రమ్య ఎంతో అలసిపోయినా ఎదో తెలియని ఉత్సాహం గా ఉంది తనకు. ఎప్పటి నుంచో తనకు హైదరాబాద్ వచ్చేయ్యాలని కోరిక , ఇప్పటికి తన కల తీరింది. ఇప్పుడిక మనీష్ తో పెళ్ళి గురించి సీరియస్ గా ఆలోచించ వచ్చు . కారు లో వెళ్తుంటే తన ఆలోచనలు రక రకాలుగా విహరిస్తున్నాయి. ఇంట్లో ఒప్పుకుంటారంటావా ? ఆహ్ ఒప్పించవచ్చు లే అనుకుంది. అస్సలు తను హైదరాబాద్ వస్తున్నది కూడా మనీష్ కి సర్ప్రైజ్ , ఎలా రియాక్ట్ అవ్వుతాడో .. అనుకుంటూ చిన్నగా తనలో తానే నవ్వుకుంది. ఇంతలో కార్ ఆగింది. డ్రైవర్ కి డబ్బులిచ్చేసి , తన అపార్ట్మెంట్ లోకి వెళ్ళింది. ప్యాకెర్స్ వాన్ రేపు వస్తుంది, అంత వరకు ఖాళీ గా ఉన్న అపార్ట్మెంట్ ని తను ఎంజాయ్ చెయ్యాల్సిందే.
హాల్, బెడఁరూంస్ , బాల్కనీ అన్ని చాలా బాగున్నాయి. ఈ ఏడాది ఎలా ఐన లోన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కోవాలి అని ఉంది, ఇదే తీసుకుంటే పోలా అనుకుంది తను ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ.. మనీష్ కి మెసేజ్ పెట్టింది, "అనుకోకుండా హైదరాబాద్ వచ్చాను ఒక రెండు గంటల్లో కలుద్దామా ?
" అని. అతను ఫోన్ వెంటనే చూసుకోడు అని తెలుసు , ఈ లోపల స్నానానికి వెళ్దాం అని, బాగ్స్ తెరచి, తన బట్టలు తీసుకొని, స్నానం చేసి వచ్చింది. బాత్రూమ్ బయట డ్రెస్సింగ్ రూమ్ లో లైటు వేసి, తల తుడుచుకుంటూ అద్దం లోకి చూసింది. ఒక్క సారి తనను తాను చూసి నమ్మలేకపోయింది, తను ఏంటి ఇంత అందంగా కనిపిస్తున్నాను అనుకుంది. అంటే తాను అందంగా ఉండనని కాదు, కానీ ఎదో తెలియని కొత్త కళ. బహుశా తన మనసులోని సంతోషం ఇలా కనిపిస్తోంది ఏమో అనుకుంది. ఈ లోపల మెసేజ్ వచ్చింది. "అరే! చెప్పనే లేదు! ఎక్కడ కలుద్దాం? బరిస్టా ? ఎన్నాళ్ళు క్యాంపు ? వీకెండ్ వరకు ఉంటావా?కాల్ చేసే స్థితి లో లేను, మీటింగ్ అయ్యాక చేస్తా!" నవ్వుకొని మళ్ళీ అద్దం లో చూసింది, తననే తాను చూసుకుంటోందా అనిపించే అంత ముద్దుగా ఉంది తన ప్రతిబింబం. అలా తదేకంగా చూస్తూనే , తయారు అవ్వుతూ కూని రాగాలు తీసే ప్రయత్నం చేసింది , ఎందుకో తెలియదు ఎక్కడ నుంచో తనకు ఈ పాట వినిపించ సాగింది " తన కన్నులు చురకత్తుల్లా గుండెను కోస్తుంటాయి, తన నవ్వులు ఆ గాయానికి మందులు పూస్తుంటాయి.. తానెవ్వరు అంటే అద్దం లో చూస్తే తను ఓ అమ్మాయి", ఎక్కడ నుంచా అని ఆరాగా తల పైకి ఎత్తి అద్దం లో చూసింది. ఒక్క సారి గుండె ఝల్లు మంది, అద్దం లో తను నవ్వుతున్నట్టు, తననే చూస్తున్నట్టు అనిపించింది, ఒక్క క్షణమే , తరువాత మామూలుగానే ఉంది కానీ .. గుండె దడ తగ్గటానికి 5 నిముషాలు పట్టింది. ఖాళీ గా సామాను లేని ఇంట్లో ఇలాంటివి అనిపించటం మామూలే ముందు కంజూరింగ్ మూవీస్ చూడటం ఆపితే మంచిది అనుకుంది.
తయారు అయ్యాక అక్కడే అద్దం ముందే ఒక సెల్ఫీ దిగుదాం అనుకుంది, ఫోన్ తీసి ఫోటో దిగబోతుంటే, అద్దం లో ఉన్నంత అందం గా ఫోన్ లో అనిపించకపోటం తో వెనక్కి తిరిగి అద్దం లో చూడబోతుండగా ఫోన్ మోగింది, చేస్తున్నది మనీష్ అని చూసి, నవ్వుకుంటూ ఫోన్ ఎత్తి మాట్లాడ సాగింది. తన పర్సు, ఇంకా చెప్పులు తీసుకొని బయటకు వచ్చి , తలుపు తాళం వేసింది. కానీ తన డ్రెస్సింగ్ రూమ్ లోని అద్దం లో అమ్మాయి అలానే నిలుచొని ఉంది అని గమనించనే లేదు!
తనను చూసి ఆశ్చర్యపోయిన మనీష్ తో " నేను ఇలా వచ్చాను అంటేనే ఇంత సర్ప్రైస్ అవ్వుతున్నావ్ , ఇంకా మొత్తానికి వచ్చేస్తే ఏం చేస్తావోయ్ ?" అని అంది , అతనేమో అనుమానంగా చూస్తూ " Don't tell me !" అని ఆశ్చర్యపోయాడు , "అస్సలు ఒక్క మాట కూడా చెప్పలేదు, గూగుల్ ఆఫర్ లెటర్ వచ్చిందా? నీతో మాట్లాడటం కూడా దండగే , ఇప్పటి వరకు చెప్పాలి అనిపించలేదా ? నీ డ్రీం జాబ్ , హైదరాబాద్ కి రావటం, ఇన్ని జరుగుతున్నా ఒక్క మాట చెప్పలేదు! అస్సలు నేను నీతో మాట్లాడనే కూడదు " అంటూ బుంగమూతి పెట్టే ప్రయత్నం చేశాడు. " నేను చెప్పే అప్పుడు నీ మొహం చూడాలి అనుకున్నా. ఇలా చెప్పటం కంటే బెటర్ ఏం ఉంటుంది చెప్పు ?" అని అంది " నేను నీతో మూవ్ ఇన్ అవ్వొచ్చా?" అని కొంటెగా నవ్వుతూ అడిగాడు " తంతారు , అంత లేదు! మహా అయితే రేపు నువ్వు, మన బ్యాచ్ తో కలిసి వచ్చి నాకు సామాను సర్దడానికి సాయం చెయ్యి " అంది. "నువ్వు ఈ రోజు వచ్చి రేపు అందరూ వచ్చెయ్యండి అంటే సెలవలు పెట్టాలి గా అందరూ ?" " ఇంతోటి దానికేనా హైదరాబాద్ వచ్చేయ్ అని ఊదరగొట్టింది? నా కోసం ఒక్క రోజు శెలవు దొరకదా?" అంటూ సణిగింది. "సరే, అసల నీ ఫ్లాట్ చూద్దాం పద, అందరినీ సాయంత్రం అక్కడికే రమ్మంటే సరిపోతుంది" అంటూ బయల్దాదేరదీశాడు.
రమ్య ఇంటికి చేరుకునే సరికి, ఎవరో పాడుతున్నట్టు అనిపించింది, కానీ తాళం తీసే సరికి ఆ పాట ఆగిపోయింది. పక్క ఫ్లాట్ లో వాళ్ళు ఎవరన్నా ఏమో అనుకున్నారు ఇద్దరూ. లోపలికి వచ్చి , ఫ్లాట్ మనీష్ కి చూపించ సాగింది రమ్య. బెడఁరూం లోని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకి వచ్చాక తన చెయ్యి పట్టుకొని దగ్గరకు లాగి, "why didn't you tell me before you came here.. "అని అడిగాడు. "ఏమో, ఇలానే నిన్ను చూస్తూనే చెప్పాలి అనిపించింది అందుకే చెప్పలేదు.. పెద్ద కారణం ఏమీ లేదు " అంది ఆమె. ఆమె మాటకాడుతున్నా కూడా మనీష్ తనను గమనించకుండా అద్దం లోకి తీక్షణంగా చూస్తున్నాడు,
" రమ్య? నువ్వు ఇందులో ఎందుకు చాలా అందంగా కనిపిస్తున్నావు?" ఆమె కి వెంటనే చిర్రెత్తుకొచ్చింది
" అంటే నేను బయట అందంగా లేను అనే గా ? " అంది ముక్కు మీద కోపం తెచ్చుకుంటూ..
" అరె ! బాబా ! లుక్ , నీ నడుము ఇంత సన్నగా ఉండదు , you look two shades ligther in the mirror, ఇంకా నీ జుట్టు కూడా చూడు అస్సలు చేరగలేదు ?" -- అని అంటూనే , అద్దం లోని ప్రతిబింబాన్ని తాకడానికి ప్రయత్నించాడు -- ఎక్కడో సన్నగా " అర చేతికి అందే జాబిలి అనిపిస్తుంటుంది , తాకాలనిపించే తలుపును రగిలిస్తుంటుంది, తానెవ్వరు అంటే .. అద్దం లో చూస్తే తాను ఓ అమ్మాయి.. నిద్దురకే తెలిసే రంగుల నడి రేయి " అంటూ వినిపిస్తుంది. రమ్య, మనీష్ ఇద్దరూ ఆ అద్దం వైపు, ఆ అద్దం లోని అందమైన అమ్మాయి వైపు తదేకంగా చూస్తున్నారు.. ఆ ఆలాపన వెనకాల సాగుతూనే ఉంది.. ఎక్కడిది ?ఎందుకు వినిపిస్తోంది అని వీరిద్దరూ ప్రశ్నించుకునే స్పృహ లో కూడా లేరు.. మనీష్ చెయ్యి అద్దాన్ని తాకే వరకు వచ్చాక, ఇంక తాకేస్తుంది అనగా , బెల్ మోగింది.. వెంటనే ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు .. ముందు తలుపు వైపు. అద్దం లోని రమ్య మాత్రం నిరాశగా మళ్ళా తనని ఎప్పుడు పట్టించుకుంటారా అన్నట్టు దీన వదనం పెట్టింది.
మైత్రి, అనూష , ప్రవల్లిక,రవి,శ్రీకాంత్ ,అభి అంతా వచ్చేశారు. ప్రతి ఒక్కరివీ పకరింపులూ, నువ్వు వస్తున్నావని నాకు చెప్పలేదు అంటే నాకు చెప్పలేదు అని నిందలు అయ్యి, అందరికీ రమ్య సర్దిచెప్పే సరికి సాయంత్రం అవ్వనే అయ్యింది. అనూష లేచి మొహం కడుక్కుందాం అని బాత్రూం కి వెళ్ళింది. తాను ఫేస్ ప్యాక్ వేసుకోటం కోసం డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది, అందులోని అద్దం లో తనని తాను చూసి ఎందుకో చాలా అందంగా కనిపిస్తున్నా అనుకుంది, పొద్దున్న నుంచి ఎండలో తిరుగుతూనే ఉన్నా కానీ ఇలా ఎలా ఉన్నాను అనుకుంది, తన మొహం అద్దానికి దగ్గరగా పెట్టి చూసుకుంది, ఎప్పటి నుంచో తనకు ఉన్న అమ్మ వారు పోసినప్పటి మచ్చ కనిపించటమే లేదు .. తనకు డౌట్ వచ్చి తన బాగ్ లోని, కేక్ పౌడర్ట్ డబ్బా లోని అద్దం లో చూసుకుంది అందులో తన మచ్చ కనిపిస్తోంది, ఇదేమన్నా ట్రిక్ మిర్రర్ ఏమో అనుకుంది, ఎదో తెలియని ఒక చిన్న భయం తనలో మొదలయ్యినా , దానిని పట్టించుకోకుండా , తన పేస్ ప్యాక్ తీసి, కలప సాగింది. అద్దం లోని అనూష మాత్రం తల దించుకున్న అనూషను చూస్తూనే ఉంది. " పైకెత్తని ఆ రెప్పలు నిన్ను సీసూటిగా చూస్తుంటాయి ... మునుపెన్నడు చూడని కలలను చూద్దువు రమ్మంటాయి " అంటూ ఎక్కడ నుంచో అనూషకు పాట వినిపించ సాగింది, తనలో ఎదో తెలియని భయం చిన్నగా బలపడ సాగింది .. తన పేస్ కి కొంచెం మాస్క్ పూసుకొని .. ఎందుకో తన బింబం తనను చూస్తున్నట్టు అనిపించి తల పైకి ఎత్తి చూసింది .. అద్దం లోని అమ్మాయి తనలానే ఉంది, కానీ ఆమె చాలా అందంగా ఉంది ఇది నిజమేనా ?!అని తన మొహం తాను తాక గానే పేస్ ప్యాక్ ఉంది అని గుర్తొచ్చింది .. కానీ అద్దం లోని అమ్మాయి మొఖానికి అది లేదు! తను కంగారు పడుతోంది కానీ అద్దం లోని అనూష నవ్వుతోంది .. అనూషకి భయం తో ఒళ్ళంతా చెమటలు పట్టి .. గట్టిగా అరచి కుప్పకూలిపోయింది. ఐనా అద్దం లోని ఆ అమ్మాయి నవ్వుతూనే ఉంది...
ఆమె అరుపు వినగానే, అందరూ ముందు గది లోంచి పరిగెట్టుకొని వచ్చారు. అనూష ని తట్టి లేపి ఏమైంది అని అడిగారు, ఆమె నెమ్మదిగా లేచి కిందనే కూర్చొని, అద్దం వైపు చూసింది. "ఏంటే ఫేస్ ప్యాక్ వేసుకున్న తరువాత అద్దంలో నీ మొహం నువ్వే చూసుకొని దడుచుకున్నావా ?" అంది ప్రవల్లిక వెటకారంగా. 'అదే నిజం అని చెప్పినా వీళ్ళు నమ్ముతారా?' అని అనుకుంది అనూష . ఇది తన ఊహ అయితే బాగుండు అనుకుంటూ , వాష్రూమ్ లోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చింది. అందరూ ఇంకా అక్కడే ఉన్నారు, అనూషకి ఏమైందా అని కొంచెం ఆదుర్దాగానే ఉన్నారు, అనూష కి కూడా ఈ విషయం తెలుసు అందుకే వస్తూ వస్తూనే తన డైట్ గురించి తన మీద తానే " అన్నీ తింటే లావైపోతాం , కొంచెం తగ్గించి తిన్నా , ఇదిగో ఇలా నీరసం వచ్చి ఏడుస్తాం .. ఎలాగే బాబు చచ్చేది " అని ఒక మాట విసురుకుంది. "నీకేమన్నా ఇది కొత్తా నే? ఇది మొన్న ఏం చేసిందో తెలుసా రమ్య ? డ్రెస్ మార్చుకుంటా అని చెప్పి గది లోకి పోయి కెవ్వున అరిచింది, ఏంటో అని వెళ్ళి చూస్తే, పాపకి డ్రెస్ టైట్ అయ్యిపోయింది అంట! తిండి మానుతుందేమో కానీ ఒక్క రోజు కూడా జిం మానదు, ఎమన్నా అంటే నీకేం తెలుసే మానేసిన తరువాత రోజు నాకు తెలుస్తుంది తేడా అని అంటుంది " అని ముగించింది మైత్రి.
" అబ్బా ! చల్లేండి దాన్ని వేసుకున్నది. మీరేమన్నా తక్కువా ? స్విమ్మింగ్ నేర్చుకో అంటే , ఆమ్మో నీళ్ళలో దిగితే నల్లగా అయ్యిపోతాను అని ఒకళ్ళు అంటారు, మారథాన్ కి పోదాం అంటే ఎండ కి rashes వస్తాయి అని ఒకళ్ళు అంటారు .. మరి రమ్య అయితే ఇంకా సూపర్, ఎప్పుడో అమ్మ గారికి మూడ్ వస్తే తప్ప కార్ window తెరవరు, ఎమన్నా అంటే జుట్టు చెదిరిపోతుంది అంట అందరరూ అందరే ! " అని అన్నాడు శ్రీకాంత్.
" నాకు ఆకలి వేస్తుందిరా , పదండి బయట తిని వద్దాం " అని అన్నాడు రవి.
" నీ టైమింగ్ ఏ టైమింగ్ రా , ఎవ్వరు ఏమైపోయినా మన గడ్డి మనకు పడాల్సిందే " అని రవి వీపు మీద చిన్నగా చరిచాడు మనీష్. అనూష కి కూడా ఇక్కడ ఉండటం కంటే బయటకు వెళ్ళటమే మంచిది అనిపించింది, " తినేసి వద్దాం అబ్బా !" అని అంది. అందరూ అన్నీ మాట్లాడుతున్నారు కానీ రమ్య మాత్రం, అనూషనే చూస్తోంది. తనకు కూడా ఎదో తెలియని ఒక భయం గుండెల్లో బయలుదేరింది. అంతా ముందు గదిలోకి వెళ్తుంటే, రమ్య , అనూష మాత్రం ఒక్క సారి వెనక్కి తిరిగి అద్దం లో చూశారు, ఎదో తెలియని భయం తో వారిద్దరికీ చిరు చెమటలు పట్టాయి, పెదాలు వణుకుతున్నాయి.. అద్దం లో తమకన్నా ఎంతో అందంగా కనిపిస్తున్న రమ్య, అనూష పెదాలు కూడా వణుకుతున్నాయి .. అసలైన రమ్య కీ అనూష కీ " వణికే ఆ పెదవులు ఏవో కబులురు చెబుతుంటాయి ..విన్నానని అనుకున్నవి అన్ని నిజం అని నమ్మిస్తాయి" అని సన్నగా పాట వినబడుతోంది.. ఖంగారు పడి, గుండెలు వేగంగా కొట్టుకుంటుంటే ఇద్దరూ నోరు తెరచి ఒకరిని ఒకరు చూసుకున్నారు, ఏం మాట్లాడకుండా, అందరూ ఉన్న చోట కి వెళ్ళి, తలుపు తాళం వేసి బయటకి వెళ్ళారు .. అప్పుడు కూడా పాట వినిపించ సాగింది "ఇటు రానని ఆవలి అంచున నిలిచే ఉంటుంది..కాలానికి ఎదురీదే లా కవ్విస్తుంటుంది తానెవ్వరు అంటే ... అద్దం లో చూస్తే తను ఓ అమ్మాయి నిద్దురకే తెలిసే నడి రేయి."
కిందకు దిగి నడిచే అప్పుడు, రమ్య పక్కన అనూష నడుస్తూ, " రమ్య, నాకు ఆ ఇంట్లో ఏంటో చాలా uneasyగా ఉందే !" ఇంత వరకు తనలో తానే అనుకొని పైకి చెప్పకుండా ఎదో ఒకటి సర్ది చెప్పుకున్న నిజాన్ని , పైకి అనేసింది అనూష , ఇంక రమ్య కి తప్పలేదు " నేను మహా ఉన్నదే 6 గంటలు అయినా నాకు అలానే అనిపిస్తుందే , కానీ ఈ పారానార్మల్ స్టఫ్ అంతా నమ్మచ్చా ? లేదంటే ఏదన్నా నేనే ఊహించుకుంటున్నానా అని అనిపిస్తుందే " అని అంది. " లుక్! నీకు తెలుసు, I am ది మోస్ట్ ప్రాక్టికల్ పర్సన్ యు know రైట్! అండ్ ఐ డోంట్ ఫీల్ సేఫ్ there . పారానార్మల్ ఆ కాదా నాకు తెలియదు, there is something wrong with that mirror. naa reflection nannu choosi నవ్వుతోంది! that too while I am trembling and that is not normal. " అని అంది అనూష. " ఏం చేద్దాం ? నేను ఇక్కడే ఉండాలి కదా, ఇది ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్ , దిగకుండానే నన్ను వెళ్ళిపోమంటావా? " అని అడిగింది రమ్య. " ఛా ! అలా కాదు, అసలు విషయం ఏంటి, what's wrong అని తెలుసుకోకుండా ఎలా వెళ్ళిపోతాం? వెళ్ళిపోయినా ఆఫీస్ వాళ్లకు కాకున్నా మనకు మనం justify చేసుకోవాలి కదా ?" ఇంతలో watchman కనపడటం తో రమ్య, అనూష ఆగి అడిగారు - " 506 లో ఇంతక ముందు ఎవరు ఉండే వారు? "
"సతీష్ సార్ , స్వర్ణ మేడం ఉండే వారండి."
" ఎందుకు ఖాళీ చేశారో తెలుసా నీకు" అని అడిగింది అనూష.
" పాప పుట్టిన తరువాత, స్వర్ణ మేడం చనిపోయారు అండి.."
అనూష , రమ్య ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.. " ఎలా చనిపోయారు?"
" పాప పుట్టాక రెండు నెలలకి జబ్బు చేసి చనిపోయారు"
" ఆత్మ హత్య చేసుకుంది అంటావా? నువ్వేం అనుకుంటున్నావు ? " అని అడిగింది రమ్య.
" ఎందుకు మేడం ఇప్పుడు ఇవన్నీ, ఇల్లు చక్కగా ఉంటుంది ఇవన్నీ మనసులో పెట్టుకొని రాత్రుళ్లు నిద్ర చెడగొట్టుకోటం తప్ప!" అన్నాడు అతను.
"ప్రవచనాలు మాని అడిగింది చెప్పు " అని అంది అనూష చిరాగ్గా.
" నాకు తెలియదండి! వాళ్ళిద్దరూ బానే ఉండే వారు, ఆవిడ అయితే సినిమా హీరోయిన్లా ఉండేది, అస్సల ఆమె ఏ రోజూ మాములు మనిషిలా ఉంది అని నాకు ఎప్పుడూ అనిపించలేదు, ఎప్పుడు చూసినా అందం గానే ఉండేది, నవ్వుతూనే ఉండేది. ఆమె ఎదో దేవలోకం నుంచి వచ్చిందేమో అందుకే మనిషి బాధలు ఆమె కు లేవేమో అనుకునే వాడిని , నేనే కాదు మా ఇంటిది కూడా అలానే అనుకునేది .. ఆ మనిషి లో అలుపు , సొలుపూ, నీరసం, అసల జుట్టు పక్కకు చేరగటం మేము చూసి ఎరుగం! ఆయన కూడా ఆమెను బాగానే చూసుకునే వారు. ఇద్దరరూ సంతోషంగానే ఉండే వారు. ఏమైందో ఏమో ఒక రోజు ఆమె చనిపోయారు, జబ్బు వచ్చి హాస్పిటల్ కి వెళ్ళే దారిలోనే చనిపోయారు" ఎందుకు అడగాలి అనిపించిందో రమ్య కి "బెడఁరూం లో అద్దం ఎప్పుడు బాగు చేపించారు?" అని అడిగింది. Watchman కొంచెం అలోచించి,
" రెండు రోజుల ముందే మేడం! స్వర్ణ మేడం చనిపోయాక సార్ ఒక నెల రోజులు ఉన్నారు, తరువాత ఇక్కడ ఉండలేను అని ఖాళీ చేసి వెళ్ళారు, అయన వెళ్ళాక చూస్తే అద్దం పగిలి ఉంది, ఏం చెయ్యగలం? అసలే ఆయన బాధల్లో ఉన్నారని మా ఓనర్ గారే మీ కంపెనీ వాళ్ళకి ఇచ్చే ముందు అద్దం వేయించమన్నారు"
" ఓయ్ !! వచ్చేది ఉందా లేదా మీ ఇద్దరూ ? నేను అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాను, ఏమయ్యారో అని?" అంటూ గేట్ బయట వీధిలోంచి మనీష్ అరుస్తున్నాడు. "ya! coming." అని బయలుదేరారు రమ్య,అనూష. " వీళ్లందరికీ చెప్పాలంటావా?" అంది రమ్య చిన్నగా " నమ్మితే అనవసరంగా ఖంగారు పడతారు, లేదంటే ఉత్తినే ఏడిపిస్తారు, రెండూ చిరాకు బేరాలే! లైట్ తీసుకో. we will figure something out" అని అంది అనూష. అంతా కలిసి restaurant లో భోజనం చేసే సరికి రాత్రి 9:30 అయ్యింది. ఒక్కొక్కరూ రేపు ఉదయం వస్తాం అంటూ బయలుదేరారు. " నువ్వూ మాతో రావచ్చుగా రమ్య, ఒక్క దానివే ఖాళీ ఫ్లాట్ లో ఏం ఉంటావ్? మా ఇంటికి రా " అని అంది మైత్రి. " లేదు లేవే , నాకు కూడా అలవాటు అవ్వాలి కదా!" " నేను ఉంటా తనతో ఎలాగూ మా ఇల్లు దగ్గరేగా! రేపు మార్నింగ్ మీరు వచ్చాక వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా" అని అంది అనూష. " గుడ్! నేను మీ ఇద్దరికీ అపార్ట్మెంట్ దాకా తోడు వస్తాను ! నా కార్ కూడా ఎలాగూ అక్కడే ఉంది కదా, తీసుకొని వెళ్తా " అని అన్నాడు మనీష్.
అనూష, రమ్య , మనీష్ కలిసి అపార్ట్మెంట్ వరకు వచ్చారు, మనీష్ తన కార్ తీసుకొని, రేపు కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను గేట్ దాటిన తరువాత రమ్య కి గుబులు పుట్టుకొచ్చింది. ఉండమంటే బాగుండేదేమో, ఇప్పుడు పైకి వెళ్ళాలంటే భయంగా ఉంది! పోనీ ఫోన్ చేసి పిలిస్తే? చి ఛి ! ఎంత సిల్లీ గా ఉంటుంది! అనుకుంది. అనూష watchman దగ్గరకు వెళ్దాం అని సైగ చేసింది.
" ఇంతకు ముందు వాళ్ళు ఎందుకు ఖాళీ చేశారో తెలుసా?" అని అడిగింది.
" లేదండీ ! మేము అనుకోటం ఆమె పోవడం తో, ఉండలేక వెళ్లిపోయారు అని ".
" అతను ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు ?"
" మా ఓనర్ గారికి వేరే ఇల్లు ఉంది, పక్క వీధిలో అక్కడ ఉంటున్నారు. అయినా ఇవన్నీ ఎందుకమ్మా? మనసు చెడగొట్టుకోటానికి కాకపోతే .. వెళ్ళి సుబ్బరంగా పడుకోండి !" అని అన్నాడు.
రమ్య, అనూష మామూలుగా అయితే ఎంతో ధైర్యంగల అమ్మాయిలే కానీ, ఇప్పుడు మాత్రం ఇద్దరికీ చెమటలు పడుతున్నాయి , ఫ్లాట్ దగ్గరకి వచ్చే కొద్దీ. రమ్య అనూష వైపు తిరిగి,
" ఎందుకే , మీ ఇంటికి వెళ్ళిపోదాం! నాకు ఎదో భయం గా ఉంది " అంది.
"రేపైనా చూడాలిగా ! you are supposed to live here. ఏదో ఉంది అని అనిపిస్తుందే. చూద్దాం!" అని అనూష అంది. తలుపులు తాళం తీశారు. తీస్తూనే
వాళ్ళయిద్దరికీ ఇంట్లో నుంచి ఎవరో పాడుతున్నట్టు అనిపిస్తోంది.. గుమ్మం లో నుంచునే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు..
" నీలోని గొప్ప తనం అంతెత్తున చూపిస్తుంది .. నీకే నువ్వు కనపడనంతటి లోతుల్లో తోస్తుంది" అంటూ పాట పాడుతున్నారు ఎవరో.. అనూష రమ్య వైపు చూసి watchman ని పిలుచుకురమ్మని సైగ చేసింది. రమ్య సందేహిస్తూనే కిందకి వెళ్ళింది. ఫ్లాట్ తలుపులు తీసి ఉంచి గుమ్మం బయటనే అనూష నుంచుంది. పాట చాలా మధురంగా ఉంది, ఒక్కో అడుగూ వేసుకుంటూ అనూష లోపలి వెళ్ళింది. రమ్య, watchman వచ్చేవరకు లోపలకి వెళ్ళకూడదు అనుకుంది, కానీ తనకే తెలియకుండా ఆ అద్దం ఉన్న గదిలోకి వెళ్ళి అద్దం ముందు నిలుచుంది.. అద్దం లోని మనిషి అచ్చం అనుషలానే ఉంది, కానీ తనకన్నా చాలా అందంగా ఉంది. తనలానే ఉంది, తనలా లేదు కూడా. ఆమె అనూష వైపు దీనంగా చూస్తోంది.. ఆమె కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి.. ఎందుకో తెలియదు అంత అందమైన మోహంలో ఆ బాధ చూసి అనూష హృదయం చలించి, ఆమెకే తెలియకుండా కన్నీళ్ళు వస్తున్నాయి.
" నేను ఏడిస్తే నువ్వూ ఏడుస్తావా ? " అని అడిగింది అద్దం లోని అమ్మాయి .
" నువ్వు నా బింబానివి కదా?"
" అప్పుడు నువ్వేడిస్తే నేను ఏడవాలి కానీ నేను ఏడిస్తే నువ్వు కాదు!" అనూష అలానే చూస్తూ అద్దం ముట్టుకోబోయింది. రమ్య వచ్చి ఆమె చెయ్యి అవతలకి లాగేసింది.. ఇద్దరూ నుంచొని అద్దంలోని అమ్మాయిని చూస్తున్నారు .. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు లేరు. ఒక్క అమ్మాయే , ఆ అమ్మాయి రమ్య లాగాను ఉంది, అనూష లాగాను ఉంది, కానీ వారిద్దరికంటే ఎంతో అందంగా ఉంది. ఇద్దరూ ఒకే సారి అనుకోకుండా "స్వర్ణ?" అని అన్నారు.. అద్దంలోని అమ్మాయి , స్వర్ణ దిగులుగా నవ్వింది...
Watchman ఇంతలో తలుపు తట్టాడు. " ఏంటమ్మా కిందికి వచ్చారు అంట, మా ఆవిడ చెప్పింది " అంటూ.. అద్దంలో అమ్మాయి మాయం అయ్యిపోయింది, ఇద్దరు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. గుమ్మం దగ్గర watchman ని చూసి .. ఏం చెయ్యాలో తోచలేదు! ఏమీ లేదని అతన్ని పంపెయ్యలా? లేదంటే అతనికి జరిగింది చెప్పాలా? అతను రాగానే, వీళ్ళు చూసిందంతా భ్రమేనా అని వీళ్ళకే అనిపిస్తుంది, ఇంక అతను ఎక్కడ నమ్ముతాడు? -" ఏం లేదు, షాపులు కట్టేస్తారేమో, ఒక కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకొని వస్తావా ప్లీజ్ ? " అని అంది రమ్య. డబ్బులు తీసుకొని అతను వెళ్ళిపోయాక, " ఏంటే ఇది? ఏం చెయ్యాలో తెలియటం లేదు! నాకు భయంగా ఉందే!" అని అంది రమ్య నిస్సహాయంగా..
" నన్ను చూసి భయపడకు రమ్య!" అని వినిపించింది లోపలి నుంచి ఒక గొంతు. అనూష, రమ్య ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నెమ్మదిగా లోపలకు నడిచారు.. అద్దం ముందు నించున్నారు.. " నేను పొద్దున్న నుంచి నిన్ను చూస్తున్నది, నువ్వు నన్ను చూసేలా చేస్తున్నదీ .. నిన్ను భయపెట్టడానికి కాదు.. నా కూతురు ఎలా ఉంది అని అడగటానికి.. నా కూతురు జాగ్రత్త అని చెప్పటానికి!"
"ఏంటి నువ్వు మాట్లాడేది..?"
" నా పేరు స్వర్ణ. నా చిన్నప్పటి నుంచి, నేను ఏమి పెద్ద అందగత్తెను కాను, మా అమ్మ నాన్న బాధపడుతూనే ఉండే వారు! పక్కింటి వాళ్ళు , చుట్టాలు, రోడ్ మీద వాళ్ళు , అందరూ బాధ పడుతూనే ఉండే వారు. పాప ఛామన ఛాయ, పాప పార పళ్ళు, కళ్ళు బానే ఉంటాయి కానీ, జుట్టే మరీ ఉంగరాల జుట్టు, కొంచెం బొద్దుగా ఉంది తనకు స్వీట్స్ పెట్టకండి ... ఆడ పిల్లలు బొద్దుగా ఉంటే ఏం బాగుంటారండీ? ఇలా నా శరీరం మొత్తం, అందం అనే కొలమానాన్ని చిన్న వయసు నుంచే అందుకోలేక , అందరి పెదవి విరుపులకి కారణమైంది. నా చిన్నతనం నుంచి నాకు అద్దంలో చూసుకోవాలంటే భయం, నా మీద నాకే చిరాకు. నన్ను ఇలానే ఎందుకు పుట్టించావు దేవుడా అని ఎన్నో సార్లు అనుకునే దానిని. నేను ఏమి చేసినా, నాకంటే అందంగా ఉన్న అమ్మాయి అదే చేస్తే తనకే ఎక్కువ మెచ్చుకోలు వచ్చేది. ఈ ప్రపంచం అద్దంలో అందంగా పర్ఫెక్ట్ గా ఉండే అమ్మాయిల సొంతం అని అనిపించేది. దానితో ఎలా అయినా నేను అందరూ చెప్పే ఆ పర్ఫెక్ట్ అమ్మాయి అవ్వాలి అని, తిండి మానేసి, నాకు అంటూ ఉన్న ఇష్టాలు వదిలేసి, సన్నబడటానికి , తెల్లగా అవ్వటానికి , జుట్టు అందంగా అవ్వటానికి , నడుము నాజూకుగా అవ్వటానికి చెయ్యనివి లేవు.. అలా చేస్తూ చేస్తూ కాలేజీకి వచ్చేసరికి నేను అందగత్తెల జాబితా లో చేరాను.. అలా చేరిన తరువాత హఠాత్తుగా నేను ఏ చిన్న పని చేసినా, అందరూ గమనించే వారు, పొగిడే వారు, ఎందుకంటే నేను ఇప్పుడు పర్ఫెక్ట్ అమ్మాయిని. నేను ఈ పర్ఫెక్ట్ అమ్మాయిని లోకానికి చూపించటంకోసం ఎంత disciplinedగా ఉన్నానో నాకు తెలుసు, ప్రపంచానికి నా కష్టం తెలియదు నా పర్ఫెక్షన్ , నా పర్ఫెక్ట్ రూపమే తెలుసు. నేను ఉద్యోగం లో చేరిన తరువాత సతీష్ ని ఇష్టపడ్డాను, తనకు నేను అంటే చాలా ఇష్టం. ఏడాది తిరగకుండా పెళ్ళి చేసుకున్నాం..పెళ్ళి అయ్యాక కానీ అతనికి తెలియలేదు పర్ఫెక్ట్ అమ్మాయిలు ఉండరని , ఉన్నా అలా ఉండటానికి వాళ్ళు ఎన్ని చేస్తారో అని .. ఇలా పెరిఫెక్ట్ గా ఉండటానికి కష్టపడే అమ్మాయి అతనికి నచ్చలేదు, అది స్వతహాగా రావాలి అంటాడు .. బయటకు వచ్చినా సలాడ్ ఎందుకు బిరియాని తినమంటాడు, కానీ నాలుగు రోజులు బిర్యానీ తింటే నేను ఎలా ఉంటానో నాకు తెలుసు .. మొదట్లో అతనికి ముచ్చటేసినా , తరువాత తరువాత నా మీద చిరాకు వేసేది. పర్ఫెక్ట్ గా ఉన్న నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అతను లావు అయితే ప్రేమిస్తాడా? నన్ను నేను ప్రేమించుకోగలనా ? అని అనుకుంటుండగానే నా కడుపులో పాప, మొదట్లో సంతోషంగానే ఉన్నా , రోజు రోజుకూ నన్ను నేను చూసుకొని దిగులు పడ్డాను ... నాకే నేను ఏంటో తెలియదు ఈ ప్రాణిని నేను పెంచగలనా అని అనిపించింది.. నా దగ్గర ఉన్నదే నా రూపం అది రోజు రోజుకీ విచ్చిన్నం అవ్వుతుంటే .. నా సంపద అంతా పోగొట్టుకొని నా పాప కి ఏమి ఇవ్వగలను ? అది నాలానే అంద విహీనంగా పుడితే? అనే దిగులుతో ఉండగానే పాప పుట్టింది .. నా పాప నాకు నచ్చింది , అది ఎలా ఉన్నా నాకు నచుతుంది, కానీ ఈ లోకానికి నచ్చుతుందా , నచ్చితే ఈ లోకం దానిని బతకనిస్తుందా ? నచ్చకపోతే బాధ పెడుతుందా ? ఈ దిగులుతోనే నేను మంచం పట్టి మరణించాను .. మా ఆయన్నీ , పాపని చూద్దాం అని ఇక్కడికి వచ్చాను , తను నన్ను చూసి భయపడి అద్దం పగలగొట్టి వెళ్ళిపోయాడు .. తనని భయపెట్టటం నాకు ఇష్టం లేదు.. తనకు నా మీద ఇంకా కోపం పోలేదు.. నేను ఎలా ఉన్న అందంగా ఉంటాను అనే వాడు .. కానీ ప్రపంచం మొత్తం , సన్నగా ఉంటేనే అందంగా ఉన్నట్టు , ఇలా ఉంటేనే అందం అని పొద్దస్తమానం చెప్తుంటే తనని నేను ఎలా నమ్మేది ? అందుకే కనీసం నా కూతురుకైన మీ నాన్న మాట విను , నా మాట విను ... ఈ ప్రపంచం చెప్పే అందం భూటకం అని.. తన అందాన్ని అద్దం లో వెతుక్కోవద్దని, నా లాగ అవ్వద్దని .. చెబుదాం అని వచ్చాను.. మీరు చెప్తారు కాదు? చెప్తాను అని మాట ఇవ్వండి అని అంది"
రమ్య కి అనూషకి కళ్ళలో నీళ్ళు ఆగలేదు. అద్దం లో నుంచి బయటకు వచ్చిన చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశారు. -" నీ స్నేహం తన ప్రాణం అని నీపై ఒట్టేస్తోంది, ఆ ప్రాణం తన గుప్పిట్లో పట్టుకు వెళ్ళిపోతుంది. "
ఎందుకో వాళ్ళిద్దరికీ ఈ పాట గుర్తొస్తూనే ఉంది.. వాళ్ళ చెయ్యి వేసిన చెయ్యి మరు క్షణం లో కనిపించలేదు. అద్దంలో అమ్మాయి కూడా లేదు. ఇప్పుడు అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ ప్రతిబింబాలే ఉన్నాయి, మాములుగా ఎప్పుడూ లాగానే , లోపాలతోనే , కాకపోతే ఇప్పుడు ఈ లోపాలతో కూడిన ప్రతిబింబాలు కూడా అందంగానే అనిపిస్తున్నాయి. Watchman తలుపు కొట్టి పిలుస్తున్నాడు .." ఇదిగో అమ్మ కూల్ డ్రింక్! ఇందుగోండి చిల్లర"
వెళ్లిపోతున్న అతన్ని పిలిచి " సతీష్ గారు ఎక్కడుంటారో తెలుసా?" అని అడిగింది అనూష. అతను అడ్రస్ చెప్పాడు.
తెల్లవారు ఝామున లేచి , watchman ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేసి, అతన్ని సాయంత్రం కలుస్తాం అని చెప్పారు. రమ్య ఎదురు చూస్తున్న packers van వచ్చింది. ఆమె స్నేహితులు అంతా వచ్చి తలో చెయ్యి వేసి, సామాను సర్దారు. రమ్య , అనూష బయటకు వెళ్ళటానికి తయారు అవ్వ సాగరు, రమ్య తన వ్యాక్సింగ్ strips తీసి, అలవాటు ప్రకారం వాడదాం అని అనుకొని , ఒక్క నిముషం ఆలోచించి, అవి dustbin లో పాడేసింది.. అనూష Face pack వేసుకుందాం అనుకోని ఒక్క నిముషం అలోచించి.. జస్ట్ మొహం కడుక్కొని, తయారు అయ్యి బయలుదేరింది.. వాళ్లిద్దరూ ఒక్క అరగంటలో వచ్చేస్తాం అని చెప్పి బయలుదేరుతుండగా " ఇస్తుందో లాక్కుంటోందో ఏమో ఆ చేయి, చేయి జారే దాకా అర్ధం కానివ్వని హాయి
తాను ఎవ్వరు అంటే ... అద్దం లో చూస్తే తను ఓ అమ్మాయి నిద్దురకే తెలిసే రంగుల నడి రేయి" అంటూ మైత్రి పాడ సాగింది .. ఇద్దరూ వెనక్కి తిరిగి ఏం పాటే అది? అని అడిగారు ఆశ్చర్యంగా
" అయ్యో ఇది తెలియదా? మా గురువు గారు రాశారు! అద్దంలో చూస్తే తను ఓ అమ్మాయి అని.. భలే ఉంటుంది !" అని అంది.
" అంటే సినిమా పాటేనా ? ఏం సినిమా "
" అనామిక "
" పాట బాగుంది! సినిమా పేరు అద్దం లో అమ్మాయి అని పెట్టాల్సింది"
" కదా! "
Note: I love this song very much. I think it's criminally underrated. And hence, I wanted to write a tribute to it. Hope it's good enough. :)

Simply beautiful...
ReplyDeleteWonderful saru 😊
ReplyDeleteThank You :)
DeleteAbbaa bhaya pettEsaaru,ending super asalu, songs ki ilaanTi twist thO stories cheptE idoka kotha genre aipOtundi
ReplyDeleteThank You andi :)
Delete