కలం స్నేహం... చిన్నప్పటి నుంచి, అంటే బహుశా రెండో తరగతి చదువుతున్నప్పటి నుంచి అదో రకమైన తెలియని ఇష్టం, ఉత్సాహం నాకు, కాని ఎప్పుడూ నేను అలా ఉత్తరాలలో స్నేహం చేస్తా అని ఊహించలేదు. నాకు రెండవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు 'చేతన ప్రణతి' అనే స్నేహితురాలు ఉండేది. మేము ఇద్దరం కొట్టుకునే వాళ్ళం,నవ్వుకునే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం ఎప్పుడూ కలిసే ఉండే వాళ్ళం. ఆ వయసు లో మేము ఎందుకు అంత స్నేహం గా ఉన్నామో మాకే తెలియదు. అప్పట్లో మా నాన్న గారు అనంతపురం లో పని చేసే వారు, అనంతపురం నుంచి మా నాన్న నెల్లూరు కి బదిలీ అయ్యారు. అప్పటి దాక ఉన్న స్కూల్ ని మనుషుల్ని వదిలి వెళ్ళాలి అంటే నాకు ఏం బాధ అనిపించలేదు ఎందుకో తెలియదు కనీ చాలా హుషారు గా వెల్లిపోదాం అనే అనుకున్న, బహుశా కొత్త ప్రదేశాలని, కొత్త మనుషుల్ని చూడాలనో మరి దేని కోసమో తెలియదు కనీ నేను మాత్రం చాలా ఆనందం గా స్కూల్ లో అందరికి చెప్పేసాను మేము వెల్లిపోతున్నామోచ్ అని. చేతన కి మా నాన్న గారి కొత్త ఆఫీసు అడ్రస్ నాకు తెలిసినంత లో ఇచ్చాను అది ఎంత వరకు సరి ఐన చిరునామానో నాకు తెలియదు కనీ ఇచ్చి ఆనందం గా వెళ్ళిపోయ నెల్లూరు. అనుకోకుండా ఒక ఆరు నెలల తరువాత మా నాన్న నాకు ఒక ఉతరం తెచ్చి ఇచ్చారు అది తెరిచి చూద్దును కదా, ఆశ్చర్యం! చేతన రాసిందా ఉతరం వాళ్ళ ఇంటి చిరునామా తో సహా నేను తను ఇచ్చిన అడ్రస్ పోగొట్టు కొని ఉంటానేమో అని పంపినట్టు ఉంది, ఎంత మంచి పిల్ల! అనుకున్న. తన చేతి రాత , చేతి రాత ని తెలుగు లో ఇంకా ఏదో అంతరండీ ఏంటో గుర్తు చెయ్యరూ...... ఏంటబ్బా అది ........ హా గుర్తొచింది దస్తూరి తన దస్తూరి ఎంత అందం గా ఉండేదో చెప్పలేను ఒక printed లెటర్ అంత అందం గా ఉండేది. తన మొదటి లెటర్ ని నేను చాలా రోజులు నా purse లో పెట్టుకొని తిరిగే దాన్ని. తొమ్మిది సుదీర్ఘ సంవత్సరాల తరువాత అది నా valla కాదు తల్లి నన్ను వదిలెయ్యి అని మొన్నిమధ్యన చిరిగిపోయింది :-( . నేను తను చాల కలం ఉతరాలు రాసుకునే వాళ్ళం, మూడు నెలలకి ఒక సరి సంక్షిప్త వార్తా స్రవంతి లాగా :-) ఒక సారి నా ఇంటర్ అయ్యాక తిరుపతి లో అనుకోకుండా counselling హాల్ లో కనిపించింది, కనీ నేను గుర్తు పట్టలేదు తనని చిన్నారి చేతన చాలా మారిపోయింది చూడటానికి :-( తనే నన్ను గుర్తు పట్టింది నేను అస్సల మారలేదు అని చెప్పింది. ఎంత చిత్రం తిరుపతి లో , counselling హాల్ లో తనని చూస్తా అని నేను అస్సల అనుకోలేదు ఎందుకంటే నాకు వచ్చిన ర్యాంకు చెప్పుకోటానికి సిగ్గేసి తనకి చెప్పలేదు కాబట్టి , తను అంతే అనుకుంట :-) , తను నాకు ఆ రోజు ఏదో chocolate ఇచ్చింది ఆ chocolate కవర్ ఇప్పటికి నా దగ్గర ఉంది అనుకోండి! ఏం చెప్తున్నా హా ఆ తరువాత నేను తను ఇంజనీరింగ్ లో కూడా ఉత్తరాలు రాసుకునే వాళ్ళం, గ్రీటింగ్ కార్డ్స్ , నెమ్మది నెమ్మది గా బద్ధకం మొదలియ్యింది ఇద్దరికీ , ఫోన్ లో మాట్లడుకోతం మొదలు పెట్టం, నేను ఉద్యోగం లో చేరాక మొన్నిమధ్యనే తన ఫోన్ నెంబర్ పోగొట్టుకున్న అంత నా దోషమే, తన తో మాట్లడలేకపోతున్నందుకు బాధ పడుతున్నా, కనీ ఈ పోస్ట్ తో పాటు తనకు ఉత్తరం కూడా రాయాలి అని నిర్ణయించుకున్న. నేను ఎంత వరకు తన విషయం లో మంచి దాన్నో నాకు తెలియదు కాని చేతూ మాత్రం ప్రతి slam బుక్ లో ఆటోగ్రాఫ్ బుక్ లో నేనే తన బెస్ట్ ఫ్రెండ్ అని రాస్తుంది, సో స్వీట్ అఫ్ హర్ కదా !! తన లెటర్స్ అన్ని ఇప్పటికీ నా దగ్గర భద్రం గా ఉన్నాయి!
ఇదంతా నేను ఒక ఫ్రెండ్ కి చెప్తే తను నేను రైటింగ్ practise చెయ్యాలని నాకు మంచి narration స్కిల్ల్స్ ఉన్నాయి అని ప్రోత్సహించారు , తనకు మరియు చేతన కు [ పేరు లోనే ఉంది గా అచేతనం గా ఉన్న నన్ను కదిలించింది చేతన ప్రణతి ] ఈ పోస్ట్ ని అంకితం చేస్తూ...
-- సరోజ
short and chweet....
ReplyDeletethanks thanks :D
ReplyDeletechala baga rastunnav..
ReplyDeletehurdayanni karigistunnav mari..
krishna zilla ammayi kada aa matram vundali..
naku rayalanipistundi..
aha swachamaina telugu naku telisina valla nundi vinadam bahusa idey modhati sari anukunta...
ilagay inka nee chetulalo nundi jalivaraali kankshisthu...ravikiran
is this a real? are they both good friends even now?
ReplyDeleteyes.. we are still in touch
Deleteis this real? are you guys still good friends?
ReplyDeleteNenoo oka Kalam snehithunne (pen friend)... aa feeling naaku baga thelusu
ReplyDeleteit's a very sweet feeling
Deleteమొదటి నాలుగు లైన్స్ చదివాక నాకు ఒకటి అనిపించింది.చివరి వాక్యంలో సరిగ్గా అదే మీ friend కూడా చెప్పారు writing and narration skills బాగున్నాయి అని.It is true.
ReplyDeleteThank You sooo much andi
Deleteచాలా బాగా రాసారు.
ReplyDelete