Wednesday, November 24, 2010

Kalam Sneham

కలం స్నేహం...  చిన్నప్పటి నుంచి, అంటే బహుశా రెండో తరగతి చదువుతున్నప్పటి నుంచి అదో రకమైన  తెలియని ఇష్టం, ఉత్సాహం  నాకు, కాని ఎప్పుడూ నేను అలా ఉత్తరాలలో స్నేహం చేస్తా అని ఊహించలేదు. నాకు రెండవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు 'చేతన ప్రణతి' అనే స్నేహితురాలు ఉండేది. మేము ఇద్దరం కొట్టుకునే వాళ్ళం,నవ్వుకునే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం ఎప్పుడూ కలిసే ఉండే వాళ్ళం. ఆ వయసు లో మేము ఎందుకు అంత స్నేహం గా ఉన్నామో మాకే తెలియదు. అప్పట్లో మా నాన్న గారు అనంతపురం లో పని చేసే వారు, అనంతపురం నుంచి మా నాన్న నెల్లూరు కి బదిలీ అయ్యారు. అప్పటి దాక ఉన్న స్కూల్ ని మనుషుల్ని వదిలి వెళ్ళాలి అంటే నాకు ఏం బాధ అనిపించలేదు ఎందుకో తెలియదు కనీ చాలా హుషారు గా వెల్లిపోదాం అనే అనుకున్న, బహుశా కొత్త ప్రదేశాలని, కొత్త మనుషుల్ని చూడాలనో  మరి దేని కోసమో తెలియదు కనీ  నేను మాత్రం చాలా ఆనందం గా స్కూల్ లో అందరికి చెప్పేసాను మేము వెల్లిపోతున్నామోచ్ అని. చేతన కి మా నాన్న గారి కొత్త ఆఫీసు అడ్రస్ నాకు తెలిసినంత లో ఇచ్చాను అది ఎంత వరకు సరి ఐన చిరునామానో నాకు తెలియదు కనీ ఇచ్చి ఆనందం గా వెళ్ళిపోయ నెల్లూరు. అనుకోకుండా ఒక ఆరు నెలల తరువాత మా నాన్న నాకు ఒక ఉతరం తెచ్చి ఇచ్చారు అది తెరిచి చూద్దును కదా, ఆశ్చర్యం!  చేతన రాసిందా ఉతరం వాళ్ళ ఇంటి చిరునామా తో సహా నేను తను ఇచ్చిన అడ్రస్ పోగొట్టు కొని ఉంటానేమో అని పంపినట్టు ఉంది, ఎంత మంచి పిల్ల! అనుకున్న. తన చేతి రాత , చేతి రాత ని తెలుగు లో ఇంకా ఏదో అంతరండీ ఏంటో గుర్తు చెయ్యరూ...... ఏంటబ్బా అది ........ హా గుర్తొచింది  దస్తూరి తన దస్తూరి ఎంత అందం గా ఉండేదో చెప్పలేను ఒక printed  లెటర్ అంత అందం గా ఉండేది. తన మొదటి లెటర్ ని నేను చాలా రోజులు నా purse  లో పెట్టుకొని తిరిగే దాన్ని. తొమ్మిది సుదీర్ఘ సంవత్సరాల తరువాత అది నా valla   కాదు తల్లి నన్ను వదిలెయ్యి అని మొన్నిమధ్యన  చిరిగిపోయింది :-(   . నేను తను చాల కలం ఉతరాలు రాసుకునే వాళ్ళం, మూడు నెలలకి ఒక సరి సంక్షిప్త వార్తా స్రవంతి లాగా :-)  ఒక సారి నా ఇంటర్ అయ్యాక తిరుపతి లో అనుకోకుండా counselling హాల్ లో కనిపించింది, కనీ నేను గుర్తు పట్టలేదు తనని చిన్నారి చేతన చాలా మారిపోయింది చూడటానికి :-(  తనే నన్ను గుర్తు పట్టింది నేను అస్సల మారలేదు అని చెప్పింది. ఎంత చిత్రం తిరుపతి లో , counselling హాల్ లో తనని చూస్తా అని నేను అస్సల అనుకోలేదు ఎందుకంటే నాకు వచ్చిన ర్యాంకు చెప్పుకోటానికి సిగ్గేసి తనకి చెప్పలేదు కాబట్టి , తను అంతే అనుకుంట :-) , తను నాకు ఆ రోజు ఏదో chocolate   ఇచ్చింది  ఆ chocolate కవర్ ఇప్పటికి నా దగ్గర ఉంది అనుకోండి! ఏం చెప్తున్నా హా ఆ తరువాత నేను తను ఇంజనీరింగ్ లో కూడా ఉత్తరాలు  రాసుకునే వాళ్ళం, గ్రీటింగ్ కార్డ్స్ , నెమ్మది నెమ్మది గా బద్ధకం మొదలియ్యింది  ఇద్దరికీ , ఫోన్ లో మాట్లడుకోతం మొదలు పెట్టం, నేను ఉద్యోగం లో చేరాక మొన్నిమధ్యనే తన ఫోన్ నెంబర్ పోగొట్టుకున్న అంత నా దోషమే, తన తో మాట్లడలేకపోతున్నందుకు బాధ పడుతున్నా, కనీ ఈ పోస్ట్ తో పాటు తనకు ఉత్తరం కూడా రాయాలి అని నిర్ణయించుకున్న. నేను ఎంత వరకు తన విషయం లో మంచి దాన్నో నాకు తెలియదు కాని చేతూ మాత్రం ప్రతి slam  బుక్ లో ఆటోగ్రాఫ్ బుక్ లో నేనే తన బెస్ట్ ఫ్రెండ్ అని రాస్తుంది, సో స్వీట్ అఫ్ హర్ కదా !! తన లెటర్స్ అన్ని ఇప్పటికీ నా దగ్గర భద్రం గా ఉన్నాయి!

ఇదంతా నేను ఒక ఫ్రెండ్ కి చెప్తే తను నేను రైటింగ్ practise చెయ్యాలని నాకు మంచి narration స్కిల్ల్స్ ఉన్నాయి అని ప్రోత్సహించారు , తనకు మరియు చేతన కు [ పేరు లోనే ఉంది గా అచేతనం గా ఉన్న నన్ను కదిలించింది చేతన ప్రణతి ] ఈ పోస్ట్ ని అంకితం చేస్తూ...

-- సరోజ

Tuesday, November 23, 2010

snehithulani vadili vellipoye roju........

4 సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియదు కనీ, చివరి exam అయ్యిన రోజు మాత్రం, exam హాల్ బయట ఒకటే సందడి ఆటోగ్రాఫ్లు, ఫోన్ నెంబర్లు, భవిష్యతు నిర్ణయాల ప్రణాళికలు,మొత్తం వాతావరణం చాల కోలాహలం గా వుంది. సాయంత్రం ఆరు దాటినా ఎవ్వరు కదలరే... నాకు మాత్రం ఆ బెంగ లేదు నా నేస్తాలు అందరు నాతో పాటే హాస్టల్ లో ఉంటారు. అంచేత మేమందరం హాయి గా ఏ  దిగులు లేకుండా కాసేపు అందరితో ముచ్చటించి హాస్టల్ కి బయలుదేరం, వెళ్ళే దారి లో అనిపిస్తూ ఉంది నాకు లో లోపల, ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూసిన రోజు రానే వచ్చింది, కనీ ఆ సంతోషం లేదు ఏంటి నా మనసు లో అని..కాలేజీ  ఉన్నా అన్ని నాళ్ళు నేను కాలేజీ అవ్వాలి, ఉద్యోగం చెయ్యాలి, ఎప్పుడెప్పుడు అవవుతుందా అని ఎదురు చూసా , తీరా ఆ రోజు రాగానే బెంగ. హాస్టల్ కి వెళ్లి ఎవరి luggage వాళ్ళు సర్దుకున్నాం  రాత్రి అంత కబుర్లు చెప్పుకున్నాం రేపు తెల్లరక పోతే బాగుండు అనుకున్నాం, కానీ ఉదయించే భానుడిని,కదిలే కాలాన్ని ఆపటం మా కాంక్ష తరమా?.రెండు రోజులు హాస్టల్ లోనే ఉండి  బయలుదేరుదాం అని నిర్ణయించుకున్నాం. 4 సంవత్సరాలను తన లో కలిపేసుకున్న కాలానికి రెండు రోజులు ఒక లెక్కా? చటుక్కున మేము వెళ్ళాల్సిన రోజు వచ్చింది. శిరీష  నా రూమ్మేట్ , తన కారు వెళ్తుంటే.... ఎంత బాధ గా అనిపించిందో చెప్పలేను. నేను ఉన్నా అన్ని రోజుల లో తనని ఇష్టపడింది  లేదు అలాని తను అంటే ద్వేషము లేదు. నేను ,పద్మజ ,దివ్య,స్వాతి, నాగలక్ష్మి,రమ్య, మిగిలిపోయము. నాగలక్ష్మి, నా రూమ్మేట్ అన్న మాటే కనీ నాకు ఒంట్లో నలత గా వున్నప్పుడు, మనసు బాలేనప్పుడు నేను హాస్టల్ లో ఉన్నా అనే భావన రాకుండా చూసుకునేది. వాళ్ళ అమ్మ గారు వచ్చారు ,అన్ని సర్దుకొని తయారు అవ్వుతోంది. నేను , పద్మజ,దివ్య,స్వాతి,రమ్య ఖాళీ గా ఉన్నా మా హాస్టల్ గదులను చూస్తూ కూర్చున్నాం. ఆ రోజు కి  అందరు వెళ్ళిపోయారు.వెళ్ళటానికి మనసు రాక మేము  మాత్రం వుండిపోయం. వెళ్ళక తప్పదు, ఎం చెయ్యాలో తెలియదు... అందరం కూర్చున్నాం...ఎవ్వరికి కూడా వేరే వాళ్ళ మొహం లోకి చూసే ధైర్యం లేదు. దివ్య అమాంతం లేచి, bag తీసుకుని బయలుదేరింది, అది ఎం చేస్తుందో అర్ధం అయ్యి మేము దాని వెనకాల వెళ్ళే సరికి హాస్టల్ గేటు దాక వెళ్ళిపోయింది. నేను పద్మజ, స్వాతి ,రమ్య దాని వెనకాల వెళ్లి bag లాక్కుని, మేము వస్తాం అంత తొందర ఏంటే నీకు అంటే పని ఉంది.. వెళ్ళాలి ... అంటోది తల పైకి ఎతటం లేదు మా అందరికి అర్ధం అయ్యింది అక్కడే ఆ హాస్టల్ entrance మెట్ల మీద నే కూర్చొని ఎంత సేపు కన్నీళ్ళు పెట్టుకున్నామో మాకే తెలియదు. ఈ లోపల నాగ లక్ష్మి, వాళ్ళ అమ్మగారు వెళ్ళటానికి వచ్చారు. నేను నాగలక్ష్మి  పట్టుకొని ఎంత సేపు అలా ఉన్నామో తెలియదు, చాలా బాధ వేసింది. అది ఆరింద ల ఎప్పటి లాగే ఓదారుస్తోంది, మీ ఊరు మా ఊరు పక్కనే కదే ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని.దాని కారు వెళ్లిపోతుంటే చాలా బాధ వేసింది... ఆ నిముషమే నాకు తెలుసు.. మేము ఎప్పటికి స్నేహితులు గా మంచి స్నేహితులు గా ఉంటాం కనీ మా హాస్టల్ రోజుల్లో ఉన్నంత ఆనందం గా మాత్రం మళ్లీ ఎప్పటికి ఉండలేము అని. ఇంక మిగిలిన వాళ్ళు బయలుదేరాలి , ఎలా? ఇంత బాధ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళే అప్పుడు  పడాల్సిందే నా? అని ఆలోచించాము, ఆ రోజు ప్రపంచ చిరునవ్వుల దినోత్సవము, ఏదన్న మంచి సినిమా కి వెళ్లి అక్కడ నుంచి అందరం ఎవరి దారిన వాళ్ళు వెళ్తే బాగుంటుంది అని, అప్పుడు ఎవ్వరం ఏడవం అని అనుకోని బయలుదేరాము. ఎవ్వరం ఏడవం అని బయలుదేరం అని చెప్పా చూడు ఈ విషయం లో మేము పొరపాటు పడ్డం, మా కోసం బాధ పడే వ్యక్తి ఒక్కళ్ళు వున్నారు. ముఖ్యం గా నా కోసం పద్మజ కోసం, అదే సౌమ్య మా జూనియర్. మొదట్లో మా రజని వాళ్ళ చెల్లి కదా అని రాగ్గింగ్ కోసం పిలిచాను మా రూం కి, అంతే ఏ ముహూర్తాన పిలిచానో ఏమో అది నన్ను అతుక్కుపోయింది అక్క అక్క అంటూ మా రూం లోనే వుండేది. వాళ్ళ క్లాసు వాళ్ళ కంటే నా ఫ్రెండ్స్ నా classmates దగ్గరే చనువు ఎక్కువ దానికి. మేము వెళ్ళే అప్పటికి mess నుంచి వస్తోంది, చూసి ఒకటే ఏడుపు, కనీసం నాకు మా క్లాసు వాళ్ళతో వుండటం కూడా రాదు మీరంతా వెళ్ళిపోతే ఎలా అని నన్ను పట్టుకొని ఒకటే ఏడుపు , నాకు చాలా బాధ అనిపించింది చాల ఏడుపు వచ్చింది, కనీ పద్మజ చమత్కరించింది అప్పుడు " నీ కోసం అని మేము ఫెయిల్ అవ్వాలెం కదే " అని , ఇంకా కొంచెం నవ్వింది సౌమ్య. అందరం కలిసి ఆటో ఎక్కి వేల్లిపోయం సౌమ్య కి , హాస్టల్ కి , కాలేజీ కి , కాలేజీ దగ్గర ఉన్నా రోడ్ కి కాంటీన్ కి , చెట్ల కి మా క్లాసు రూం ల కి వీడ్కోలు చెప్తూ సినిమా కి వెళ్లి, అక్కడ నుంచి ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోయం. ఆ రోజు అనిపించినంత అందం గా మా హాస్టల్ గానీ, కాలేజీ కనీ నాకు ఎప్పుడు అనిపించలేదు.ఇప్పటికి ఆ రోజు ని తలచుకుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. తరువాత ఒక సరి కాలేజీ కి వెళ్ళాను కనీ.. పూర్తి గా మారిపోయింది, ఈ రోజుకి మేము కాలేజీ వదిలేసి ౩ సంవత్సరాలు ఇంచు మించు గా. నేను నా స్నేహితురాళ్ళు అందరం కలుస్తూనే వుంటాం అప్పుడప్పుడు.నాగలక్ష్మి కి పెళ్లి అయ్యి వైజాగ్ లో ఉంటోంది. పద్మజ, దివ్య హైదరాబాద్ లో వున్నారు. పద్మజ job చేస్తోంది, మర్చిపోయ ఇంకో వారం లో దివ్య బెంగుళూరు వస్తాను అంది నా దగ్గరకి. నేను బెంగుళూరు లో జాబ్ చేస్తున్న. స్వాతి వాళ్ళ ఊరి దగ్గర లోనే లెక్చరర్ గా చేస్తోంది, సౌమ్య వాళ్ళ  ఇంట్లో వుంది. ఆ రోజు మేము చూసిన సినిమా " బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్"

మర్చిపోలేని రోజులు అవి, నవ్వులు, కేరింతలు అన్ని ఉండేవి. చిత్రం ఏంటి అంటే బాధలు కూడా పంచుకునే వాళ్ళు వుండటం తో తేలికగా ఉండేవి. I Miss You  all  my friends !! This Post is dedicated to u  all .