా... దయ చేసి అలా ఉరిమి చూడకండి..
ఎంతో మందికి ఉండే సమస్య వీళ్ళు ఏం సారంశంకి వస్తారో అని చిన్నకుతూహలం అంతే!(దీనినే సమర్దినచుకోవటం
అంటారు లే అంటారా ? సరే కానివ్వండి )

"వాడు ఈ మధ్యన నడవటం మొదలు పెట్టాడు తెలుసా,చిన్ని చిన్ని అడుగులు వేస్తున్నాడు, గోడ పట్టుకొని ఎంత
happy గా  ఉంటుందో వాడిని అలా చూస్తుంటే, అదే నేను ఇంట్లో వుంటే వాడి ఫస్ట్ స్టెప్ చూసే దానిని
కదా అనిపిస్తుంది "
"సరితా .. You are inflicting this on yourself ! ఏమో నువ్వు ఇంట్లో
ఉన్నా చూడలేక పోయే  దానివి  ఏమో  కదా ! ఇట్ feels  good  ఈఫ్ యు ఆర్ there  బట్ its alright !"
"లేదు  ప్రియా ! బాబు  పుట్టక  ముందు  వరకు కెరీర్ చాలా ఇంపార్టెంట్ అనిపించేది , కానీ ఇప్పుడు వాడి నవ్వు
ముందు అన్నీ చిన్నవి గానే కనిపిస్తున్నాయి చివరికి రజత్ కూడా "
"You are contradicting yourself .. డెసిషన్ ఇస్ సో సింపుల్ .. ఈఫ్ యు లవ్ యువర్ సన్ సో much థెన్ లీవ్
ది జాబ్ న !"
"అదే కదా నా ప్రాబ్లెమ్ , ఐ వాంట్ మై కెరీర్  టూ .. లెట్ మీ  సీ  ఫర్ a  while... అండ్ ఈఫ్ కెరీర్ comes ఇన్
between మీ  అండ్ మై సన్ , ఐ విల్ చూసే మై సన్  అండ్ మై సన్ ఇస్ everything for me!

ఆ తరువాత చాల సేపు వాళ్ళు మాట్లాడేది విని తల్లి మనసు ఎంత గొప్పది అని.. ఒక నలుగు, ఐదు మదర్
సెంటిమెంట్ పాటలు గుర్తు తెచ్చుకొని యమ సంబరపడ్డాను.

              నా సంతోషం సంగతి మీకు తెలిసిందగా  ఎక్కువ కాలం నిలవదు ! HITECH CITY స్టేషన్ వచ్చింది ..
ఎక్కువ సేపు ఆగదు బండి  అందరికి దిగాలనే తొందరే! ఒక ముసలాయన .. నడవలేకున్నారు .. కర్ర సాయం
తో నెమ్మది గా దిగుతున్నారు .. ఆయనని నెట్టుకుంటూ వెళ్ళిపోయారు మన మోడరన్ మహా లక్ష్మి లు ... పైగా
లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎందుకు ఎక్కుతారో అని గొణుక్కుంటూ ...

        నేను ఆ స్టేషన్ ప్లాట్ఫారం మీద నుంచొని చూస్తూనే ఉండి పోయా ... పరుగులు పెడుతున్న జనాలని ...
కొడుకంటే ఎంత ప్రేమ ... మరి సాటి మనిషంటే కనీస కనికరం కూడా లేదా ? మరి అలాంటప్పుడు ఆ తల్లిది ప్రేమ
కాదేమో అనిపించింది .... స్వార్ధం! ... కాక మరేమిటి ? ప్రేమ అంటే పరిపూర్ణత ఉంటుంది .. కరుణ ఉంటుంది .... ఆ
ముసలాయన ప్రాణం కంటే మనకు ఆఫీసు కి చేరటమే ముఖ్యం ...మూల్యం గా .. అయన ప్రాణాలని చెల్లించి ఐన..
మన గమ్య స్థానం  చేరిపోవాలి !ఒక్క నిముషం ఆగి చూస్తే అందరు పరుగెడుతూనే  ఉన్నారు. అంత యాంత్రికంగా
బ్రతకటం ... అదే  బ్రతుకు  అనుకోటం ... ఈ పరుగు లో జీవిస్తున్నామో .. జీవితాన్ని నేట్టేస్తున్నమో తెలియకుండా ..
తాయారు అయ్యాం ఏమో అనిపించింది .

  చిన్నప్పటి నుంచి అమ్మ మీద పాటలు విన్నప్పుడల్లా ... మన అమ్మలు అందరూ మంచి వాళ్ళే మరి మనం
ఎందుకు ఇలా ఉన్నాం అనిపించేది ... ఈ సంఘటన తరువాత నాకు ఒక విషయం బోధ పడింది ... అమ్మ  మనకు
మాత్రమె మంచిగా వుంటే అమ్మ అనిపించుకొదు.. అమ్మ తనం  అంటే  పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే అబ్బే తత్త్వం
కాదు ... సాటి మనుషులని కూడా కరుణ  తో  చూడ గలిగినప్పుడే అమ్మ పరిపూర్ణం అవ్వుతుంది అని.. అలాంటి
అమ్మలు కాని  అమ్మలు ఒట్టి బొమ్మలే అని

P.S : NO  OFFENSE  INTENDED ...   THIS  IS  PURELY MY ANGUISH