Wednesday, September 05, 2012

సినివెన్నెల్లో కాసేపు

హాయ్! నేను పోయిన ఆదివారం నా  స్నేహితురాలితో కలిసి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కలిసాను. నా ఈ పోస్ట్ ఎందుకంటే అయన మాతో మాట్లాడినవి ముందు నేను మర్చిపోకుండా , అలానే ఎవరికైనా ఎం మాట్లాడారు అనే ఆశక్తి ఉంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని రాస్తున్నాను.

        మేము వెళ్ళే సరికి విజయ సారధి గారు ( మాకు appointment ఇప్పించిన వారు,  వారి నాన్న గారికి బాలేకపోయినా  మా appointment ని call off చెయ్యటం ఇష్టం లేక మాతో పాటు వచ్చినందుకు Thank You  sir )
సీతారామ శాస్త్రి గారు మాట్లాడుకుంటున్నారు. సాయి గారు ( యోగీశ్వర్  శర్మ) మమ్మల్ని వాళ్ళు ఉన్న చోటకి తీసుకెళ్ళారు .

        అయన ఉన్న గది లోకి అడుగుపెట్టిన వెంటనే ఎంత excitement నన్ను కమ్మేసిందో నేను చెప్పలేను. This was my dream right from the age of 13 ( english తెలుగూ కలిపి రాస్తున్నందుకు క్షమించండి నా భావం ఏ భాష లో స్పష్టం గా  చెప్ప గలుగుతనో అది వాడతాను ) . నేను , ప్రవలిక కూర్చున్నాక  మా పేర్లు అడిగి తెలుసుకున్నారు , వాటి అర్ధాలు తెలుసా అని అడిగారు. నేను అయన కోసం రాసుకొచ్చిన కాగితం చాలా భయపడుతూ ఆయన ముందు పెట్టాను.  And that paper says

                              బెత్తం లేకుండా పాఠాలు నేర్పించిన గురవు గారు మీరు!
                              దీపం లేకుండా వెలుగు చూపిన మార్గదర్శి మీరు!

ఆలోచన -"గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి?"

ఆశ -" నిరంతరం ప్రయత్నముండగా నిరాశకే నిరాశ కలగదా ?"

సంకల్పం -" సందేహిస్తుంటే అతి గా సంకల్పం నెరవేరదు గా ?"

దైవం -"అమృతం అయితే నువ్వు పొందు , విషమైతే అది నా వంతు అని అనగలిగే నీ మనసే శివుడిల్లు "
ధర్మం -"అడవే అయిన కడలే అయిన ధర్మాన్ని నడిపించు పాదాలకు శిరస్సు వంచి దారియదా ?"
లక్ష్యం -"లక్ష్యమంటూ లేని బ్రతుకు దండగ , లక్షలాది మంది లేరా మందగా?"
తత్వం -"ధీరులకి దీనులకి అమ్మ ఒడి ఒక్కటే , వీరులకి చొరులకి కంట తడి ఒక్కటే "
ప్రేమ -" తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానై అడగక దొరికే వారమే వలపంటే"
పెళ్ళి -" కస్తూరి లా మారి నీ నుదుటనే చేరి కడ దాక కలిసుండ నా , కన్నీరు లా మారి నీ చెంప పై జారి కలతల్ని కరిగించనా !"
అమ్మ -" ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా  కమ్మని కావ్యం?"

చావు -" ఆయువంటు ఉన్న వరకు చావు కూడా నెగ్గ లేక శెవము పైనే  గెలుపు చాటు రా "

                                     ఇవన్నీ బడి లో నేర్చుకున్నపాఠాలు కాదు మాష్టారు !
                                     మీ పాట ఒడి లో తెలుసుకున్న  సత్యాలు !!

--Saroja

ఇది అయన చదువుతున్నంత సేపు అయన ముఖాన్నే ఎంతో భయం భయంగా చూస్తూ కూర్చున్నాం . అయన చదివి " అద్భుతం ,సాయి ఇలా రా ఇది చదువు, నువ్వు అడుగుతుంటూ ఉంటావు గా అసలు చేరుతయా ? అని ,ప్రతి చినుకు ఎక్కడో ఒక చోట మొలకేస్తుంది , ఇదిగో నిలువెత్తు నిదర్శనం. ఇవి రా అవార్డులంటే " అని అన్నారు .గదిలో ఎంత మంది ఉన్నారో అందరూ చదివారు నేను రాసింది , మా collegue మృదుల రాసింది కూడా ఇచ్చాను , అది చూసి అయన ఇంకా పొంగిపోయారు . As for me 12 years నుంచి అందరూ పిచ్చి అని అభివర్ణించిన నా అభిరుచి కి మొట్ట మొదటి సారి పొగడ్త దక్కింది అది కూడా సాక్షాత్తూ సిరివెన్నెల గారి దగ్గర నుంచి .  I was on verge of tears , ఆయన గొప్పదనం ఏమిటంటే ఆయన పాటలే ఆయనకు రాసి చూపించినా నేను పెద్ద సాహితీ అభిమానిని అని తెగ మొహమాట పెట్టేసారు.

    ఇంకా నీ feelings పక్కన పెట్టి ఆయన ఏమన్నారో చెప్పు తల్లి అని నన్ను కసురుకోకండి , అక్కడకే వస్తున్నా
మేము అడిగిన మొదటి ప్రశ్న

question  "మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై , నీడలు నిజాల సాక్ష్యాలే" అంటే  ఏమిటి sir అంటే మనకు ఎదురయ్యే  ప్రేమ , ద్వేషం మన ఆలోచనలను బట్టే ఉంటాయి అని చెప్తున్నారా ?"

Answer "అసలు ఆ పాటలో ఆలోచించాల్సిన line ఇంకోటి ఉందమ్మ , అందరూ ప్రశ్నించుకోకుండా తమకు అర్ధం అయ్యినది అర్ధం చేసుకొని ఓహో గొప్ప పాట ఆహా గొప్ప పాట అంటుంటారు . 'స్నేహితులు నీకున్న ఇష్టాలే , శతృవులు నీకున్న లోపలే ' ఇందులో స్నేహితులు నీకున్న ఇష్టాలే  ఇది అర్ధం అయ్యింది కదా? మరి శతృవులు నీకున్న లోపాలే అని అంటే ఎక్కడో ఎవరో ఉన్మాది ఎవరినో చంపుతాడు మరి వాడు నాకు శతృవు కదా ? వాడు ఎవరినో చంపితే అది నా లోపం ఎలా అవ్వుతుంది ? అని ఆలోచించారా ? ప్రపంచం మొత్తం నీలోనే ఉన్నది అన్నప్పుడు అందులోని లోపాలకి కూడా నీ భాద్యత ఉన్నట్టే గా ? అర్ధం కాలేదా ? సరే నువ్వు రాసుకొచ్చావే ఇందులోని అన్ని భావాలు నీకు నచ్చినవి, తెలిసి రాసావో తెలియక రాసావో కానీ ఈ సత్యాల్ని నువ్వు అనుభూతి చెందావా ఎప్పుడన్నా ? తెలియటం వేరు , నచ్చటం వేరు, అనుభూతి చెందటం వేరు , మనకి నచినది మనం అనుభూతి చెందగలిగితే మనకు ప్రపంచం ఇలా కనపడదు. అందరం నచ్చటం లో ఆగిపోతున్నాం. ఇంతకి నువ్వు అడిగిన ప్రశ్న నీదేనా ? నీదే అయితే నేను చెప్పే దాక అక్కర్లేదు ఈ పాటికి, నా దగ్గరకి రాక ముందే నీకు జవాబు దొరికుండాలి ,ఎందుకంటే నీదైన ప్రశ్న నిన్ను కుదురుగా ఉండనివ్వదు , అల కాక నువ్వు కుదురుగా ఉన్నావంటే ఆ ప్రశ్న నీది కాదు అని అర్ధం. ప్రతి మనిషీ తన జీవితం లో 50 కి పైగ పాత్రలు పోషిస్తాడు, ప్రతి పాత్ర లో ఒక 50 మంది తో interact అవ్వుతడు , వాడి లో ఉన్న ఆశ ని , నవ్వు ని ఆ 50 మందికి  అంటించ గలిగితే , అంటే 2500 మందికి అతికించామనుకో , 5 సంవత్సరాల్లో ప్రపంచం మారిపోదు ? మరి ఇంకా ఇలానే ఉన్నామంటే , మనమే సరిగ్గా అనుభూతి చెందటం లేదు అన్న మాట . అవతల  వాళ్ళు అని అనకు నువ్వు నాతో మనస్పూర్తిగా నవ్వుతూ మాట్లాడావు అనుకో ఎన్ని రోజులు , ఎంత కాలం నేను మూతి ముడుచుకొని కూర్చోగలను చెప్పు? నీ ఓపికకి పరీక్షే కానీ నీ ప్రేమకు కాదు , ఎందుకంటే ఎక్కడైనా ఎప్పుడైనా contradictions does not exist. నువ్వు ఎవరినన్నా నిజంగా  అభిమానిస్తున్నాను కానీ వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు అంటే , నువ్వు , నీ మనసులో కూడా ఎక్కడో ఆ ద్వేషం ఉంది లేదంటే వారు నిన్ను అభిమానించే తీరాలి, అది సత్యం"

Question : "sir మీరు చిన్నప్పుడు నాస్తికులు అని విన్నాను.."

Answer : "ప్రపంచం లో నాస్తికులు అనే వాళ్ళు లేరు అమ్మా ! నాస్తికులు అనే వాళ్ళు దేవుడు ఉన్నాడు అనే నీ నమ్మకాన్ని నమ్మరు అంతే . నాస్తికులు అడిగే మొట్ట మొదటి ప్రశ్న ఏమిటి?  దేవుడు ఉంటే Suffering ఎందుకు అని ? మన అందరికి అన్నీ సమంగా ఇవ్వకపోయినా , బ్రతకాలి అనే ఆశ , జీవితం మీద ఉండే ఆశ ప్రతి జీవికీ సమంగానే ఇచ్చాడు కదా? అసలా అంత ఎందుకు?నువ్వు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఎ రోజు నువ్వు బ్రతకటానికి ఎంత probability(0.01%) ? చనిపోటానికి ఎంత probablility(99.9%) ? అంత పెద్ద probability రోజు ఫెయిల్ అయ్యి ఎప్పుడో ఒక సారి నిజం అవ్వుతుంటే దానిని మనం accident అంటున్నాము , నిజానికి మనం బ్రతకటమే ఒక accident ఎందుకంటే 0.01% అనే చిన్న probability మీద బ్రతుకుతున్నాం కాబట్టి. God is there , don't search him in heavens , search him in yourself .

Question :"sir ఫలానా book లో ..."


Answer : మీరు నన్ను గురువు గారు అనుకుంటే , నేను చెప్పింది వినండి , నేను చెప్పినవి నిజాలు అని నమ్మండి , మీ నమ్మకమే మీ అనుభూతి అయ్యే వరకూ ఏ పుస్తకాలూ చదవకండి. ఒక్క సారి మీ నమ్మకాన్ని ఏది కదిలించలేదు అని అనుకున్నాక వేరే పుస్తకాలు చదవండి , ఎం చెప్తున్నాయో తెలుసుకోటానికి . మా గురువు గారిని నేను అలానే నమ్మాను "అయన కాకి తెల్లగా ఉంది " అంటే.. వుంది కామోసు నాకు మాత్రం  నల్లగా కనిపిస్తోంది , అది తెల్లగా కనిపించే రోజు వస్తుంది అని నమ్మను. మీ సత్యాన్ని కదనుకోకండి అల అని గురవు మాటని లెక్క చెయ్యకుండా ఉండకండి . మీకు ఇవన్ని ఎందుకు చెప్తున్నా అంటే , జీవితాన్ని face చెయ్యాల్సిన వాళ్ళు మీకే తత్వం ముఖ్యం . philosophy life end లో నేర్చుకుని ఎం చేస్తాం ? స్వర్గం పొందుతామ?there is no life after ! life is to live .Application లేని knowledge ఎం చేసుకుంటాం చెప్పండి? philosophy అనేది మీరు ఇప్పుడు తెలుసుకుంటే you guys will laugh at life ,rather  than life laughing at you . దేనినైనా పసి పిల్లల్లా ఆలోచించండి తల్లి , జవాబు ఇట్టే దొరుకుతుంది , బాగా intelligent గా ఆలోచిస్తే confusions tappa ఎం ఉండవు . మీకో విషయం తెలుసా చిన్న పిల్లలు మన భాష నేర్చుకుని మనలో ఒదుగుతున్నారు ఎదగటం లేదు .

ఇలా ముగిసింది మా discussion , తరువాత చాలా సేపు అయన ఆయనకు నచ్చిన పాటలు పాడి వినిపించారు , మేము మాకు నచ్చినవి పాడి వినిపించాము . "Sir  మీరు negative గా రాయలేరు కదా ? " అని అంటే "అసల negativity లేదు అమ్మ ప్రపంచం లో " అని అన్నారు...

 వెళ్ళే అప్పుడు photo  sir అంటే "ఓ పని చెయ్యండి , ఈ వంక పెట్టుకొని మళ్లీ ఒక 4,5 days లో రండి " అన్నారు
it was like a gift for us . "మీరు జీవితం లో ఎన్నో సాధించి , జీవితాన్ని చూసి నవ్వాలి అని  ఆశీర్వదించారు (just for info ,this is the first time in my life ఒకళ్ళకి దణ్ణం పెట్టటం )

Hope this post helped you .Thank you for your time .

Wednesday, July 18, 2012

Moment for a Life


All those happy moments seems to be ages ago..
When my foolish pride has let you go..

When my dreams and yours were nothing apart..
Something went terribly wrong and everything fell apart..
 
My thoughts sailing through the moonlight..
Looking for you in the strangest of the light..
 
That light is from the heart with a hope..
I am not sure how long can I do cope..
 
I have no regrets though…
For every life has only few moments worth living for..
And I have loads of them when you were with me

P.S: Let me know.. how it is.. :)

Tuesday, March 20, 2012

Ramanee

అలో అలో అల్లో  నా పేరు కధ అండి. అదేం పేరు ? అనకండి. నాకు రాసే వారు పెట్టినన్ని పేర్లు ఉన్నాయి, చదివే వారు గుర్తెట్టుకునన్నిపేర్లు ఉన్నాయి. ఏ పేరు గల కధ ని ఐన ఆ కధ , ఈ కధ అంటారే కనీ, అదిగో ఆ 'బుడుగు' ఇదిగో ఈ 'మడుగు' అని అనరు కదా? ఎంటే కధా అర్ధం అయ్యే లా చెప్తేనే కదా ? అని అంటారు అని తెలుసు  సుమా! ఇప్పుడూ "ఓయీ పుల్లమ్మా! ఆ బుడుగు కధ చదివావా? ఈ మడుగు కధ తెలుసునా?" అని అంటారు కదా? అది అన్న మాట కధ!

     ఇంతకీ కధ లోకి వస్తే, అనగనగా ఒక ఊర్లో కధలు రాసేసి బోలెడంత పేరు తెచ్చుకోవాలి  అనుకునే ఒక వెంకట సుబ్బమ్మ ఉందన్నమాట. దానికేమో కధలు రావాయే! ఏదో ఒక వ్యధ ని పెట్టి కధ రాసేది. పైగా వ్యధలు లేనిదే కధలు రావంటుంది. నిజమే అనుకోండి! కనీ ఈ పిల్ల ఒక రోజు వ్యధ లేని  కధ రాస్తాను అంది. అప్పుడు నేను  రాయలేవు అన్నాను. సుబ్బి కి బోలెడంత కోపం వచ్చి రాసి తీరుతాను  అంది. రాయలేవు గాక రాయలేవు అన్నాను నేను. ఇప్పుడే మొదలెడతాను అంది.. హా బ్రమ్హాండగా ... మొదలు పెట్టు, చూద్దాం అని అన్నాను నేను." అందరూ ఆనందం గా ఉన్న ఊరి లో , అందరూ ఆనందం గానే ఉన్నారు, ఎప్పటికీ ఆనందం గానే ఉన్నారు" ఇదే కధ, నేను పకా పకా నవ్వి.. నా ప్రేయసి వ్యధ లేనిదే నేను సంపూర్ణం కాను, అని చెప్పే సరికి సుబ్బి కి అర్ధం అయ్యింది. ఇంక నేను రాయలేను అని అది డీలా పడితే దాని తరపున నేను మీకు కధ చెప్తున్నాను.

      ఒక అందమైన పల్లెటూరు. కను చూపు మేర అంతా పచ్చని పొలాలు. సినిమాల్లో చూపించినట్టు, గబాలున గట్టు వెంట పరుగేట్టేరు! అడుగు  జారి అడుసు లో పాడేరు. అడుసు అయితే పోనీ కడిగెసుకోవచ్చు, అదే చేను నాశనం చేస్తున్నారు అని ఆ ఆసామి వచ్చి నాలుగు తగిలిస్తే , ఒళ్ళు చింతకాయ పులుసు అవ్వుతుంది.అందుకని చేను వదిలి ఊరి మధ్య ఉన్న చెరువు దగ్గరకు వచేద్దాం ఏమంటారు ? చెరువు చుట్టూతా ఇళ్ళు, చెరువుకు ఒక వైపున రామాలయం, రామాలయం ఎదురుగా బడి.

     బడి లో చాలా మంది పిల్లలే ఉన్నారు సుమండీ! అదిగదిగో అందరి లోను.. ఎర్ర గౌను లో కనిపిస్తోందే ఆ పిల్లే రమణీ, మన కధ కి కధా నాయకురాలు. చూడబోతే రమణీ ఎందుకో కస్సు బస్సు మంటున్నట్టు ఉంది, కనుక్కుందాం పదండి.

"రమణీ ! ఎలా ఉన్నావు?"

"ఏదో ఇలా  ఉన్నాను లే"

"ఎవరేమన్నారు నిన్ను ?"

" మా పంతులు గారు పరీక్షలకి ఎలా చదువుతున్నావు అని అడిగి.... ఎందుకు లే "

" చెప్పు.. పర్లేదు "

"ఏముందీ నీకు లెక్కలు సరిగ్గా రావు కదా, నీ ఎదురు రవి ఉంటాడు, పరిక్ష అప్పుడు సాయం చెయ్యమని చెప్పాను ఏదైనా ఇబ్బంది అయితే తను చూపిస్తాడు లే , నువ్వు ఈ పరీక్ష పాస్ అయితే నీ పై చదువులకు నేను సాయం చేస్తాను అని అన్నారు"

" మంచిదే కదా?"

"ఏంటి మంచిది? నీకు చేత కాదు కానీ ... అని అవమానిస్తేను... నీకు అర్ధం కాదు లే "

అని చర చరా వెళ్ళిపోయింది.

రమణీ పరీక్ష ఎలా రాసిందో కనుక్కుందామని ఇలా కాపు కాసి కూర్చున్నా, వాళ్ళ బడి బయట. అదిగో వస్తోంది రమణీ.

" పరీక్ష ఎలా రాశావు రమణీ? మనలో మన మాట రవి చూపించాడ? నువ్వు చూసి రాశావా?"

"వాడు చూపిస్తూనే ఉన్నాడు, కానీ  నేనే వాడి దాంట్లో చూసి రాసేది ఏంటి అని సొంత గా రాసేసాను...."

ఏమనుకుందాం అండీ ఈ పిల్లకి ? పొగరా? ఆత్మ విశ్వాశామా? ఏదో ఒకటి లెండి ...

ఒక పది రోజుల తరువాత నాకు రమణీ ఏడుస్తూ కనిపించింది..

"ఏం ఏడుస్తున్నావ్?"

"నేను లెక్కల్లో ఫెయిల్ అయ్యాను , మిగతా  అన్ని ఫస్ట్ క్లాసు కానీ లేక్కలోక్కటే పోయింది.."

నేను చెప్పలేదటండి, ఈ పిల్ల కి పొగరే...

"అయ్యో రమణీ పరీక్ష పోతే పోయింది ఏడవకు..."

" ఇంక అంతే! నాన్నగారిని పై చదువుల గురించి అడగలేను..."

"అదెంత పని మల్లి రాసి పాస్ అయ్యి అడగచు లే .."

" లేదు లే పెళ్లి చేసేస్తాను అని అమ్మ తో అన్నారు ... నా తల రాత ఇదంతా..."

అని... పరిగెట్టుకుని  వెళ్ళిపోయింది . ఎప్పుడు నా మాట పూర్తి గా విన్నది కనుక?

ఆ తరువాత రెండేళ్ళు నాకు రమణీ ఎక్కడుందో తెలియలేదు... ఎవరో వైజాగ్ లో వాళ్ళ నాన్న

వాళ్ళు hotel  పెట్టుకున్నారు అని విని పలకరిద్దాం అని వెళ్ళాను ..

రమణీ ఏడుస్తోంది ... ఎవరికీ కనిపించకుండా..

వాళ్ళ అమ్మ నాన్న పెద్దగా వాదించుకుంటున్నారు ...

"ఇంతకముందు వద్దనుకున్నాం కదండీ?  పని ఉంది అని ఊరు వెళ్ళిన వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పకుండా

పెళ్లి కుదుర్చుకొని వచ్చాను అంటే?" అని అంది రమణీ వాళ్ళ అమ్మ

"అంటే పెళ్లి కుదిర్చినట్టు."

"బాగుంది నాకు చెప్పకపోతే చెప్పకపోయారు , పెళ్లి అనుకునే అప్పుడు అమ్మాయిని ఒక్క మాట అన్నా అడగాలి కదా..?"

"ఏమిటే దానిని అడిగేది  నిన్ను అడిగేది? అతనకి ఉన్నది చిన్న లోటు అంతే, దానిని ఎత్తి  చూపించకుండా,

అమ్మాయికి సర్ది చెప్పి పెళ్ళికి తయారు అవ్వండి" అని తీర్మానం చేసారు ఆయన.

రమణీ ని చూస్తే జాలి వేసింది.. పలకరించ బుద్ధి కాలేదు.

మళ్ళి ఒక ఐదు ఏళ్ళ తరువాత, తను ఎలా ఉందో చూడాలనిపించింది.

ఎలా ఉందో ఏంటో , ఏం చూడాల్సి వస్తుందో అని భయపడుతూనే వెళ్ళాను ....

కనీ తను ఎంచక్కా ఇంటి పనులు చేసుకుంటూ ఉంది... ప్రశాంతం గా ఉంది అనిపించింది

"రమణీ ... ఎలా వున్నావు?"

"కధా? నువ్వా ? ఎన్ని రోజులైంది  చూసి..? నేను బానే ఉన్నాను.."

"నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగింది కదా?"

" కొన్ని అల జరిగిపోతుంటాయి.."

"నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చాను, నిన్ను పలకరించే ధైర్యం లేక తిరిగి వెళ్లి పోయాను.."

"పోనీ లే వదిలెయ్యి..."

"నువ్వు ఆనందం గానే ఉన్నావా?"

"బానే ఉన్నాను అని చెప్పాగా...  ఇద్దరు పిల్లలు ... బయట ఆడుకుంటున్నారు.."

"మీ ఆయన మంచి వాడేనా?"

"మంచో చెడో.. నువ్వు ఇప్పుడు ఆర్చేది తీర్చేది ఏం ఉంది చెప్పు? నేను చాలా ఆశలే పెట్టుకున్నా జీవితం లో, చదవాలి అని ఇంకోటి అని.. అన్ని అనుకున్నట్టు జరగవు గా, అల జరగలేదు అని ఎప్పటికీ ఏడుస్తూ ఉండి పోలేను గా ? నా పిల్లలు నేను బాధ పడినట్టు బాధ పడ కూడదు అని .. నా తాపత్రయం... అలానే పెంచుతున్నాను కూడా... ఈ సోది అంత ఎందుకు కానీ  ... ఉండు తినటానికి ఎమన్నా తీసుకొస్తాను"
అని చర చరా వంటింట్లోకి వెళ్ళిపోయింది.

ఆడ పిల్ల అనిపించుకుంది రమణీ.... పందిరి ఎలాంటిదైన...మల్లె తీగ మాత్రం ఘుబలించే పూలనే పూస్తుంది...
మన లో ఉన్నా రమణీ లకి అందరికీ... పాదాభి వందనం చేస్తూ ... నన్ను నేను అంకితం ఇస్తున్నాను అంటే...
ఈ కధ అంకితం చేస్తున్నాను..

ఇట్లు
మీ కధ.

Thursday, March 08, 2012

Aakasamantha ....

On the eve of Women’s day when everyone else is talking about women empowerment and women rights, equality and achievements, I would like to talk about them too. But, today I just feel like having a little “Jugalbandi,” (a short story in English followed by a little poetry that portrays a girl’s heart).


Before I start, for the starters it is not a story that has an ending, for that matter I do not discuss the end. If it ends happily, then the  people who were in the story are the luckiest people. If it doesn’t end happily, you know.. these poets, writers and many other people will get credit for that story, stating that “It’s so natural and realistic” We love those kinds of stories because, somewhere sometime we might have been part of such failures, if not us directly our friends or  someone else because we stumble upon failures more often than on successes in our lives.

Coming into the story…

Long long ago there lived a girl who believed on doing what she felt right from her heart, she was good and adamant, kind and jealous, talented and stupid, beautiful and she knows that she is beautiful( you may think I am feminist, but being a girl I can imagine easily how a girl feels like. Its rather tough to get into a Guy's shoes). She was once working in God’s favorite garden (She was told by God to plant few plant saplings in the Garden). In the afternoon from the fogs of January, there came a boy who was watching the girl from morning in the garden( He was the actual Gardener). Soon, they became friends. They worked together, they laughed together, and they learned together.

One fine morning boy thought that he cannot have this happiness when the girl completes to plant all the plant saplings. He thought that God will take her away after she finishes her work. He started unearthing the planted saplings at night when the girl was asleep to make her stay for few more days.

God came to know about this and called the boy and told him “Son, I made both of you to be friends forever. I don’t see a reason why you behave like this and spoil the garden. She is working hard every day and you are spoiling her work. Is this the way to show your love? Why don’t you just walk to her and ask her to stay with you? I don’t understand why should you complicate things for yourself, why can’t you open your mouth and just say how you feel? I am very disappointed with you. I am bound to give a curse to everyone who does a bad thing. I hereby curse you that you can never express your love to the girl.” The boy was ashamed of himself and never told the girl about his curse.

After few days, girl completed her work, God called her and told “My dear, I am very impressed by your work, please let me know what boon you want from me. “

Girl: “Dear God, Please let me stay in this garden forever!”

God:” Why do you want to stay here?”

Girl: “Because I love the Gardener”

God: “ok! You may stay here, but I would like to hear if Gardner loves you too. Only then you can stay here.”

Girl: “I know he does, I am sure of it”

God: “Then prove it! Don’t let him know that you love him before you make me hear him about his love”

Girl: “oh thank you God !thank you so much!”



But the girl never was able to make God hear about boy’s love due to his curse. So she had to leave the Garden, but she knows deep down that he loves her. And finally as a parting gift she gave him this poem and  left  forever (She is a Telugu girl probably :-) ) .

నేను చెప్పలేనంత
నువ్వు కొలవలేనంత
నేను మరువలేనంత
నువ్వు కలవలేనంత
నేను దాచాలేనంత
నువ్వు చూపలేనంత
మన మధ్యన ఉన్న ప్రేమే గా ఇదంతా!


P . S : Happy Women 's Day !




Thursday, February 16, 2012

నీటి బుడగ


నా పేరూ ... హా అప్పుడే ఎందుకు లేండి కధ ముగించే అప్పుడు చెప్తాను. నన్ను అయితే అందరూ 'చిన్నా' అని కానీ 'బాబు' అని కానీ పిలిచే వాళ్ళు. మరేమోనండి, నాకేమోనండి చిన్నప్పటి నుండి చిన్న పిల్లలు అన్నా, కోతి పిల్లలు అన్నా యమా చిరాకు. మా ఇంటి పెరట్లో ఉన్నజామ చెట్టు ఎక్కి మేము లేకుండా చూసి పళ్ళు కోసుకునే పిల్ల మూకలు అంటే మహా అక్కసు నాకు. నాకు దొరికారో వెధవల్ని రాళ్ళ గడ్డలు పెట్టి కోట్టే వాడిని. మా అమ్మామ్మ ఏమో నాకు ముక్కు మీద కోపం అనేది.పిల్లలే కాదు పెరటి గంగాళం లో నీళ్ళు తాగే కాకుల్ని చూసినా అన్నం తినే వాడిని సైతం లేచి వాటిని తరిమేసే వాడిని. సాయంత్రం మాట్లు చక్కగా స్నానం చేసి అరుగు మీద కూర్చునే వాడిని , దారిన పోయే వాళ్ళని చూస్తూ.మా నాన్న ఎప్పుడన్నా డబ్బులు ఇస్తే కోమటి కొట్లో ఇచ్చి బిస్కత్తో, మిట్టాయో కొనుక్కునే వాడిని. ఎవరికీ పెట్టె వాడిని కాదు! పెట్ట బుద్ధి అయ్యేది కాదు. మా అమ్మమ్మ మా నాన్న తో గొడవ పడి మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక మా నాన్న కి నేనే వండి పెట్టె వాడిని. వంట అన్నా, రుచిగా తినటం అన్నా మహా ఇష్టం నాకు. మా అమ్మమ్మ కానీ మా నాన్న కానీ ఎప్పుడన్నా ఏదన్నా అన్నారో నాకు చాలా కోపం వచ్చేసేది , కిటికీ తలుపులు అవి విరిగిపోతాయేమో అని అనిపించేంత శబ్దం వచ్చేలా వేసే వాడిని. మరి నేను అంటే అంతే మరి ! ఏమనుకున్నారో !




అందరూ నన్ను తిక్క శంకరయ్య, అనే వాళ్ళు. మా నాన్న కూడా నన్ను ఇంకో పేరు తో పిలిచే వారు, అది కూడా చివర్లోనే చెప్తాను.అన్నట్టు నేను ఆరు అడుగుల ఎత్తు, సన్నగా సువ్వ లాగ , ఆజాను బాహుణ్ణి, ఎర్రగా కూడా వుండే వాడిని, నా కళ్ళు కూడా చాలా బాగుంటాయి, కానీ ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు కారు. అందరూ నా మొఖం చూస్తారేంటి? నా కళ్ళు చూడరెంటి అని అడుగుదామా అని అనుకునే వాడిని. కానీ వాళ్లకు కళ్ళు లేవా ? అవి కనపడవా? మనం ఎందుకు చెప్పాలి అని అనుకోని ఊరుకునే వాడిని.



నాకు ఆరవ ఏట "పాపక్క పోయిందంట" అని అందరూ పరుగేతుకొని పొలానికి వెళ్లారు. నాకు కూడా పరిగెత్తాలి అనిపించింది, కానీ పరిగేత్తలేను, ఎందుకంటే నాకు పుట్టుక తోనే గుండె జబ్బు ఉంది, ఒక సారి మా నాన్న ఆపరేషన్ చేయించారు కానీ లాభం లేదు అనేసారు డాక్టర్లు. అయినా పోవటం ఏంటో నాకు అర్ధం కాలేదు.కాసేపటికి అమ్మ ఇంటికి వచ్చింది, కానీ పడుకునే ఉంది. అన్నయ్య ఏమో ఏడుస్తున్నాడు. మళ్లీ కొంత సేపటికి అమ్మ నిద్దరోతూ నే వెళ్ళిపోయింది, ఎంత సేపు ఎదురు చూసినా రాలేదు. ఇహ అప్పటి నుండి ఆకలి అనిపిస్తే అమ్మమ్మ నే అడిగే వాడిని. నా మొహం నిండా స్పోటకం మచ్చలు ఉండేవి. పుట్టినప్పుడే నా పై పెదం రెండుగా చీలిపోయింది. మాట్లాడగలను, కానీ అవతల వాళ్లకి అర్ధం కాదు, గ్రహణ మొర్రి అంటారుట, మా మావయ్య వాళ్ళ అబ్బాయి రవి చెప్పాడు నాకు.



మంచేదో చెడేదో నాకు అస్సల తెలియదు అని అనే వారు అంతా. నాకు తెలియదు, నాకు తెలిసిందల్లా దగ్గటమే! బడికి వెళ్ళే వాడినా పది అంగల దూరానికి నాలుగు సార్లు ఆగే వాడిని. దగ్గు రాలేదంటే రెండో పిరియడ్ కి అంతా బడికి వెళ్ళే వాడిని. దగ్గు వచ్చిందా ... ఇహ చూసుకోండి రక్తం పడటం అది తుడుచుకోవటం , నన్ను చూసి బడికి వెళ్ళే పిల్లలకి అదో వేడుక.కొంత మంది అయితే రాళ్ళూ విసిరే వారు కూడా! నేను తిరిగి విసురుదమనుకునే వాడికి కానీ ఓపిక ఉండేది కాదు, మళ్లీ ఇంటికి తిరుగు ప్రయాణం. అందుకే నాకు అల్లరి పిల్లలు అంటే అంతెందుకు మామూలు పిల్లలు అన్నా నిక్కచ్చిగా కచ్చే! నాకు నా పేరు రాయటం తెలుసు తెలుసా? కొంచం కొంచం ఆలస్యం ఐనా చదవగలను కూడా ఏమనుకున్నారో!



నాకు ఎవ్వరికి ఇవ్వటం రాదు , ఇష్టం లేదు కూడా.కానీ ఇవ్వటం నేర్చుకున్నా. మా అన్నకొడుకు తెలుసా మీకు? అచ్చం నా లాగే సన్నగా, సువ్వ లాగ , ఎర్రగా, అందమైన కళ్ళు , కానీ కానీ బాగున్నాడు! మచ్చలు లేవు , పెదం అంతా ఒకటే లాగ ఉంది. లేత తమలపాకు లాంటి మొహం మీద ఆల్చిప్పలాంటి కళ్ళు.నేను ఇలానే ఉండే వాడినేమో! అందరూ నా పోలికలే అంటున్నారు, కానీ వీడు బాగున్నాడు, నాలానే వున్నాడు, కానీ బాగున్నాడు. అందుకే నాకు వాడంటే ఇష్టం. వాడికి పెట్టె వాడిని నా తాయిలాలు. వాడి తో పాటుగా వాడి పిన్ని పిల్లలూ అలవాటయ్యారు. నేను చిన్నప్పుడు దాచుకున్న బంతి వాళ్లకి ఇచ్చి , వాళ్ళు ఆడుతుంటే చూస్తూ కూర్చునే వాడిని. నేను ఆడలేను కదా మరి! కానీ బంతి నాకు తగిలితే యమా కోపం వచ్చేది నాకు.



చాన్నాళ్ళ తరువాత పిల్లలు ఊరు నుండి వచ్చారు నన్ను చూడటానికి, వాళ్లకి పునుగులు పెట్టాను , అవి తిని , కాసేపు ఆడుకొని, వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయారు. వెళ్ళిన కాసేపటికి, ఎప్పటి లాగే గుండెల్లో నొప్పి , బాధ, పాత నేస్తమే కానీ ఏదో కొత్తగా పిలుస్తున్నట్టు తోచింది. నాకు అర్ధమవ్వుతోంది, నేను కలలు కన్నా రోజు ఇదే అని, నాన్న పాపం ఎప్పటి లాటి నొప్పే అనుకోని , మందులు వేస్తున్నాడు. నాకు మాత్రం నొప్పి, ఆనందం తెలుస్తూనే ఉన్నాయి. అమ్మ పోయినప్పుడు పోవటం అంటే తెలియదు , ఇప్పుడు తెలుస్తోంది విముక్తి చెందటం అని. 'వాడు నా లానే ఉన్నాడు, కానీ బాగున్నాడు , నేను అలానే ఉండే వాడినేమో' అనుకుంటూనే నా శ్వాస అనంత వాయువుల్లో కలిసిపోయింది. మా నాన్న అనగా నేను విన్న చివరి మాట "హయ్యో అల్పాయుషు వెధవా" అని బిగ్గరగా ఏడ్చాడు . "నాన్న! నా పేరు "విశ్వేశ్వరం" " అనాలి అని ఉన్నా అన లేక చక్కా నిద్దరోయాను కళ్ళు మూసుకొని.

P.S: This post is a tribute to the person who actually knows that this is his own story.