Monday, June 20, 2011

స్వయంవరపు మందిరాన అడుగిడినప్పుడు నా వరుడు ఎవరు అని సంశయం కలదేమో సీత మదిలో
ఇతడా? అతడా? ఇతనే అతడా? అతడే ఇతడా? అనే ఆత్రుత కలదేమో కాంత హృదిలో

శివ ధనువుని ఎక్కుపెట్టి తన ఎద విల్లుని విరిచిన వీరుని మేడలో

వరమాల వేయకపోతే మాత్రం తెలియదా తన నాధుడు ఎవరో


--Saroja