4 సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియదు కనీ, చివరి exam అయ్యిన రోజు మాత్రం, exam హాల్ బయట ఒకటే సందడి ఆటోగ్రాఫ్లు, ఫోన్ నెంబర్లు, భవిష్యతు నిర్ణయాల ప్రణాళికలు,మొత్తం వాతావరణం చాల కోలాహలం గా వుంది. సాయంత్రం ఆరు దాటినా ఎవ్వరు కదలరే... నాకు మాత్రం ఆ బెంగ లేదు నా నేస్తాలు అందరు నాతో పాటే హాస్టల్ లో ఉంటారు. అంచేత మేమందరం హాయి గా ఏ దిగులు లేకుండా కాసేపు అందరితో ముచ్చటించి హాస్టల్ కి బయలుదేరం, వెళ్ళే దారి లో అనిపిస్తూ ఉంది నాకు లో లోపల, ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూసిన రోజు రానే వచ్చింది, కనీ ఆ సంతోషం లేదు ఏంటి నా మనసు లో అని..కాలేజీ ఉన్నా అన్ని నాళ్ళు నేను కాలేజీ అవ్వాలి, ఉద్యోగం చెయ్యాలి, ఎప్పుడెప్పుడు అవవుతుందా అని ఎదురు చూసా , తీరా ఆ రోజు రాగానే బెంగ. హాస్టల్ కి వెళ్లి ఎవరి luggage వాళ్ళు సర్దుకున్నాం రాత్రి అంత కబుర్లు చెప్పుకున్నాం రేపు తెల్లరక పోతే బాగుండు అనుకున్నాం, కానీ ఉదయించే భానుడిని,కదిలే కాలాన్ని ఆపటం మా కాంక్ష తరమా?.రెండు రోజులు హాస్టల్ లోనే ఉండి బయలుదేరుదాం అని నిర్ణయించుకున్నాం. 4 సంవత్సరాలను తన లో కలిపేసుకున్న కాలానికి రెండు రోజులు ఒక లెక్కా? చటుక్కున మేము వెళ్ళాల్సిన రోజు వచ్చింది. శిరీష నా రూమ్మేట్ , తన కారు వెళ్తుంటే.... ఎంత బాధ గా అనిపించిందో చెప్పలేను. నేను ఉన్నా అన్ని రోజుల లో తనని ఇష్టపడింది లేదు అలాని తను అంటే ద్వేషము లేదు. నేను ,పద్మజ ,దివ్య,స్వాతి, నాగలక్ష్మి,రమ్య, మిగిలిపోయము. నాగలక్ష్మి, నా రూమ్మేట్ అన్న మాటే కనీ నాకు ఒంట్లో నలత గా వున్నప్పుడు, మనసు బాలేనప్పుడు నేను హాస్టల్ లో ఉన్నా అనే భావన రాకుండా చూసుకునేది. వాళ్ళ అమ్మ గారు వచ్చారు ,అన్ని సర్దుకొని తయారు అవ్వుతోంది. నేను , పద్మజ,దివ్య,స్వాతి,రమ్య ఖాళీ గా ఉన్నా మా హాస్టల్ గదులను చూస్తూ కూర్చున్నాం. ఆ రోజు కి అందరు వెళ్ళిపోయారు.వెళ్ళటానికి మనసు రాక మేము మాత్రం వుండిపోయం. వెళ్ళక తప్పదు, ఎం చెయ్యాలో తెలియదు... అందరం కూర్చున్నాం...ఎవ్వరికి కూడా వేరే వాళ్ళ మొహం లోకి చూసే ధైర్యం లేదు. దివ్య అమాంతం లేచి, bag తీసుకుని బయలుదేరింది, అది ఎం చేస్తుందో అర్ధం అయ్యి మేము దాని వెనకాల వెళ్ళే సరికి హాస్టల్ గేటు దాక వెళ్ళిపోయింది. నేను పద్మజ, స్వాతి ,రమ్య దాని వెనకాల వెళ్లి bag లాక్కుని, మేము వస్తాం అంత తొందర ఏంటే నీకు అంటే పని ఉంది.. వెళ్ళాలి ... అంటోది తల పైకి ఎతటం లేదు మా అందరికి అర్ధం అయ్యింది అక్కడే ఆ హాస్టల్ entrance మెట్ల మీద నే కూర్చొని ఎంత సేపు కన్నీళ్ళు పెట్టుకున్నామో మాకే తెలియదు. ఈ లోపల నాగ లక్ష్మి, వాళ్ళ అమ్మగారు వెళ్ళటానికి వచ్చారు. నేను నాగలక్ష్మి పట్టుకొని ఎంత సేపు అలా ఉన్నామో తెలియదు, చాలా బాధ వేసింది. అది ఆరింద ల ఎప్పటి లాగే ఓదారుస్తోంది, మీ ఊరు మా ఊరు పక్కనే కదే ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని.దాని కారు వెళ్లిపోతుంటే చాలా బాధ వేసింది... ఆ నిముషమే నాకు తెలుసు.. మేము ఎప్పటికి స్నేహితులు గా మంచి స్నేహితులు గా ఉంటాం కనీ మా హాస్టల్ రోజుల్లో ఉన్నంత ఆనందం గా మాత్రం మళ్లీ ఎప్పటికి ఉండలేము అని. ఇంక మిగిలిన వాళ్ళు బయలుదేరాలి , ఎలా? ఇంత బాధ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళే అప్పుడు పడాల్సిందే నా? అని ఆలోచించాము, ఆ రోజు ప్రపంచ చిరునవ్వుల దినోత్సవము, ఏదన్న మంచి సినిమా కి వెళ్లి అక్కడ నుంచి అందరం ఎవరి దారిన వాళ్ళు వెళ్తే బాగుంటుంది అని, అప్పుడు ఎవ్వరం ఏడవం అని అనుకోని బయలుదేరాము. ఎవ్వరం ఏడవం అని బయలుదేరం అని చెప్పా చూడు ఈ విషయం లో మేము పొరపాటు పడ్డం, మా కోసం బాధ పడే వ్యక్తి ఒక్కళ్ళు వున్నారు. ముఖ్యం గా నా కోసం పద్మజ కోసం, అదే సౌమ్య మా జూనియర్. మొదట్లో మా రజని వాళ్ళ చెల్లి కదా అని రాగ్గింగ్ కోసం పిలిచాను మా రూం కి, అంతే ఏ ముహూర్తాన పిలిచానో ఏమో అది నన్ను అతుక్కుపోయింది అక్క అక్క అంటూ మా రూం లోనే వుండేది. వాళ్ళ క్లాసు వాళ్ళ కంటే నా ఫ్రెండ్స్ నా classmates దగ్గరే చనువు ఎక్కువ దానికి. మేము వెళ్ళే అప్పటికి mess నుంచి వస్తోంది, చూసి ఒకటే ఏడుపు, కనీసం నాకు మా క్లాసు వాళ్ళతో వుండటం కూడా రాదు మీరంతా వెళ్ళిపోతే ఎలా అని నన్ను పట్టుకొని ఒకటే ఏడుపు , నాకు చాలా బాధ అనిపించింది చాల ఏడుపు వచ్చింది, కనీ పద్మజ చమత్కరించింది అప్పుడు " నీ కోసం అని మేము ఫెయిల్ అవ్వాలెం కదే " అని , ఇంకా కొంచెం నవ్వింది సౌమ్య. అందరం కలిసి ఆటో ఎక్కి వేల్లిపోయం సౌమ్య కి , హాస్టల్ కి , కాలేజీ కి , కాలేజీ దగ్గర ఉన్నా రోడ్ కి కాంటీన్ కి , చెట్ల కి మా క్లాసు రూం ల కి వీడ్కోలు చెప్తూ సినిమా కి వెళ్లి, అక్కడ నుంచి ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోయం. ఆ రోజు అనిపించినంత అందం గా మా హాస్టల్ గానీ, కాలేజీ కనీ నాకు ఎప్పుడు అనిపించలేదు.ఇప్పటికి ఆ రోజు ని తలచుకుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. తరువాత ఒక సరి కాలేజీ కి వెళ్ళాను కనీ.. పూర్తి గా మారిపోయింది, ఈ రోజుకి మేము కాలేజీ వదిలేసి ౩ సంవత్సరాలు ఇంచు మించు గా. నేను నా స్నేహితురాళ్ళు అందరం కలుస్తూనే వుంటాం అప్పుడప్పుడు.నాగలక్ష్మి కి పెళ్లి అయ్యి వైజాగ్ లో ఉంటోంది. పద్మజ, దివ్య హైదరాబాద్ లో వున్నారు. పద్మజ job చేస్తోంది, మర్చిపోయ ఇంకో వారం లో దివ్య బెంగుళూరు వస్తాను అంది నా దగ్గరకి. నేను బెంగుళూరు లో జాబ్ చేస్తున్న. స్వాతి వాళ్ళ ఊరి దగ్గర లోనే లెక్చరర్ గా చేస్తోంది, సౌమ్య వాళ్ళ ఇంట్లో వుంది. ఆ రోజు మేము చూసిన సినిమా " బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్"
మర్చిపోలేని రోజులు అవి, నవ్వులు, కేరింతలు అన్ని ఉండేవి. చిత్రం ఏంటి అంటే బాధలు కూడా పంచుకునే వాళ్ళు వుండటం తో తేలికగా ఉండేవి. I Miss You all my friends !! This Post is dedicated to u all .
nice n awesome post... u made me recall those sweet memories..thanq saroja
ReplyDeletemiss u all my dear friends
excellent saroja suuperb....it's all about ur feel.
ReplyDeleteStill I remember the day when I left my friends........
ReplyDeleteI cried like hell……..
Thanks for making me recall all those memories :)
This comment has been removed by the author.
ReplyDeletemalli aa roju kalla munduku thechav...........
ReplyDeletechala rojula tarvata.... naku kuda maa clg gurtu vachindi.... nenu edpinchina ammayilu, vesina veda veshalu... chesina goppa panulu, sadhinchina vijayalu... all flashed in a moment.....
ReplyDeletechala baga rasav really awesome...i wish i am one of your friends in your hostel...but i am happend to be a boy...College memories and sweet and sour...but we can't forget any one of it....hmmmm...
ReplyDeleteThank U all friends... :-)
ReplyDelete