Tuesday, December 06, 2011

Pradhamam sivam pramadham sivam

ఇది నా ఆత్మ కధ!

పైన ఏమో శివం అని అన్నావ్? ఇక్కడేమో ఆత్మ కధ అంటున్నావ్! ఏంటి కధ? అని మీకు అనిపించవచ్చు, కానీ ఇది  నా ఆత్మ కధే కాదు మన అందరి ఆత్మ కధ అని నా భావన.

   ఈశ్వరుడి మీద ఉన్న అపారమైన భక్తి తో, అభిమానం తో నేను ఈ వ్యాసం రాయటానికి పూనుకున్నాను. ఆది భిక్షువు వాడి మీద ఎందుకమ్మా అంత మక్కువ ? అదే శ్రిమన్నరయనుడిని పూజిస్తే ఆయన కటాక్షం లేకున్నా లక్ష్మీ కటాక్షం అన్న దక్కుతుంది అని మీరు అడుగవచ్చు. నిజానికి భోగ భాగ్యాలు , సిరి సంపదలు అంద చేసే  శ్రీహరి ని ఇష్టపడుతూ పెరిగిన దానినే నేను కూడా, కానీ రాను రాను ముక్కంటి పై మక్కువ పెరుగుతోంది ఎందుకో! బహుశా ఇది స్మశాన వైరాగ్యమో ఏమో నాకు అంతగా తెలియదు. శ్రిమన్నరయనుడి అంతరాత్మ ఈశ్వరుడే అనిపిస్తోంది, వారిద్దరినీ విడదీసి చూడలేము అనిపిస్తోంది. మీ అందరిని కలిపి చూడలేము అని అనటం నా అహంకారం ల అనిపిస్తే మన్నించండి, నా ఉద్దేశం లో నేను అయితే విడదీసి చూడలేకపోతున్నాను.

   ఈశ్వరుడు అంటే అంతర్యామి అంటారు, సర్వాంతర్యామి అంటారు. మన అందరిలో  ఉన్న వాడు ఈశ్వరుడే అయితే మన అందరి ఆత్మలు వెలిగే దీపాలు అనుకుంటే, కళ్ళు మూసుకొని ప్రపంచం లోని  ప్రనులంతా, కదిలే నడిచే దీపాలల ఊహించుకుంటే తర తమ భేదాలే కనిపించవు కదా అని అనిపిస్తుంది ఒక్కోసారి.అంతర్యామి , సర్వాంతర్యామి ఆయనే అయినప్పుడు ఇన్ని గొడవలు, గోలలు, తగువులు ఎందుకు? ఎందుకంటే నిండుగా వెలిగే దీపం చుట్టూ పురుగులు మూగి ఆ దీపపు కాంతి ఎక్కువ చోట్లకి ప్రసరించకుండా ఆపెసినట్టు , మనలోని మాలిన్యాలు అంటే అసూయా,ద్వేషం ,రోషం, కోపం, మన నిజాన్ని/సత్యాన్ని కప్పేస్తున్నాయి.

   నాకు అర్ధమైనంత వరకు ఏ మనిషి లో ఐన ఒక నిజం ఉంటుంది.మన లోని మాలిన్యాలు మనమే కడిగేసుకోవాలి అన్నా లేక వేరేవరన్న ప్రయత్నిచాలి అన్నా ఆ నిజాన్ని చేరుకోవాలి. నిజంగా నువ్వు చెప్పిందే నిజం అయితే ఇన్ని దారుణాలు జరగవు రోజు అని మీరు అడగచ్చు నన్ను , కానీ ఏ నేరస్థుడి లోనూ మనం నిజాన్ని చేరుకునే ప్రయత్నం చెయ్యము, మనకు తోచినంత లో వాళ్ళని తర్కించి పారేస్తాం.వాడి తత్వమే అంత అని తేల్చేస్తాం. ప్రతి మనిషిలో హృదయం వుండటం ఎంత సత్యమో ,అది స్పందించటం ఎంత సత్యమో , మనలో ఉన్న సత్యం కూడా అంతే సత్యం. మన లో ఉన్న నిజం ఏంటి అనేది మనం కనిపెట్టగలిగితే ఎప్పటికీ ప్రాపంచిక విషయాలకి బాధ పడము.అన్నీ విజయాలే కనిపిస్తాయి.

    "సదా శివ సన్యాసి" పాట రచయిత ఏ దృష్టిలో రాసారో నాకు తెలియదు కానీ నాకు ఎలా అర్ధం అయ్యిందో చెప్పాలి అని ఉంది.

"సూపుల సుక్కాని దారి గా, సుక్కల తివాసి మీదు గా సుడ సక్కని సామి దిగినాడు రా ఎసేయ్యి రా ఊరు వాడ దండోరా!"

మనిషి పుట్టే అప్పుడు ఎక్కడో కొత్త లోకం నుంచి  వస్తూ, తన కోసం ఇక్కడ ఎదురు చూసే చూపుల చుక్కాని మీదు గా , అమ్మ చల్లని కడుపుని తన చుక్కల తివాచి చేసుకొని, చూడ చక్కని దేవుడి లాగ వస్తాడు.
"ఏ రంగుల హంగుల పొడ లేదు రా ఈడు దిగమ శంకర శివుడెను రా, నిప్పు గొంతులో నిలపు మచ్చ సాచ్చి గా నీ తాపం శాపం తీర్చే వాడే రా"

పుట్టినప్పుడు ఏ పాపాలు ఎరుగము, ఈ ద్వేషాలు ఎరుగం, నిజం గొంతులోనే ఉంటుంది ఆ నిజం సాక్షి గా ( ఆ నిజాన్ని గుర్తిస్తే) అందరి బాధలు తీరిపోతాయి

"లోకాలనేలేతోడు నీకు సాయం కాకాపోడు"

ప్రపంచం మొత్తం నిండిన దేవుడు, వెతికితే నీలో నీకు కనిపించాడంటావా?

"నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడు"

నీలోనే ఉన్న వాడు నీకు సాయం చెయ్యకుండా ఉండగలడా?

"ఎక్కడ వీడుంటే నిండుగా"( మన లో మనం గుర్తిస్తే)  "అక్కడ నెలంత పండగ"( బాధ పాడటానికి బాధలు బాధల్లా అనిపించవు)

"చుట్టు పక్కల చీకటి పెళ్లగించగా"(మన తో పాటు చూట్టూ ఉన్న చీకటిని తొలగిస్తూ ) "అడుగేసదంట కాచే దొర లాగా"( మనమే ఈశ్వర స్వరూపాలై కదులుతము).

"మంచుని మంటని ఒక్క తీరు గా లెక్క సేయ్యనే సేయ్యని శంకరయ్య గా "( మన లోని తప్పుల్ని మనలోని ఒప్పుల్ని ఒకే లాగా చూడము, ఎందుకంటే  మనకు ఈశ్వర తత్త్వం అర్ధం అయితే తప్పులే చెయ్యము ,ఒక వేల చేసినా సరిదిద్దుకోవాలని చూస్తామే తప్ప, సమర్దిన్చుకోటానికి ప్రయత్నించం)

"ఉక్కు కంచ గా ఊపిరి నిలిపాడు రా మనకండా దండ వీడే నికరం గా "
( మంచి ని చెడు ని కలవనివ్వకుండా మన ఊపిరి ఉన్నంత వరకు దానినే కంచే గా చేసి మనకు మనమే అండగా ఉండాలి)


ఇదంతా ఏదో పెద్ద  కలలా అనిపిస్తుంది నాకు, ఇది రాసింది నేనేనా?
 అని కూడా అనిపిస్తోంది.


గీతాంజలి లో రవీంద్రుడు కోరుకున్న విధంగానే , నా ఈ వ్యసం లో నేను ప్రార్ధించాలి అని అనుకుంటున్నాను
( ఆయనతో పోల్చినందుకు నన్ను క్షమించండి)

ఆది నువ్వే, అంతం నువ్వే ఓ ఈశ్వర!

మధ్యన నడిపించేది , మనమున కొలువైనది నువ్వే దేవ దేవ!

బాధలతో , దుఖం తో నిండిన నీ మరో రూపాన్ని ( ప్రపంచాన్ని) , నిత్య చిద్విలాస స్థితి లోనికి నడిపించు ఓ లయ కారా!


P . S : Please ignore  any typo errors . Above essay is purely my personal opinion . No offenses intended !

--సరోజ.