Thursday, December 24, 2009

Naa kalala teeranni vethukuthu....

ఆటు పోటు ల జడిలో నీ కోసం వేచి ఉన్నా
కన్నీటి అలల పై నీ కోసం నిరీక్షిస్తున్నా ...
నీ కోసం నేను రాల్చిన కన్నీరంతా ఒక సముద్రం అవుతుందేమో ... !!
నీ కోసం నేను చూసిన సమయమంతా కలిపి ఒక జీవితం అవుతుందేమో ..!!
రోజుకి రెప్ప వాలినన్ని సార్లు నువ్వు కనిపిస్తుంటే నువ్వు నిజం గానే వచ్చావేమో అని భ్రమ పడుతున్నాను  !
నిముషానికి దెబ్బై  రెండు సార్లు నీ పేరు నే తలచుకునే గుండె చప్పుడు ఇతరులకి వినిపిస్తుందేమో అని కంగారు పడుతున్నా !
కన్నీటిని కంటి కింద అణచిపెట్టి చిరునవ్వుని పెదవి పైకి తెప్పించటానికి కష్టపడుతున్నా ... !
ఎంత కాలం ఈ మౌనం ?! ఎంత కాలం ఈ నిరీక్షణ ?!
నీ చిరునవ్వు ఎండ మావేనా ?!
నాకు అందనే అందదా??

1 comment:

  1. abba super,
    oka writer kuda ela rayaledu,
    no compitition for u

    ReplyDelete