Tuesday, April 22, 2014

సిరి వెన్నెల్లో కాసేపు - I

ఫలానా పేజి వాళ్ళు / ఫలానా బ్లాగు వాళ్ళు సీతా రామ శాస్త్రి గారి ఫాన్స్ అంట! ఎప్పుడూ అయన భజనే చేస్తారు  అని ఎవరన్నా  అన్నా,  లేదా అనుకున్నా .. ముందే చెప్పేస్తున్నాం మేము , ఈ పేజి admins  ఆయనకు ఫాన్స్ ఏ కాదు devotees లాంటి వాళ్ళం ఇంచు మించు. అలాగని  మాకు స్పెషల్ 'ism' మొదలుపెట్టే ఉద్దేశం లేదు.

   ఇంక విషయంకి వస్తే, మీలో ఎంత మంది ఆడపిల్లల్ని ఏడిపించి ఉంటారు? అంటే....  అలా అనుమానంగా  చూడకండి బాబు! Eve Teasing అలా కాదండి,మీకు బాగా పరిచయం ఉన్న అమ్మాయిల్నే.. ఫ్రెండ్స్ కానివ్వండి,
గర్ల్ ఫ్రెండ్స్ కానివ్వండి, మరదళ్ళని? కోపంగా  వాళ్ళు  ఉడుక్కుంటుంటే చూసి ఇంకా ఉండికించాలి అని అనిపించని అబ్బాయి ఉండడేమో... అలాగే అలా  ఎవరన్నా ఏడిపిస్తుంటే .. పైకి ఉడుక్కున్నా లోపల  మురిసిపోని  అమ్మాయి ఉండదేమో ( అయ్యా ! క్షమించండి రహస్యం చెప్పేశానా ?) ఐనా ...   "కాస్తో కూస్తో కుర్రాళ్ళ గొడవ , జిల్లు అంటుందే   ప్రతి కన్నె ఈడు " అని టబు  అంత  బాహాటం గా చెప్పాక ఇంకా రహస్యం ఏముందండి.. నా పిచ్చి గాని...

   ఇంతకీ  అలా  ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే, తనకు కాంప్లిమెంట్  ఇస్తున్నట్టు ఉండాలే కానీ .. కన్నీరు పెట్టుకునే లా ఉండకూడదు, ప్రతి అమ్మాయి లో కూడా అమ్మ తత్త్వం ఉంటుంది ఎక్కడో చోట దానిని కించపరచకుండా, కాంప్లిమెంట్ ఇస్తూ... ఉడికించ గలిగిన అబ్బాయి ( బహుశా  , 10 ఇంట 9 సార్లు ఆమె హృదయాన్ని గెలుచుకుంటాడు) అని శాస్త్రి  గారు అంటారు. ఇంతక ముందు నేను ఆయన్ని కలిసినప్పుడు.. "ఆడించి అష్ట చెమ్మ ", "హాయి రే హాయి . జాంపండు రోయి " పాటలు వినిపించారు .. కాని మొన్న మాత్రం...  "పండగ"  సినిమా లో "కో
కో కోపమా " పాట వినిపించారు .. ఆ పాట  ఎంత ముద్దుగా ఉందో  చెప్పలేను  ( అబ్బాయిలూ!  మీకో సలహా .. ఈ సారి మీ సుందరాంగి అలిగినప్పుడు ఈ పాట  పాడండి... ఖచ్చితంగా  .. అంటే ఖచితంగా   ఆమె మనసులో, ప్లేసు  మీకు రిజర్వు కాకపోతే నన్ను అడగండి)

 కో కో కోపమా కొత్త సిగ్గు దీపమా .. ఎర్రగా కందేనమ్మ..
పై పై పంతమా .. పట్టు నెగ్గు పందేమా .. వెర్రిగా చిందెనమ్మ

ఈ గయ్యాళి  గంగమ్మ కోపం ఏ కొంప ముంచెందుకో .. ( అమ్మాయిని గంగ తో  పొల్చి.. తన కోపం గంగా నది ప్రవాహం తో పోల్చారు )
ఈ వయ్యారి వాగమ్మ  వేగం .. కింద మీద చూడకుండా  పొంగుతోంది ఎందుకో ..

పాల పొంగుకెందుకో నీటి మీద కోపం ? నేల పాలు కాకముందే ఆపినందుకా?
( పొంగే పాలని మరగబెట్టాలి అంటే కట్టెల పొయ్యి మీద... నీళ్ళు పోసి పొంగు ఆపి మరగబెట్టే వాళ్ళు, ఇప్పటి లాగా సిం లో పెట్టటం  లేదు మరి! )
నీలి మబ్బుకేలనో  నేల  మీద కోపం? గుండె లోని భారం అంత దించినందుకా ?
(వర్షం  రూపం లో)
పాపమ్మొ ఇక ఆపమ్మో  నను కవ్వించే నీ కోలాటం..
పోనీలే అని చూస్తుంటే శృతి మించిందే నీ వాటం..

రాసనిమ్మపండు రో  ఎంత రోషం ఉంది రో,  పళ్ళు  రాలిపోవునంత పుల్లగుందిరో
( రాస నిమ్మపండు అంత అందంగా ఉంది కానీ అమ్మాయిగారికి పొగరు ఉంది అని చెప్పటం)

ఉల్లిపాయ గుండెలో ఎంత ఘాటు ఉంది రో , కళ్ళ నీళ్ళు ఊరు దాటి ఊరుతోంది రో..

(అది, ఇది , రావే, గీవే ... ఇలా అయన వాడనే వాడరు.. వాడినా  చనువు తో వాడినట్టు ఉంటుందే తప్ప కించ పరుస్తున్నారు అనే భావన రమ్మన్నా రాదు .. అలా వచ్చే లా రాసే వాళ్ళు వేరే ఉన్నారు లెండి)

ఉడతమ్మ, నువ్వు ఊపేస్తే పడిపోవాలా పళ్ళన్నీ ... జింకమ్మ, నువ్వు జడిపిస్తే జంకాలా పులులు అన్నీ

(ఇక్కడ పోలిక చిరుతా సినిమాలో  "ఏక్  బార్" పాట లో ...  "లావా నే లాలిస్తావా  లావణ్యమా ... సంద్రాన్నే ముంచేస్తావా సెలయేరమ్మా "  ఇది గుర్తుకోచింది ( నాకు కాదు లెండి మా ఫ్రెండ్ కి , నాకు కూడా తస్సదియ్య!  నిజమే కదా!! అనిపించింది ))

పిచ్చుకా ఊరుకో , పిచ్చి పనులు మానుకో .. ముక్కోతో గుచ్చుతుంటే గోడ పెచ్చులు ఊడవమ్మ!

( ఈ లాస్ట్ లైన్ క్యూట్ అంటే క్యూట్ ... ఇంక అంత కన్నా ఎం చెప్తాం)

--






No comments:

Post a Comment