Friday, February 03, 2012

Jaladhi--Vaidehi

ప్రియమైన సంద్రమా!

       ఆకాశం తాకుదామని ఎగసి పడుతున్నావా?
       తాకలేను అని నిరాశ చెంది  వెను  తిరుగుతున్నావా?
       ఆశ చావక మరో సారి ప్రయత్నిస్తున్నావా?
       ఎందుకు నీకీ ఆరాటం?
       ఎంత వరకు సాగిస్తావు నీ పోరాటం?
       మా కోసం ఏదన్న సందేశం మోసుకొస్తున్నావా?
       వినే వారు కాన రాక వెనుకంజ వేస్తున్నావా?
       నిలకడ గా ఉండ లేవు( కోపం, బాధ)
       నిండా ముంచనూ లేవు( ప్రేమ, వాత్సల్యం)
       నీ తీరు, నీ లోతు కలిస్తే మఘువ మనసేమో అనిపిస్తుంది నాకు
       సంద్రం అంతా జలపాతం అయితే అతివ గుండు లోతు తేలుతుందేమో!
       జలధి లోతు అంతా ఎతుకు వెళ్ళి నిలుచున్నా ఆమె మనో శిఖరం అగుపించాదేమో!
        గొంతు దాటని రాగాలెన్నో!
        పెదవి దాటని పలుకులు ఎన్నో!
        కళ్ళు దాటని కన్నీళ్ళు ఎన్నో !
        మనసు దాటని ప్రేమలు ఎన్నో!
        గుండె దాటని మంటలు ఎన్నో!
        మౌనమైన మాటలు ఎన్నో!
        కాలము చేరని కావ్యాలు ఎన్నో!
        బంధాలు కాని మమతలు ఎన్నో!
        మమత లేని బంధాలు ఎన్నో!
        నిజాము లేని నవ్వులు ఎన్నో!
        నవ్వులు కాని నటనలు ఎన్నో!
ఐన ఇంటింటికి దీపమై వెలిగే మఘువలు ఎందరో!
ఉప్పతనం చప్పరించి ప్రపంచానికి చిరు జల్లులు ఇచే సంద్రాలు ఎన్నో!

      

1 comment:

  1. I feel it whiel reading.
    It is a wonderful post...Naresh

    ReplyDelete